చర్మాన్ని స్మూత్ గా, గ్లోయింగ్ గా మార్చుకునే సింపుల్ టిప్స్..!

Posted By:
Subscribe to Boldsky

చాలామంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా.. అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ ఉంటే.. దురద, ఇన్ల్ఫమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు.

డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే.. చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చే రెమిడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రయత్నిస్తే.. మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఈ తేడా గమనిస్తే.. మీరే ఆశ్చర్యపోతారు.

ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో హోం రెమిడీస్ తో అందమైన స్కిన్ సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపిక చేసుకుని.. డైలీ ఈ స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఫాలో అయితే.. స్కిన్ చాలా స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.

Best Natural Home Remedies for Baby Soft Skin

దాల్చిన చెక్క
అర టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి, మూడు టీ స్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

Best Natural Home Remedies for Baby Soft Skin

నిమ్మరసం
నిమ్మరసం స్కిన్ కి బ్లీచ్ లా పనిచేస్తుంది. పింపుల్ స్పాట్స్ ని కూడా తేలికగా తొలగిస్తుంది. సిట్రస్‌ ఎక్కువగా ఉండే నిమ్మ క్లెన్సర్ లా చర్మంపై మృతకణాలను తొలగించి.. స్కిన్ ని సాఫ్ట్ గా మారుస్తుంది.

Best Natural Home Remedies for Baby Soft Skin

టమోటా
టమోటా న్యాచురల్ స్కిన్‌ టోనర్ లా పనిచేస్తుంది‌. మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలను తేలికగా నివారిస్తుంది. టమోటా గుజ్జును ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. రోజూ ఇలా చేస్తే చర్మంపై అసహ్యంగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి.

Best Natural Home Remedies for Baby Soft Skin

గడ్డు, నిమ్మరసం
నిమ్మకాయలోని సగం నిమ్మరసం తీసుకుని, గుడ్డులోని తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి రాసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీ చర్మం స్మూత్ గా మారిపోతుంది.

Best Natural Home Remedies for Baby Soft Skin

తేనె
తేనెలో గుడ్డు తెల్లసొన కలిసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడేసుకుకోవాలి. గుడ్డు వాసన పోయేందుకు మైల్డ్‌ సబ్బుతో మఖం కడుక్కోవచ్చు. ఇలా చేస్తే చర్మం స్మూత్ గా మారుతుంది.

Best Natural Home Remedies for Baby Soft Skin

నీళ్లు
చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా ఉండాలంటే రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు కంపల్సరీ తాగాలి. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ కి దూరంగా ఉండాలి.

English summary

Best Natural Home Remedies for Baby Soft Skin

Best Natural Home Remedies for Baby Soft Skin. Every girl wants baby soft skin and for that we spend a lot of money on the skin care product that makes the skin softer and baby like smoother.
Please Wait while comments are loading...
Subscribe Newsletter