For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ పొందడానికి డైట్ లో చేర్చుకోవాల్సిన ఫుడ్స్..

By Swathi
|

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కేవలం ఫేషియల్స్, క్రీమ్స్, స్క్రబ్ లు మాత్రమే కాదు.. ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. తీసుకునే ఆహారం కూడా.. మీ చర్మ సౌందర్యాన్ని డిసైడ్ చేస్తుంది. చర్మం నిగారింపు పొందడానికి కొన్ని ఫ్రూట్స్, ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

స్కిన్ ని గ్లోయింగ్ మార్చడానికి ముందు కాస్మటిక్స్‌కు దూరంగా ఉండాలి. వాస్తవానికి అందమంటే కేవలంపై పై పూతలతో మెరిసే చర్మం కాదు నిజమైన అందం లోపలి నుంచి పొందాలి. మనం తీసుకునే ఆహారమే ఇందుకు ప్రాణమవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు మీకు సహజ సౌందర్యాన్ని అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టమోటో

టమోటో

ఆహారంలో అతి ముఖ్యమైనవి టమోటోలు. ఇందులో సమృద్ధిగా ఉండే లైకోపిన్‌ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎండకు కమిలిన చర్మాన్ని టమోటోలో ఉండే కెరటాయిడ్స్‌ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు నివారిస్తాయి. టమోటోలను రసంగా, సాస్‌గా, పేస్ట్‌గా వాడుకోవచ్చు.

అవకాడో

అవకాడో

చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో అవకాడో చాలా కీలకంగా పనిచేస్తాయి. అవకాడోసలో ఉండే పోషకాలు జుత్తు, గోళ్లు, చర్మానికి ఎంతో సహాయపడతాయి.

సిట్రస్‌ ఫ్రూట్స్

సిట్రస్‌ ఫ్రూట్స్

సిట్రస్ ఫ్రూట్స్ లో సమృద్ధిగా ఉండే విటమిన్‌ సి చర్మానికి చక్కటి ఆకర్షణను ఇస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గానే కాకుండా, చర్మంలో ఉండే ఆక్సిడేటివ్‌ సిట్రస్‌ను తగ్గిస్తాయి. ఇవి చర్మంలో ముడతలు పడకుండా కాపాడతాయి.

గుడ్లు

గుడ్లు

రోజూ ఉదయం బ్రేక్‌ఫా‌స్ట్ లో ఉడికించిన గుడ్లను తీసుకుంటే మీ చర్మం చాలా అందంగా తయారవుతుంది. గుడ్డల్లో ప్రొటీన్‌తో పాటు విటమిన్ ఏ‌, జింక్‌, విటమిన్‌ సి పొందవచ్చు. వీటితోపాటు ట్రెటినిన్‌ అనే పోషకం నిర్జీవమైన చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది.

బాదం

బాదం

బాదాంలో చర్మానికి పోషణ అందించే ప్రొటీన్స్ ఉంటాయి. అలాగే విటమిన్‌ ఈ, సెలేనియం ఉండటం వల్ల సూర్మరశ్మికి చర్మం దెబ్బ తినకుండా రక్షణ పొందవచ్చు. అలాగే చర్మం పొడి బారకుండా, వాపు రాకుండా కాపాడుతుంది.

పాలకూర

పాలకూర

పాలకూరలో విటమిన్ బి, సి, ఇ లుఎక్కువగా ఉండటంతో పాటు లైకెలుటీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శక్తివంతంగా యవ్వనంగా మారుస్తాయి.

English summary

Foods to Eat for Healthy, Glowing Skin

Foods to Eat for Healthy, Glowing Skin. You probably think about how nutrition affects your internal health and your weight, but eating the right foods can also improve the quality of your skin.
Story first published:Tuesday, August 30, 2016, 15:43 [IST]
Desktop Bottom Promotion