ఇంట్లోనే సింపుల్ గా అలోవెరా సోప్ తయారు చేసుకోవడం ఎలా ?

కలబంద అన్ని రకాల చర్మ సంబంధ ఉత్పత్తులలో ఒక అద్భుతమైన అంశంగా ఉంది. ఈ రోజు ఈ వ్యాసంలో కలబంద సబ్బును ఇంటిలో ఎలా తయారుచేయాలో తెలియజేస్తున్నాం.

Subscribe to Boldsky

కలబంద అన్ని రకాల చర్మ సంబంధ ఉత్పత్తులలో ఒక అద్భుతమైన అంశంగా ఉంది. ఈ రోజు ఈ వ్యాసంలో కలబంద సబ్బును ఇంటిలో ఎలా తయారుచేయాలో తెలియజేస్తున్నాం.

కలబంద దురద మరియు దద్దుర్లు, మొటిమల వంటి చర్మ సమస్యల చికిత్సలో బాగా సహాయపడుతుంది. అలాగే చర్మ చికాకును తగ్గించి ప్రశాంతపరుస్తుంది. కలబంద ప్రతి ఒక్క సారి పనిచేస్తుంది. ఏదైనా చర్మ సమస్య వచ్చినప్పుడు మొదట కలబంద జెల్ ని ఉపయోగించాలి. ఆ తర్వాత ఇతర ఇంటి నివారణలను ప్రయత్నించాలి.

కలబంద దద్దుర్లను తగ్గించటంలో సహాయపడుతుంది. కాబట్టి సబ్బు తయారు చేయడానికి కలబంద మంచి పదార్ధం అని చెప్పవచ్చు. ఇంటిలో తయారుచేసిన సబ్బు చాలా మెరుగ్గా ఉంటుంది. హ్యాండ్ మెడ్ సబ్బు కాబట్టి చాలా క్యూట్ గా ఉంటుంది. అంతేకాక ప్రత్యేక సందర్భాలలో బహుమతిగా కూడా ఇవ్వవచ్చు.

ఈ సోప్ నిజంగా చర్మాన్ని హైడ్రేడ్ గా మరియు తేమగా ఉంచుతుంది. ఈ సబ్బు సున్నితమైన చర్మం ఉన్నవారికి బాగుంటుంది. ఇది ఒక ఆహ్లాదకరమైన ప్రాజెక్ట్. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ సోప్ తయారికి ప్రయత్నం చేయండి. అయితే ఈ సబ్బు తయారు చేసినప్పుడు చేతికి గ్లోవ్స్ ధరించాలి.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

1. ఒక కుండలో నీటిని మరిగించాలి. ఆ నీటిలో కొన్ని స్పూన్ల కాస్టిక్ సోడా చెక్క స్పూన్ సాయంతో కలపాలి.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

2. కలబంద ఆకుల నుండి గుజ్జును బయటకు తీయాలి.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

3. ఈ మిశ్రమంలో బాదం నూనె, కొబ్బరి నూనె మరియు ఆముదము వంటి నూనెలలో ఏదైనా ఒకదానిని కలపాలి. ఇది సబ్బుకు తేమని ఇస్తుంది. ఈ సబ్బును ఉపయోగించినప్పుడు చర్మం పొడిగా మారదు.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

4. ఆ తరవాత కలబంద గుజ్జును వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అచ్చులతో పోయటానికి ముందు అచ్చులకు నూనె రాయాలి.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

5. మంచి వాసన కోసం ఏదైనా ఎస్సేన్షియాల్ ఆయిల్ ని కలపాలి. మీకు లావెండర్ వాసన ఇష్టమైతే మూడు చుక్కలు వేస్తె సరిపోతుంది. వాసన బాగా ఎక్కువగా రావాలంటే 5 చుక్కలు వేయాలి.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

6. సబ్బు మిశ్రమాన్ని అచ్చులతో పోసి చల్లపరచాలి. 5 గంటల తర్వాత ఫ్రీజర్ లో డీప్ రిఫ్రిజరేషన్ చేయాలి. రాత్రి అంతా ఆలా వదిలేయాలి. ఉదయం లేవగానే ఈ సహజమైన కలబంద సబ్బు ఉపయోగించటానికి సిద్ధంగా ఉంటుంది.

ఇంట్లో అలోవెరా సోప్ ఎలా తయారు చేసుకోవాలి ?

English summary

How To Make Aloe Vera Soap At Home?

How To Make Aloe Vera Soap At Home? Aloe vera is the king of solving all skin problems. Want to know how to make your own aloe vera soap?
Please Wait while comments are loading...
Subscribe Newsletter