For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30 తర్వాత ముడతలు రాకూడదంటే.. ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు..!!

By Swathi
|

30 ఏళ్లు వస్తున్నాయంటే.. అందం విషయంలో.. ఆందోళన మొదలవుతుంది. ముఖంపై ముడతలు మొదలయ్యేది అప్పుడే. ఆ లక్షణాలు కనిపించకుండా.. చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. 30 ఏళ్లలో సెల్ డీజనరేషన్ మొదలవుతుంది. అంతేకాదు.. శరీరంలో కూడా అనేక మార్పులు కనిపిస్తాయి.

మీరు మంచి డైట్ ఫాలో అవడం, రెగ్యులర్ ఎక్సర్ సైజ్ ఫాలో అవుతుండటం, అందంపై శ్రద్ధ తీసుకోవడం వంటివన్నీ.. యంగ్ ఏజ్ లో మాత్రమే కాదు.. 30లలోనూ పాటిస్తేనే.. మీరు యూత్ ఫుల్ లుక్ సొంతం చేసుకుంటారు. చాలా సందర్భాల్లో... హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడానికి సమయం ఉండదు.

ఫిజికల్ ఏజింగ్ లక్షణాలు.. చర్మంపై ముడతల రూపంలో, ఫైన్ లైన్స్, ఏజ్ స్పాట్స్ రూపంలో కనిపిస్తాయి. ముడతలు.. వయసు పెరిగినట్టు కనిపించేలా చేస్తాయి. ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పై ప్రభావం చూపుతాయి. కాబట్టి.. చాలామంది.. ముడతలు తగ్గించుకోవడానికి కాస్మొటిక్స్ పై ఆధారపడతారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువగా వస్తాయి.

కాబట్టి.. 30 ఏళ్లలో ముడతలు తగ్గించుకోవడానికి, అరికట్టడానికి, యూత్ ఫుల్ లుక్ సొంతం చేసుకోవడానికి.. కొన్ని రకాల ఆహారాలను డైలీ డైట్ లో చేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టమోటాలు

టమోటాలు

ఫ్రెస్ టమోటాలు లేదా టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. 30 ఏళ్ల తర్వాత కూడా.. టమోటాల్లో ఉండే విటమిన్ సి... కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

బెర్రీస్

బెర్రీస్

స్ట్రాబెర్రీస్, రస్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటి వాటిల్లో చాలా పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మంలోని ప్రతికణానికి పోషణ అందిస్తాయి. దీనివల్ల ముడతలు, ఫైన్ లైన్స్ దూరంగా ఉంటాయి.

పెరుగు

పెరుగు

పెరుగు లేదా యోగర్ట్ ని డైలీ డైట్ లో చేర్చుకోవాలి. మీరు 30 తర్వాత ముడతలకు దూరంగా ఉండాలి అనుకుంటే.. పెరుగుని డైట్ లో చేర్చుకుంటే.. అందులో ఉండే హెల్తీ బ్యాక్టీరియా.. చర్మంలో ఎలాస్టిసిటీని పెంచుతాయి.

ఫిష్

ఫిష్

చేపల్లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది.. చర్మానికి చాలామంచిది. ఇది చర్మానికి అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కాబట్టి.. ఫిష్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. ప్రీమెచ్యూర్ ఏజింగ్, ముడతలకు దూరంగా ఉండవచ్చు.

నట్స్

నట్స్

నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. చర్మ కణాలకు పోషకాలు అందిస్తాయి. దీంతో.. ముడతలు రాకుండా ఉంటాయి.

అవకాడో

అవకాడో

అవకాడోలో గ్లుటథైన్ ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది.. కొత్త చర్మ కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

తేనె

తేనె

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. ముడతలు, ఫైన్ లైన్స్ ని అరికట్టడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి.. దీన్ని డైలీ డైట్ లో చేర్చుకుంటే.. 30 తర్వాత కూడా.. యూత్ ఫుల్ లుక్ సొంతం చేసుకోవచ్చు.

English summary

Eat These Foods If You Want To Avoid Getting Wrinkles, After 30!

Eat These Foods If You Want To Avoid Getting Wrinkles, After 30!, Your 30th birthday is approaching and it is a pretty monumental time of your life because starting your 30's means a whole new range of responsibilities and goals.
Story first published: Friday, August 26, 2016, 18:08 [IST]
Desktop Bottom Promotion