For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఆయిల్ స్కిన్ నివారించే 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

వేసవిలో ఆయిల్ స్కిన్ నివారించే 5 హోం రెమెడీస్

ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండే చర్మ సౌందర్యాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వేసవిలో నేచురల్ మరియు డ్రై స్కిన్ తో అంత బాధపడాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయిల్

స్కిన్ ఉన్న వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది . ఆయిల్ స్కిన్ ఉన్న వారు దుమ్ము, ధూలి, కాలుష్యానికి చాలా త్వరగా గురి అవుతుంటారు. వీటి వల్ల చర్మంలో మొటిమలు, మచ్చలు, స్కిన్ మార్క్స్ ఇంకా ,ఇతర సమస్యలకు కారణమవుతుంది.

వేసవిలో సరైన పోషకాహారం , బ్యాలెస్డ్ ఫుడ్ తీసుకోవడం , ఎక్కువగా నీరు తాగడం వల్ల కొంత వరకూ ఈ సమస్యను నివారించుకోవచ్చు. వీటితో పాటు, బహిర్గతంగా కొన్ని హోం మేడ్

ట్రింక్స్ ను ఫాలో అవ్వడం వల్ల వేసవిలో ఆయిల్ స్కిన్ సమస్య ఉండదు. దాంతో ఇరత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

వేసవిలోఆయిల్ స్కిన్ నివారణకు 5 హోం మేడ్ రెమెడీస్..

Five home remedies for oily skin in summer

1. అటరి, పాలు మరియు ఓట్స్ ఫేస్ స్క్రబ్:
అరటిలో న్యూట్రీషియన్స్, విటమిన్ ఎ, బి, మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి చర్మాన్ని తేమగా మరియు మాయిశ్చరైజ్ గా మార్చుతాయి. అలాగే పాలు నేచురల్ క్లెన్సర్ మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను క్లియర్ చేస్తుంది , బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది. అయితే ఈ ప్యాక్ ను మొటిమలున్న ప్రదేశంలో స్క్రబ్ చేయకపోవడం మంచిది.

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో 1 టేబుల్ స్పూన్ పాలు , రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి. 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Five home remedies for oily skin in summer

2. బియ్యం పిండి మరియు పసుపు ఫేస్ ప్యాక్:
బియ్యంపిండి, పసుపు, తేనె మరియు కీరదోసజ్యూస్. మూడు చెంచాల బియ్యం పిండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ తేనె మరియు కీరదోస జ్యూస్ ను మెత్తగా పేస్ట్ చేసి, ముఖానికి అప్లై చేసి బాగా మర్ధన చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని బాడీ ప్యాక్ గా కూడా వేసుకోవచ్చు.

Five home remedies for oily skin in summer

3. తేనె మరియు నిమ్మరసంతో ప్యాక్:
గ్లోయింగ్ స్కిన్ పొందాలన్నా, ఆయిల్ స్కిన్ అండర్ కంట్రోల్లో ఉంచాలన్నా , ఈ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ ప్యాక్ వల్ల టానింగ్ సమస్య కూడా ఉండదు . తేనె మరియు నిమ్మరసం రెండు సమంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 10 నిముషాలు బాగా స్ర్కబ్ చేయాలి. మరో 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ స్కిన్ అండర్ కంట్రోల్లో ఉంటుంది.

Five home remedies for oily skin in summer

4. టమోటో మరియు పెరుగు ఫేస్ ప్యాక్:
టమోటో స్కిన్ స్కార్స్ ను మాయం చేస్తుంది. పెరుగు స్కిన్ కలర్ ను మెరుగుపరుస్తుంది. కొద్దిగా టమోటో రసంలో పెరుగు మిక్స్ చేసి, చిక్కగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ పొందుతారు . ఇది సన్ టాన్ కూడా నివారిస్తుంది.

Five home remedies for oily skin in summer

5. మ్యాంగో మాస్క్:
కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో, వేసవి సీజన్ మొత్తం ఈ మామిడిపండ్లు అందుబాటులో ఉంటాయి . ఈ ఫ్రూట్ వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది . చర్మ విషయంలో నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో క్లెన్సింగ్ లక్షనాలు కూడా అధికగా ఉన్నాయి . ఇది ఆియల్ స్కిన్ ను నివారించడంలో సహాయపడుతుంది. చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను తగ్గిస్తుంది, మురికిని , మలినాలను తొలగిస్తుంది, చర్మరంద్రాలను తెరచుకునేలా చేస్తుంది. మామిడికాయగుజ్జును ముఖానికి అప్లైచేసి మసాజ్ చేయాలి. 10నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ రెమెడీసి వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Five home remedies for oily skin in summer

Healthy and glowing skin is what everyone wants. But summers are a time when the natural and dry skin isn’t bothered as much as what a person with oily skin has to go through.
Story first published:Tuesday, May 24, 2016, 16:24 [IST]
Desktop Bottom Promotion