For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యాచురల్ ఆరంజ్ పీల్ ఫేస్ వాష్ తో.. అదిరేటి లుక్..!!

By Swathi
|

మీ చర్మంలో గ్లోయింగ్ మిస్సవుతున్నట్లు అనిపిస్తోందా ? ఒత్తిడి, కంప్యూటర్ ముందు వర్క్, దుమ్ము, కాలుష్యం, చర్మంపై శ్రద్ధ తీసుకోకపోవడం, డైట్ సరిగా లేకపోవడం వంటి కారణాల వల్లే.. మీ చర్మంలో గ్లోయింగ్ మిస్సయి.. డల్ గా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. దీనికోసం.. బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే.. మీ చర్మానికి మంచి హాని చేస్తాయి.

చర్మాన్ని హెల్తీగా, న్యాచురల్ గ్లోయింగ్ అందివ్వాలి అనుకుంటే.. మీ వంటిట్లో ఉన్న రెమిడీస్ పై ఓ లుక్కేయండి. అక్కడ ఉండే న్యాచురల్ పదార్థాలు మీ కాంప్లెక్షన్ పెంచేస్తాయి. తక్కువ ఖర్చులోనే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మరి గ్లోయింగ్ అండ్ హెల్తీ స్కిన్ పొందడానికి ఆరంజ్ పీల్ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Natural Orange Peel Face Wash For Radiant Skin

ఫేస్ వాష్ తయారు చేసే విధానం
2 టేబుల్ స్పూన్ల కాస్టెల్ సోప్ లిక్విడ్
1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ ఆరంజ్ పీల్ పౌడర్
20 చుక్కల ఆరంజ్ ఎసెన్షియల్ ఆయిల్

Natural Orange Peel Face Wash For Radiant Skin

లిక్విడ్ కాస్టెల్ సోప్ లో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది న్యాచురల్ ఫేస్ వాష్ లా పనిచేస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, ఫ్రెష్ గా ఉంచుతుంది. దీన్ని కాస్మొటిక్ లేదా మెడికల్ షాపుల్లో తీసుకోవచ్చు. ఆరంజ్ పీల్ లో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి క్లెన్సింగ్ లా పనిచేస్తుంది. జిడ్డుదనాన్ని, దుమ్ముని తొలగిస్తాయి. ఆరంజ్ పీల్ లో ఉండే ఎసిడిక్ నేచర్ చర్మానికి గ్లోయింగ్ తీసుకొస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్ మీ చర్మానికి హెల్తీ కాంప్లెక్షన్ అందిస్తుంది.

Natural Orange Peel Face Wash For Radiant Skin

తయారు చేసే విధానం
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ వాష్ ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుని ప్రతిరోజూ వాడితే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

Story first published:Tuesday, May 3, 2016, 17:23 [IST]
Desktop Bottom Promotion