For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన న్యాచురల్ హనీ క్లెన్సర్..!!

By Swathi
|

చాలా డిఫరెంట్ ఫేస్ క్లెన్సర్స్ ని మనం షాపులలో కొంటూ ఉంటాం. అయితే.. మీరు ఇంట్లోనే స్వయంగా మీరే సింపుల్ గా తయారు చేసుకునే న్యాచురల్ క్లెన్సర్ అందుబాటులో ఉంది. దీనికి వాడే పదార్థాలన్నీ.. అందరికీ అందుబాటులో ఉండేవే.

తేనె ఈ క్లెన్సర్ లో ముఖ్యమైన పదార్థం. ఇందులోని స్కిన్ కేర్ బెన్ఫిట్స్ చాలామందికి తెలుసు. మరి.. చాలా తేలికగా తయారు చేసుకునే.. ఈ తేనె క్లెన్సర్ ని మీరు ఎందుకు ఒకసారి ట్రై చేయకూడదు.

Natural Honey Face Cleanser

బయట కొనుక్కున్న క్లెన్సర్స్ లో కెమికల్స్ ఉంటాయి. అదే ఇంట్లో తయారు చేసుకునేవాటిలో న్యాచురల్ ఇంగ్రియంట్స్ ఉంటాయి. ఇవి ఎలాంటి హాని చేయకుండా.. చర్మానికి పోషణ అందిస్తాయి. మీరు మీరే తయారు చేసుకోగలిగే.. ఈ న్యాచురల్ క్లెన్సర్.. అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Natural Honey Face Cleanser

మరి ఇంట్లోనే తయారు చేసుకోగలికే.. హనీ ఫేస్ క్లెన్సర్ కి కావాల్సిన పదార్థాలు, మెతడ్ ఏంటో చూద్దామా

కావాల్సిన పదార్థాలు

  • తేనె
  • నిమ్మ
  • బేకింగ్ సోడా
Natural Honey Face Cleanser

తయారు చేసే విధానం
2 టేబుల్ స్పూన్ల తేనెను ఒక గిన్నెలో తీసుకోవాలి. నిమ్మరసం కలపి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అర టీస్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవాలి. న్యాచురల్ హనీ క్లెన్సర్ రెడీ అయిపోయింది. దీన్ని ముఖమంతా.. సర్క్యులర్ మోషన్ లో రుద్దుకోవాలి.

చర్మాన్ని రఫ్ గా రుద్దుకోకూడదు. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉపయోగించిన తేనె, నిమ్మరసం కాంబినేషన్ అద్భుతమైన ఫలితాలిస్తుంది. తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. డెడ్ స్కిన్ సెల్స్ ని సున్నితంగా తొలగిస్తాయి.

Natural Honey Face Cleanser

నిమ్మరసం పొల్యూషన్ వల్ల, ఎండ వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని నివారిస్తాయి. ఇందులో న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. బేకింగ్ సోడా.. మొటిమలు, యాక్నె నివారించడంలో సహాయపడతాయి. అయితే ఈ క్లెన్సర్ ని వారానికి రెండుసార్ల కంటే.. ఎక్కువసార్లు ఉపయోగించరాదు.

English summary

DIY All Natural Honey Face Cleanser That You Must Try!

DIY All Natural Honey Face Cleanser That You Must Try! We go to stores and buy so many different face cleansers for our different skin needs.
Story first published:Friday, August 19, 2016, 15:18 [IST]
Desktop Bottom Promotion