For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సౌందర్యవితిలా మెరిసిపోవాలంటే తేనె -నిమ్మరసంతో ప్యాక్ ట్రై చేయండి..

By Super
|

ప్రకాశించే చర్మం పొందడానికి కోకనట్ ఆయిల్, తేనె మరియు లెమన్ మాస్క్

అందంగా...ప్రకాశించే చర్మం కలవారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేస్తారు. అదే విధంగా నిర్జీవమైన , డల్ స్కిన్ కలవారిలో వారిలోని నమ్మకాన్ని తగ్గించేయడంతో పాటు, ఎదుటి వ్యక్తులు పెద్దగా పట్టించుకోకుండా ఉండేటట్లు చేస్తాయి.

ప్రకాశించే మరియు కాంతివంతమైన చర్మం పొందడం అంత సులభమైన పద్దతి కాదు. అందుక సమయం మరియు శ్రమ రెండూ అవసరమే. ప్రస్తుత వేగవంతమైన జీవితంలో ఈ రెండు కూడా సాధ్యపడవు.

అయితే లక్కీగా డ్యామేజ్ స్కిన్ ను నేచురల్ గా ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు, . అందుకోసం ఎక్కువ ఖర్చుచేయాల్సిన పనిలేదు మరియు అందుకు అరగంట సమయం చాలు.

Coconut Oil, Honey And Lemon Mask For Bright Skin

అందుకు మీరు చేయాల్సింది కొబ్బరినూనె, తేనె మరియు నిమ్మరసం వంటి నేచురల్ పదార్థాలు తీసుకొని ముఖానికి ఫేస్ మాస్క్ వేసుకోవాలి.

కోకనట్ లో సౌందర్య ప్రయోజనాలు ఎక్కువ, అందువల్లే కొన్ని వేల సంవత్సరాల నుండి తన సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని ఎక్కువగా చేర్చుకుంటున్నారు.

స్కిన్ డ్యామేజ్ ను చర్మంలోపలి నుండి రిపేర్ చేస్తుంది, దాంతో చర్మం బయట వైపు సాప్ట్ గా మారుతుంది. ముఖ్యంగా, ఈ నేచురల్ పదార్థంను తేనె మరియు నిమ్మరసంతో కలితి తయారుచేసుకోవడం వల్ల ఫలితం మరింత ఎక్కువ ఫేవరబుల్ గా ఉంటుంది.

తేనె నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. నిమ్మరసం ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది . ఈ నేచురల్ పదార్థాలు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఈ మూడింటిని ఒకటిగా కలిపి ఉపయోగించడం వల్ల , చర్మంలోని డార్క్ స్పాట్స్, మొటిమలు, మచ్చలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ముఖంలో నేచురల్ గ్లోను తీసుకొస్తుంది. మరి ఈ నేచురల్ ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలి. ఉపయోగించే పద్దతేంటో తెలుసుకుందాం...

Coconut Oil, Honey And Lemon Mask For Bright Skin

కావల్సినవి:

2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె

2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ హనీ

1టీస్పూన్ నిమ్మరసం

ఉపయోగించే విధానం:

పైన తెలిపిన మూడు నేచురల్ పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కు పట్టించాలి . తర్వాత ఈ ఫేస్ మాస్క 15 నుండి 20నిముషాలు అలాగే ఉండనివ్వాలి. తర్వతా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ను వారంలో రెండు సార్లు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

సూచన: ఈ ఫేస్ మాస్క్ తయారుచేసుకోవడానికి ఉపయోగించే పదార్థాలన్నీ ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి . తర్వాత ప్యాచ్ టెస్ట్ ద్వారా మీ స్కిన్ రియాక్షన్ గమనించి, ఎలాంటి స్కిన్ సమస్య లేకుంటే నేరుగా ఫేస్ మాస్క్ ను వేసుకోవచ్చు.

English summary

DIY Coconut Oil, Honey And Lemon Mask For Bright Skin

Radiant and bright skin catches everyone's attention. On the other hand, dull and lifeless skin can hamper one's confidence and attract people's attention for all the wrong reasons.
Story first published: Monday, May 23, 2016, 17:47 [IST]
Desktop Bottom Promotion