చలికాలంలో కోల్డ్ క్రీమ్ లేకుండా.. స్మూత్ స్కిన్ పొందే సీక్రెట్స్..!

వింటర్ లో చర్మ సంరక్షణను మరింత పెంచాలి. చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. అయితే.. చలికాలంల వచ్చిందంటే.. చర్మం పగలకుండా.. చాలా ఖర్చుపెట్టి కోల్డ్ క్రీమ్ లు కొనేస్తుంటారు.

Posted By:
Subscribe to Boldsky

చలికాలం అంటేనే.. చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి చలికాలంలో చర్మం, శరీర సంరక్షణలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. మీ చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతేకాదు.. చర్మం పగలడం వల్ల.. దురద కూడా ఇబ్బందిపెడుతుంది.

How to Keep Your Skin Soft and Moisturized This Winter

కాబట్టి.. వింటర్ లో చర్మ సంరక్షణను మరింత పెంచాలి. చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. అయితే.. చలికాలంల వచ్చిందంటే.. చర్మం పగలకుండా.. చాలా ఖర్చుపెట్టి కోల్డ్ క్రీమ్ లు కొనేస్తుంటారు. కొన్నిసార్లు.. ఈ క్రీమ్ లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు.

అందుకే.. చలికాలంలో కోల్డ్ క్రీమ్ లను రీప్లేస్ చేసే.. ఎఫెక్టివ్ హోం మేడ్ కోల్డ్ క్రీమ్స్ ని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. అలాగే.. చర్మాన్ని స్మూత్ గా మార్చుకోవచ్చు. మరి.. హోంమేడ్ కోల్డ్ క్రీమ్స్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి..

బాదాం

బాదాం గింజలను నానబెట్టి.. మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల పాలు, తేనె, రోజ్ వాటర్ కలిపి.. ముఖానికి అప్లై చేసి.. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అరటిపండు

అర టీస్పూన్ తేనెను అరటిపండు గుజ్జులో మిక్స్ చేసి.. ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటిపండులో ఉండే విటమిన్ ఏ, సిలు.. డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి.. హైడ్రేట్ చేస్తాయి.

మజ్జిగ

మజ్జిగలో కాటన్ బాల్ ముంచి.. ముఖానికి క్లెన్సర్ లా ఉపయోగించాలి. 10 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్.. కోల్డ్ క్రీమ్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

తేనె

2టీస్పూన్ల తేనెను, అరకప్పు గోరువెచ్చటి నీటిలో కలపి.. చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుస్తాయి.

కొబ్బరినూనె

కొబ్బరినూనె తీసుకుని.. కొద్దిగా హీట్ చేయాలి. ఈ ఆయిల్ తో.. చర్మాన్ని మసాజ్ చేస్తే.. అది మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ఇది చర్మంపై ముడతలను కూడా తొలగిస్తుంది.

దోసకాయ

కొన్ని చుక్కల తేనెను, దోసకాయ పేస్ట్ లో కలిపి.. ముఖానికి మాస్క్ లా అప్లై చేయాలి. దోసకాయలో ఉండే మినరల్స్, పోషకాలు.. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరిచి.. చర్మాన్ని స్మూత్ గా మార్చడమే కాకుండా.. ముడతలు రాకుండా అడ్డుకుంటుంది.

పాల మీగడ

పాలమీగడలో కొద్దిగా పసుపు కలిపి.. ముఖానికి మసాజ్ చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. పాల మీగడలో న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి..ప్రకాశవంతంగా మారుస్తుంది.

బొప్పాయి

బొప్పాయి పండు గుజ్జులో కొన్ని చుక్కల తేనె కలిపి.. ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. డెడ్ సెల్స్ తొలగిపోయి.. చర్మం సాఫ్ట్ గా, గ్లోయింగ్ గా మారుతుంది.

English summary

How to Keep Your Skin Soft and Moisturized This Winter

How to Keep Your Skin Soft and Moisturized This Winter. Here’s what you can do for your dry skin in winter if you do not want to spend big bucks on cold creams.
Please Wait while comments are loading...
Subscribe Newsletter