స్పాట్ లెస్ స్కిన్ పొందడానికి పెరుగు, క్యారెట్ తో హోం మేడ్ ఫేస్ ప్యాక్ ..!

Subscribe to Boldsky

చర్మంలో ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా, ప్రకాశంతంగా కనిపించాలా ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మొటిమలు, మచ్చలు, టానింగ్ వల్ల చర్మం చూడటానికి నిర్జీవంగా, లైఫ్ లెస్ గా కనబడుతుంది.

ఎలాంటి మచ్చలు, మొటిమలను లేని స్వచ్చమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి కమర్షియల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ కమర్షియల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో హానికరమైన కెమికల్స్ ఉండటం వల్ల ఇవి చర్మఆరోగ్యం మీద వ్యతిరేక ప్రభావం చూపుతాయి.

DIY Carrot, Curd And Flour Mask To Get Spotless Skin

కాబట్టి, ఇంట్లోనే తయారుచేసుకోగల ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా, స్పాట్ లెస్ గా కనబడేలా చేస్తుంది.

ఈ ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించే పదార్థాలు క్యారెట్, పెరుగు , శెనగపిండి. ఈ మూడింటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉండి. ఒక్కోదానిలో వివిధ రకాల బ్యూటీ బెనిఫిట్స్ దాగున్నాయి. అటువంటి బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నఈ మూడింటింటిన కలపడం వల్ల చర్మ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందివ్వడంతో పాటు, మచ్చలు లేని , స్వచ్చమైన చర్మం సౌందర్యాన్ని అందిస్తుంది.

Carrot, Curd And Flour Mask To Get Spotless Skin

వీటిలో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి, క్యారెట్ చర్మ సౌందర్యానికి గొప్పగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరిల్స్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి పూర్తి పోషకాలను అందిస్తుంది.

ఇక పెరుగు, మొటిమలను, మచ్చలను మాయంచేయడంలో , చర్మంను నునుపుగా, కాంతివంతంగా మార్చడంలో గొప్పగా సహాయపడుతుంది.

మూడవది శెనగపిండి: డార్క్ స్పాట్స్ ను తొలగించడానికి, డార్క్ స్పాట్స్ తేలిక పరచడానికి నేచురల్ గ్లోను అందివ్వడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

అయితే ఈ మూడింటిం కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేసుకోవాలి, క్వాంటిటీ ఎంతెంత తీసుకోవాలని తెలుసుకోవాలి, ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం..

Carrot, Curd And Flour Mask To Get Spotless Skin

కావల్సినవి:

క్యారెట్ 1

పెరుగు 1 టేబుల్ స్పూన్

శెనగపిండి 1 టేబుల్ స్పూన్

తయారీ:

క్యారెట్ కు తొక్క తీసి, కడిగి, తురుముకోవాలి. ఈ క్యారెట్ తురుమును ఇంకా మెత్తగా కావాలనుకుంటే మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకుని, అందులో మిగిలిన ఆ రెండు పదార్థాలు కూడా వేసి మిక్స్ చేయాలి. తర్వాత ముఖం, మెడకు పూర్తిగా అప్లై చేయాలి.

అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మర్మంలో అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఈ ఫేస్ మాస్క్ అద్భుతమైనది, ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హెల్తీ, సపెల్, స్పాట్ ఫ్రీ స్కిన్ ను పొందుతారు.

English summary

DIY Carrot, Curd And Flour Mask To Get Spotless Skin

A beautiful, radiant and spotless skin is what all of us want. But the presence of acne, blemishes and other breakouts make our skin look dull and lifeless.
Please Wait while comments are loading...
Subscribe Newsletter