బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి కోకనట్ వాటర్ ఫేస్ మాస్క్..!

కోకనట్ వాటర్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి లు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, చర్మ రంధ్రాలను క్లోజ్ చేస్తుంది, చర్మం రంగును మెరుగుపరుస్తుంది. చర్మంను బ్రైట్ గా మార్చుతుంది.అంతే కాదు,

Posted By:
Subscribe to Boldsky

టండర్ కోకనట్ లేదా కొబ్బరి బోండంలో ఉండే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి మనందరికీ తెలిసన విషయమే..టండర్ కోకనట్ లో రిఫ్రెషింగ్ గుణాలు, బాడీకి తగిన హైడ్రేషన్ ను అందివ్వడంలో గ్రేట్ నేచురల్ డ్రింక్ టండర్ కోకనట్ . హాట్ సమ్మర్ లో కూల్ కూల్ గా బాడీకి హైడ్రేషన్ ను అందించే హెల్తీ అండ్ ఎనర్జీ డ్రింక్ కొబ్బరి బోండాం. కొబ్బరి బోండాంలో ఎలక్ట్రోలైట్స్ అత్యధికంగా ఉండటం వల్ల బాడీకి అవసరమయ్యే ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది. టండర్ కోకనట్ లోని బెనిఫిట్స్ అన్నీ శరీరంలో అంతర్గత అవయవాలకే పరిమితం అనుకుంటే మీరు పప్పులు కాలేసినట్లే, ఎందుకంటే కొబ్బరి బోండాం శరీరానికి అంతర్గతంగా ఎన్ని ప్రయోజనాలను అందిస్తుందో, అదే విధంగా బహిర్గతంగా కూడా శరీరానికి, చర్మానికి ప్రయోజనాలను అందిస్తుంది.

కొబ్బరి నీళ్ళలో ఉండే గుణాలు చర్మంలో ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది, స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, చర్మ కాంతిని పెంచుతుంది. చర్మం రంగును బ్రైట్ గా మార్చుతుంది. ఇన్నిమంచి గుణాలున్న టండర్ కోకనట్ వాటర్ ను బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి ఫేస్ మాస్క్ లలో విరివిగా ఉపయోగించుకోవచ్చు.

టండర్ కోకనట్ వాటర్ లోని స్కిన్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలనుందా? టండర్ కోకనట్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్, సైటోకినిన్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి ప్రీమెచ్యుర్ ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ఏజింగ్ లక్షణాల కనబడనివ్వకుండా చేసే కొల్లాజెన్ ఉత్పత్తిని చర్మంలో పెంచుతుంది.

Coconut Water Face Masks For Instantly Brighter Complexion!

ఇంకా, కోకనట్ వాటర్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి లు డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, చర్మ రంధ్రాలను క్లోజ్ చేస్తుంది, చర్మం రంగును మెరుగుపరుస్తుంది. చర్మంను బ్రైట్ గా మార్చుతుంది.అంతే కాదు, కోకనట్ వాటర్ లో ఇంకా ఆరోగ్యానికి, అందానికి సహాయపడే మెగ్నీషియం, పొటాషియం, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి అవసరమయ్యే హైడ్రేషన్ ను అందిస్తుంది. చర్మం కాంతివంతంగా మార్చుతుంది.

ఇన్ని ప్రయోజనాలుంటాయన్న విషయం మీకు కూడా తెలియదు కదా? అందుకే ఇంతకు ముందెన్నడూ కోకనట్ వాటర్ ను బ్యూటీ కోసం ఉపయోగించి ఉండరు. కాబట్టి, ఇప్పుడు మీకు ఒక గొప్ప అవకాశం , ఈ ఫెస్టివల్ సీజన్ లో కోకనట్ వాటర్ తో ఫేస్ ప్యాక్ వేసుకుని, చర్మ సౌందర్యాన్ని ఇన్ స్టాంట్ గా మెరుగుపరచుకుని, అందరికంటే మీరే స్పెషల్ గా...అట్రాక్టివ్ గా కనిపించండి. ఇంకెందుకు ఆలస్యం కోకనట్ వాటర్ తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..!

స్కిన్ బ్రైటనింగ్ మాస్క్

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కోకనట్ వాటర్ , కీరదోకాయ జ్యూస్ రెండూ సమంగా తీసుకుని, రెండూ బాగా కలిసేలా బ్లెండ్ చేయాలి. ఈ ద్రవాన్ని ముకం, మెడకు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి. డ్రై అయిన తర్వాత కాటన్ తో తిరిగి మరో కోట్ వేసుకోవచ్చు. ఇలా ఫేస్ మాస్క్ వేసుకున్న అరగంట తర్వాత ప్లెయిన్ వాటర్ తో ముఖం క్లీన్ చేసుకోవాలి.

