గ్లోయింగ్ అండ్ సాప్ట్ స్కిన్ పొందడానికి డీప్ క్లెన్సింగ్ అలోవెర ఫేస్ వాష్ ..!!

అలోవెర (కలబంద)లో గ్లైకోప్రోటీన్స్ మరియు పాలీ శ్యాచ్చర్డిస్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ తో కలిసి, స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది.

Posted By:
Subscribe to Boldsky

మనిషి అందంగా కనిపించాలంటే అంతర్గత ఆరోగ్యమాత్రమే కాదు, బహిర్గతంగా కూడా ఆరోగ్యంగా, అందంగా కనిపించాలి. అంటే చర్మం ఆరోగ్యంగా అందంగా కనిపించాలి. చర్మం అందంగా కనబడాలంటే, ఆరోగ్యకరమైన ఆహారాలను తినడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం కోసం తీసుకునే మొదటి స్టెప్ స్కిన్ క్లెన్సింగ్. చర్మం శుభ్రపరుచుకోవడానికి, చర్మంలో మురికి, మలినాలను, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించుకోవడానికి, చర్మ రంద్రాలను క్లోజ్ చేయడానికి, చర్మం హైడ్రేటింగ్ తో ఉంటూ ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి.

స్కిన్ క్లీన్ గా , క్లియర్ స్కిన్ తో ఉండాలని కోరుకునే వారు , మొదట కొన్ని లక్షణాలను గుర్తించాలి. మీ చర్మ తత్వం డ్రై స్కిన్ లేదా స్ట్రెచ్ అవుతుందా, లేడా జిడ్డుగా ఉంటుందా అన్న విషయం గుర్తించాలి. మీ చర్మం ఎలాంటి తత్వం కలిగి ఉంటుందో తెలుసుకుంటే, సమస్యను నివారించుకోవడం సులభమవుతుంది. అయితే అలా కాకుండా అన్ని రకాల చర్మ తత్వాలకు సరిపోయే ఒక యూనివర్సల్ క్లెన్సర్ ఒకటుంది. అదే అలోవెర ఫేస్ ప్యాక్ .

కలబందలోని 12 గ్రేట్ హెల్త్ అండ్ బ్యూటీ బెనిఫిట్స్!

అలోవెర (కలబంద) చర్మం సంరక్షించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది, చర్మం ను క్లీన్ చేస్తుంది, చర్మంలో పిహెచ్ లెవల్స్ కు అంతరాయం కలిగించకుండా చర్మంలో కోల్పోయిన గ్లోను మరియు హైడ్రేషన్ ను తిరిగి తీసుకొస్తుంది.

Deep Cleansing Aloe Vera Face Wash Recipe!

అలోవెర (కలబంద)లో గ్లైకోప్రోటీన్స్ మరియు పాలీ శ్యాచ్చర్డిస్, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని కొల్లాజెన్ తో కలిసి, స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది. ఇంకా కలబదంలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఇ మరియు అలోసిన్ లు అధికంగా ఉండటం వల్ల ఇది స్కిన్ రిపేర్ చేస్తుంది. కొత్తగా చర్మ కణాలను రీజనరేట్ అవ్వడానికి సహాయపడుతుంది.

ప్రతి రోజూ ఉదయం అలోవెరా జ్యూస్ త్రాగితే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

కాబట్టి, స్కిన్ క్లెన్సింగ్ కు అలోవెర జ్యూస్ కంటే మించిన మరో క్లెన్సర్ లేదంటే అతిశయోక్తి కాదు. చర్మంలోకి డీప్ గా చొచ్చుకుని పోయి, క్లీన్ చేస్తుంది. అయితే అలోవెరనాను ఫేస్ క్లెన్సింగ్ కోసం ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...

స్టెప్ : 1

అలోవెర లీప్ ను కట్ చేసి, పైన పల్చని అవుటర్ స్కిన్ తొలగించి, స్పూన్ తో జెల్ ను ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి.

స్టెప్ : 2

ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల జోజోబ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల లిక్వివ్ కాస్టిల్ సోప్, 3 చుక్కల ల్యావెండర్ ఆయిల్, 5 చుక్కల ఆరెంజ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి.

స్టెప్ : 3

ఫోర్క్ ఉపయోగించి ఈ మిశ్రమాన్ని బాగా కలగలపాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమపదార్థం ఒక గ్రే కలర్లో నురగలా ఏర్పడుతుంది. దీన్ని ఒక డిస్పెన్సర్ బాటిల్లో ట్రాన్సఫర్ చేసి, 24 గంటల పాటు హైబర్నేట్ చేయాలి.

స్టెప్ : 4

ముఖం ప్లెయిన్ వాటర్ తో కడిగి, తర్వత చేతిలోకి డిమ్ సైజ్ అలోవెర ఫేస్ వాష్ ను తీసుకోవాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

స్టెప్ : 5

ముఖానికి అలోవెర జెల్ ను అప్లై చేసిన తర్వాత ఒక నిముషం వేళ్ళతో మసాజ్ చేయాలి. ఇలా చేయడంవల్ల చర్మం లోపలి పొరల్లో దాగున్న మలినాలు, మురికి తొలగిపోతుంది. తర్వాత ఈ నేచురల్ సోప్ తొలగిపోయే వరకు వాటర్ తో ముఖం క్లీన్ చేసుకోవాలి. తర్వాత సాప్ట్ టవల్ తో ముఖం తుడుచుకోవాలి.

స్టెప్ : 6

ఈ అలోవెర ఫేస్ వాష్ ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం దాంతో మీ చర్మం చూడటానికి అందంగా, క్లియర్ గా, సాప్ట్ అండ్ స్మూత్ గా కనబడుతుంది. . ఎక్సెస్ గా డ్రై అవ్వడం కానీ, లేదా జిడ్డు గా మారడం కానీ జరగదు. ఫర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఈ సులభమైన నేచురల్ ఫేస్ వాష్ ను రెగ్యులర్ గా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Deep Cleansing Aloe Vera Face Wash Recipe!

First step to a great skin is cleansing. It removes the dirt, keeps grime from clogging pores, perks up the skin and allows it to breathe.
Please Wait while comments are loading...
Subscribe Newsletter