For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్ము తొలగించడం ఎలా ?

చర్మం లోపలి పొరల్లో ఉండే దుమ్ము తొలగించడానికి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయాలి. స్క్రబ్స్ ఉపయోగించడం ద్వారా దీన్ని తేలికగా తొలగించవచ్చు.

By Swathi
|

చర్మం లోపలి పొరల్లో పేరుకున్న దుమ్ము వల్ల చర్మం ఇతర సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. బ్రేకవుట్స్, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చర్మంలోపల దుమ్ము ఎలా తొలగించాలని మీరు భావిస్తే.. మీకు ఈ చక్కటి రెమిడీస్ సహాయపడతాయి.

dirt

చర్మ రంధ్రాల్లో పేరుకున్న దుమ్ముని తొలగించకపోతే.. చర్మం చాలా నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే చర్మ సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం ద్వారా.. చర్మం లోపలి పొరల్లో ఉన్న దుమ్ము తొలగించడమే కాకుండా.. చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది.

చర్మం లోపలి పొరల్లో ఉండే దుమ్ము తొలగించడానికి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయాలి. స్క్రబ్స్ ఉపయోగించడం ద్వారా దీన్ని తేలికగా తొలగించవచ్చు. అందుకోసం ఇంట్లోనే స్క్రబ్స్ తయారు చేసుకోవచ్చు. స్క్రబ్ చేసిన తర్వాత కూడా.. చర్మంపై మిగిలిన్ డర్ట్ తొలగించడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.

క్లెన్స్

క్లెన్స్

మీ చర్మ తత్వానికి సరిపోయే క్లెన్సర్ ఉపయోగించాలి. రోజుకి కనీసం రెండుసార్లు క్లెన్సర్ ఉపయోగిస్తే దుమ్ము తొలగించడం తేలికవుతుంది.

స్క్రబ్

స్క్రబ్

ముఖంపై దుమ్ము తొలగించడానికి స్క్రబ్ చాలా అవసరం. చర్మంలోపలి పొరల్లో ఉన్న దుమ్ముని స్క్రబ్ తొలగిస్తుంది. ఇది అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని కూడా తొలగిస్తుంది.

ఫేస్ ప్యాక్

ఫేస్ ప్యాక్

చాలా అదనంగా ఉండే దుమ్ము, ఆయిల్ ని ముఖంపై నుంచి తొలగించడానికి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. ఫేస్ ప్యాక్ ని వారానికి ఒకసారైనా ఉపయోగిస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

టోన్

టోన్

టోనర్ ఉపయోగించడం వల్ల ముఖంలో పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. టోనర్ మీ దగ్గర లేకపోతే.. రోజ్ వాటర్ ఉపయోగిస్తే.. టోనర్ లా పనిచేస్తుంది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ ని ఉపయోగిస్తే.. చర్మాన్ని హైడ్రేట్ చేసి.. దుమ్ము తొలగించి.. ఎక్కువ డర్ట్ ని ఎట్రాక్ట్ చేయకుండా అడ్డుకుంటుంది.

మేకప్

మేకప్

ఎప్పుడూ.. మట్టే మేకప్ వేసుకోవడం వల్ల ముఖంపై దుమ్ము పేరుకోకుండా ఉంటుంది. కాబట్టి.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల.. చర్మంపై దుమ్ము, ధూళి తేలికగా తొలగించవచ్చు.

English summary

How To Remove Deeply Ingrained Dirt From The Skin

How To Remove Deeply Ingrained Dirt From The Skin. Dirt on the skin can make it look dead and lifeless. Here's how you can fix it now.
Story first published: Wednesday, October 26, 2016, 10:27 [IST]
Desktop Bottom Promotion