స్కిన్ టోనర్ :

చర్మ కాంతిని మెరుగుపరచడంలో గ్రేట్ గా సమాయపడుతుంది, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది, చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ఉండే పైనాపిల్ జ్యూస్ తీసుకుని, అందులో కోకనట్ వాటర్ మిక్స్ చేయాలి. కాటన్ ప్యాడ్ ను డిప్ చేసి, ముఖం, మెడకు అప్లై చేయాలి. పూర్తిగా తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

డీటానికింగ్ మాస్క్ : స్కిన్ బ్రైటనింగ్ కోకనట్ వాటర్ మాస్క్ చర్మంలో టాన్ ను తొలగిస్తుంది. చర్మం వాపు, దురద, వంటి లక్షణాలను నయం చేస్తుంది. చర్మంలో మలినాలను తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ (ముల్తానీ మట్టి )తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కోకనట్ వాటర్ కూడా మిక్స్ చేసి, మన్నికైన క్లెన్సర్ తో ముఖం మెడను శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వేసుకున్న 15 నిముషాల తర్వాత శుబ్రం చేసుకోవాలి.

డీటానికింగ్ మాస్క్ :
స్కిన్ బ్రైటనింగ్ కోకనట్ వాటర్ మాస్క్ చర్మంలో టాన్ ను తొలగిస్తుంది. చర్మం వాపు, దురద, వంటి లక్షణాలను నయం చేస్తుంది. చర్మంలో మలినాలను తొలగిస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ ఫుల్లర్స్ ఎర్త్ (ముల్తానీ మట్టి )తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కోకనట్ వాటర్ కూడా మిక్స్ చేసి, మన్నికైన క్లెన్సర్ తో ముఖం మెడను శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వేసుకున్న 15 నిముషాల తర్వాత శుబ్రం చేసుకోవాలి.

రిఫ్రెషింగ్ ఫేస్ స్ప్రే

ఈ రిఫ్రెషింగ్ ఫేస్ స్ప్రే థెరఫిటిక్ గుణాలు కలది, ఇది స్కిన్ ప్యూరిఫై చేయడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఉపయోగిస్తే చర్మానికి ఇన్ స్టాంట్ గా గ్లో వస్తుంది. చర్మంలో ఉండే నల్ల మచ్చలు కనబడనివ్వకుండా చేస్తుంది
కోకనట్ వాటర్ , రోజ్ వాటర్ సమంగా తీసుకోవాలి. రెండూ బాగా మిక్స్ చేసి, స్ప్రే బాటిల్లోకి మార్చుకుని, రిఫ్రిజరేటర్లో స్టోర్ చేయాలి. రోజుకొక్కసారి ఈ వాటర్ ను ముఖానికి స్ప్రిట్జ్ చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉండి తర్వాత ముఖం క్లీన్ చేసుకోవాలి.

డెడ్ స్కిన్ తొలగించే కోకొనట్ వాటర్ స్క్రబ్

ఈ స్క్రబ్ వల్ల స్కిన్ ఎక్సఫ్లోయేట్ అవుతుంది, డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది. చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు లేదా మినప్పు పౌడర్ తీసుకుని అందులో కొద్దిగా తేనె, కోకనట్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్ కు ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. డ్రైగా మారిన తర్వాత కొన్ని నీళ్ళు చిలకరించి, సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయాలి. 5 నిముషాలు స్ర్కబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని ప్లెయిన్ వాటర్ తో వాష్ చేసుకోవాలి

 

స్కిన్ వైటనింగ్ మాస్క్

ఈ మాస్క్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది, బేబీ సాప్ట్ స్కిన్ పొందుతారు . ఒక టేబుుల్ స్పూన్ గంధం పౌడర్ కు కుకుంబర్ జ్యూస్, తేనె , కోకనట్ వాటర్ సమంగా తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

Coconut Water Face Masks For Instantly Brighter Complexion!

Tender, refreshing and hydrating coconut water, yes we know that's exactly what we like. During sweltering heat of the summer, coconut can give a new lease to life. And if you thought its benefits are restricted internally, you cannot be further away from the truth.
Please Wait while comments are loading...
Subscribe Newsletter