For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డూఇట్ యువర్ సెల్ఫ్: వైట్ హెడ్స్ ను నివారించడానికి సులభ చిట్కాలు

By Super
|

చర్మసౌందర్యం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో చర్మతత్వం ఉంటుంది. కొందరి రఫ్ స్కిన్, మరొకరికి ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ ఇలా ఒక్కక్కరిలో ఒక్కవిధమైన చర్మ తత్వాన్ని కలిగి ఉంటారు . చర్మ తత్వాన్ని బట్టి అప్పుడప్పుడు చర్మ సమస్యలకు వస్తుంటాయి.

ఉదహరణకు మొటిమలు, మచ్చలు, డ్రైప్యచెస్ , పిగ్మెంటేషన్, ఈ సమస్యల వల్ల చర్మ చూడటానికి అనారోగ్యకరంగానే కాదు, ఆకర్షణీయంగా కనబడదు.

ఇటువంటి నిర్జీవమైన చర్మ సమస్యలకు కారణం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు. చర్మ సమస్యల్లో మరొకటి, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్ . చర్మ సమస్యల్లో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను మరో బాధించే సమస్య. చర్మంలోపలి నుండి బయటకు పొడిచుకొచ్చి ఉన్న అందాన్ని పాడు చేసేవిధంగా కనబడుతాయి. వాటిని కవర్ చేయడానికి ఎంత మేకప్ వేసుకొన్నా ప్రయోజం ఉండదు. చర్మం మీద కనబడుతూ ఇబ్బంది కలిగిస్తుంటాయి.

diy-homemade-rice-flour-rose-water-pack-remove-whiteheads

చర్మం రంద్రాల్లో స్రవించే సెబమ్ మరియు బ్యాక్టీరియావల్ల వైట్ హెడ్స్ ఎక్కువవుతాయి. ఇంకా హార్మోనుల ప్రభావం, ఆండ్రోజన్ లెవల్స్ పెరగడం, ఆయిల్ స్కిన్, సరైన శుభ్రతపాటించకపోవడం, హెరిడిటి, మేకప్ సైడ్ ఎఫెక్ట్స్, లోషన్స్, మెడికేషన్స్ మొదలగు కారణాల వల్ల కూడా బ్లాక్ హెడ్స్ ఎక్కువ అవుతాయి.

వైట్ హెడ్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, లేదా నిపుణులను కలిసి వైట్ హెడ్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల డబ్బు ఎక్కువ ఖర్చువ్వడంతో పాటు, వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురిఅవ్వాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ కంటే హోం మేడ్ రెమెడీ చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోం మేడ్ రెమెడీతో వైట్ హెడ్ తొలగించుకోవడానికి ఒక సింపుల్ రెమెడీ మీకోసం...

diy-homemade-rice-flour-rose-water-pack-remove-whiteheads

కావల్సినవి:

బియ్యం పిండి: 2టేబుల్ స్పూన్లు

రోజ్ వాటర్: 3 టీస్పూన్లు

బియ్యం పిండి స్కిన్ ఎక్స్ఫోయేటర్ ఏజెంట్ గా అద్భుతంగా పనిచేస్తుంది, ఇది చర్మంలోని మ్రుతకణాలను తొలగిస్తుంది , చర్మరంగులో మార్పు తీసుకొస్తుంది .

చర్మరంద్రాలు తెరచుకొనేలా చేసి సెబమ్ ను తగ్గిస్తుంది . చర్మంలోని సెబమన్ ను తగ్గిస్తుంది , దాంతో చర్మంలో వైట్ హెడ్స్ ను నివారించుకోవచ్చు. రోజ్ వాటర్ చర్మానికి తగిన తేమను అందిస్తుంది . చర్మంను తేమగా మరియు సున్నితంగా మార్చుతుంది.

diy-homemade-rice-flour-rose-water-pack-remove-whiteheads

తయారుచేయు విధం:

పైన సూచించిన పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి.

స్పూన్ సహాయంతో రెండింటిని మెత్తగా పేస్ట్ లా చేయాలి.

ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.

వేసుకున్న తర్వాత సున్నితంగా కొన్ని నిముషాలు మసాజ్ చేయాలి.

15 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి . చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది.

Story first published: Monday, May 30, 2016, 17:56 [IST]
Desktop Bottom Promotion