మచ్చలు, ముడతలు.. చర్మ సమస్యలన్నింటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్..!

క్లియర్ స్కిన్ పొందడానికి ఒక అద్భుతమైన, మీరే ఇంట్లో తయారు చేసుకోగలిగే మాస్క్ ఉంది. నిజం.. దానిపై రిసెర్చ్ చేసి.. అది మెరుగైన ఫలితాలు ఇచ్చిన తర్వాతే మీకు పరిచయం చేస్తున్నాం.

Posted By:
Subscribe to Boldsky

క్లియర్ స్కిన్ అనేది అపోహ. ఈ విషయంపై చాలామంది అమ్మాయిలు అంగీకారం తెలుపుతున్నారు. అయితే కొంతమంది చర్మం మాత్రం చాలా క్లియర్ గా, ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా.. చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. మరి దీనివెనక సీక్రెట్ ఏంటి ?

mask

అవును అలాంటి క్లియర్ స్కిన్ పొందడానికి ఒక అద్భుతమైన, మీరే ఇంట్లో తయారు చేసుకోగలిగే మాస్క్ ఉంది. నిజం.. దానిపై రిసెర్చ్ చేసి.. అది మెరుగైన ఫలితాలు ఇచ్చిన తర్వాతే మీకు పరిచయం చేస్తున్నాం. ఇందులో ఉపయోగించే పదార్థాలు.. అనేక చర్మ సమస్యలను దూరం చేసి.. గ్లోయింగ్ గా మారుస్తాయి.

బొప్పాయి, అలోవెరా, పసుపు, పెరుగు, ఆల్మండ్ ఆయిల్ ని ఈ ప్యాక్ లో ఉపయోగిస్తాం. పసుపులో 300 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేసి.. కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. బొప్పాయిలో పపెన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది. అలాగే విటమిన్ ఏ డార్క్ స్పాట్స్ ని తొలగించి.. గ్లోయింగ్ స్కిన్ ని అందిస్తుంది.

అలోవెరాలో అలోసిన్ ఉంటుంది. ఇది మాయిశ్చరైజర్ కోల్పోకుండా చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. అది ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మదిగా మారుస్తుంది. మరి వీటన్నింటితో ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

స్టెప్ 1

బాగా పండిన ఒక బొప్పాయి తీసుకోవాలి. తొక్క తీసి.. విత్తనాలు తీసేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. పేస్ట్ తయారు చేసుకోవాలి.

స్టెప్ 2

1 టీస్పూన్ అలోవెరా జెల్, చిటికెడు పసుపు తీసుకుని.. స్పూన్ తో రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత బొప్పాయి గుజ్జులో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 3

5 చుక్కల ఆల్మండ్ ఆయిల్ ఆ మిశ్రమంలో కలపాలి. మీ చర్మ తత్వాన్ని బట్టి.. ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. కానీ ఏదో ఒక ఆయిల్ మాత్రమే ఉపయోగించాలి.

స్టెప్ 4

చర్మాన్ని మైల్డ్ క్లెన్సర్ శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. టవల్ తో తుడుచుకున్న తర్వాత.. చర్మంపై కాస్త మాయిశ్చరైజర్ ఉండేలా జాగ్రత్తపడాలి. జుట్టుని పైకి కట్టుకోవాలి.

స్టెప్ 5

బ్రష్ లేదా చేతి వేళ్లు ఉపయోగించి.. ఈ మాస్క్ ని అప్లై చేయాలి. ఇది చర్మంపై ముడతలు, మచ్చలు, డార్క్ స్పాట్స్ ని తొలగిస్తుంది.

స్టెప్ 6

20 నుంచి 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. కళ్లపై రోజ్ వాటర్ లో ముంచిన దూదిని కళ్లపై పెట్టుకోవాలి. ఇప్పుడు కళ్లకు కూడా రిలాక్సేషన్ అందుతుంది.

స్టెప్ 7

మాస్క్ బాగా ఆరిన తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవాలి. ముందుగా కొన్ని చుక్కల నీటిని ముఖంపై చిలకరించి.. గుండ్రంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ ప్యాక్ ని కనీసం వారానికి ఒకసారి అప్లై చేస్తే.. చర్మ సమస్యలన్నీ దూరమై.. చర్మం క్లియర్ గా మారుతుంది.

English summary

Dark Spots, Fine Lines & Pigmentation – 1 DIY Mask To Clear Them All!

Dark Spots, Fine Lines & Pigmentation – 1 DIY Mask To Clear Them All! Don't take our word. Try this one effective DIY face mask!
Please Wait while comments are loading...
Subscribe Newsletter