ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్ తో అద్భుత చర్మ సౌందర్యం..!

Subscribe to Boldsky

బెర్రీస్‌ విదేశాలనుండి దిగుమతి అయ్యే బెర్రీస్‌ మహా రుచిగా వుంటాయి. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌ బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బెర్రీస్ అన్నీ, చెర్రీ బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, అన్నిటిలోనూ సెల్ డ్యామేజ్ ని తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. రాస్బెరీలో ఎలాజినిక్ యాసిడ్, సెలీనియం ఉండటం మూలంగా ఓరల్ మరియు లివర్ క్యాన్సర్ కణాలు పెరగటానికి అవరోధం కలిపిస్తుందని కనుగొన్నారు. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల వీటిని సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.


స్ట్రాబెరీ ప్రూట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్నికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. స్ట్రాబ్రెరీలో ఉన్న అద్భుతమైన క్వాలీటీస్ వల్ల చాలా రకాల స్కిన్ కేర్ఉత్పత్తులలో వాడటం మనం గమనించే ఉంటాం. స్ట్రాబెర్రీలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ చర్మలోని టాక్సిన్ ను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ తొలగించి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

DIY Strawberry Face Scrub You Need To Try Today!

స్ట్రాబెరీ మాస్క్‌ స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబిండంలా వుంటుంది.చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు.దీని వలనఫేస్‌ ప్రెష్‌గా వుంటుంది. పార్లర్స్, సలోన్స్, స్పాల చుట్టూ తిరగడం కంటే ఈ నేచురల్ స్కిన్ కేర్ వల్ల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఈ హెర్బల్ స్ట్ర్రాబెర్రీ ఫేస్ స్కబ్ లో ఎలాజిక్ యాసిడ్స్ ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది ముడతలను, మచ్చలను నివారించి, చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

స్ట్రాబెర్రీస్ లో ఉండే హై యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి రక్షక కవచంగా సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి, స్కిన్ టోన్ లైట్ గా మార్చుతుంది. మచ్చలను నివారిస్తుంది, డ్రైస్కిన్ నివారిస్తుంది, చర్మంలో కొత్తకణాలు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇన్ని ప్రయోజనాలుండబట్టే స్ట్రాబెర్రీస్ ను వివిధ రకాల బ్యూటీప్రొడక్ట్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్ట్రాబెర్రీ ఫేస్ స్క్రబ్ ను ఎలా తయారుచేసుకోవాలి. ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

స్టెప్ 1 :

బాగా పండిన స్ట్రాబెర్రీ పండ్లను 100గ్రాములు తీసుకుని, వాటిని మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.

స్టెప్ 2 :

అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ మిక్స్ చేయాలి. ఫోర్క్ ఉపయోగించి ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.

స్టెప్ 3:

తర్వాత ముఖం శుభ్రంగా కడిగి, తేమ తుడిచేసి, తర్వాత ఈ మాస్క్ ను ముఖం, మెడకు వేసుకోవాలి. 15 -30 నిముషాల వరకూ మాస్క్ అలాగే ఉండనివ్వాలి.

స్టెప్ 4:

తర్వాత ముఖం మీద కొద్దిగా నీటిని చిలకరించి, స్ర్కబ్ చేయాలి. సర్క్యులర్ మోషన్లో స్ర్కబ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

స్టెప్ 5:

గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి, ఆనీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కొద్దిగా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ : 6

ఈ స్ట్రాబెర్రీ ఫేస్ స్క్రబ్ ను వారంలో కనీసం రెండు సార్లు ఉపయోగిస్తుంటే, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి, చర్మంలోపలి వరకూ క్లీన్ చేస్తుంది. చర్మ రంద్రాలను శుభ్రపరుస్తుంది. స్ట్రాబెర్రీ ఫేస్ స్క్రబ్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మీరు అనుకున్నదానికి కంటే మెరుగైన ఫలితాలను పొందడం వల్ల మీకు ఆశ్చర్యం కలుగుతుంది.

English summary

DIY Strawberry Face Scrub You Need To Try Today!

If flawless, clear skin is what you are aiming for, then you have to give this strawberry face scrub a definite try! Take a look.
Please Wait while comments are loading...
Subscribe Newsletter