పుదీనాలో అమేజింగ్ బ్యూటీ అండ్ హెయిర్ బెనిఫిట్స్ ..!!

పుదీనాలో ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాలుగా మాయిశ్చరైజర్ గా, క్లెన్సర్ గా మరియు లోషన్ గా మనకు దొరుకుతుంది. ముఖ్యంగాపుదీనాతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగ

Posted By:
Subscribe to Boldsky

అందంగా ఉండాలనుకొనే ప్రతి ఒక్కరూ వారి చర్మ సంరక్షణకు ఉపయోగించేటటువంటి సరైన బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం ఎంపిక చేసుకోవడంలో గందరగోళం చెందుతుంటారు . మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ తాత్కాలికంగా మార్పులు కలిగించినా వాటి సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి. అందుకు చాలా మంది మార్కెట్లో లభించే కమర్షియల్ ఉత్పత్తులకు జోలికి పోకుండా ఇంట్లో మనకు నేచురల్ గా అందుబాటులో ఉండే కొన్ని హోం రెమడీస్ ను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన చర్మాన్ని పొందుతారు. అలోవెరా మరియు పుదీనాను చాలా మంది చర్మం సంరక్షణలో భాగంగా వినియోగిస్తుంటారు. కాబట్టి, పుదీనాలో కూడా స్కిన్ కేర్ మరియు హెయిర్ కేర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి.

పుదీనానే ఎందుకు? అని మీలో సందేహం కలగవచ్చు. పుదీనా ఒక నేచురల్ హెర్బ్(మూలిక). ఇది ఒక ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. ఇది వివిధ రకాలుగా మాయిశ్చరైజర్ గా, క్లెన్సర్ గా మరియు లోషన్ గా మనకు దొరుకుతుంది. ముఖ్యంగాపుదీనాతో తయారుచేసిన బ్యూటీ ప్రొడక్ట్స్ ను చర్మం సంరక్షణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాగే మింట్ ఆయిల్ ఆరోమాటిక్ ఆయిల్ గా పిలుస్తుంటారు, దీన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. పుదీనా ఆయిల్లో విటమిన్స్, మినిరల్స్, ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ , అధికంగా ఉంటాయి. కాబట్టి, చర్మం మరియు జుట్టుకు గ్రేట్ గా సహాయపడుతుంది.

పుదీనాను చర్మం ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..

బ్రైట్ స్కిన్:

మిట్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల బ్రైట్ స్కిన్ పొందవచ్చు. ఇది డల్ గా , నిర్జీవంగా ఉన్న చర్మంను ినవారిస్తుంది. కొన్ని చుక్కలను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ అద్భుతమార్పులను గమనిస్తారు.

జుట్టు పెరుగుదల:

బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. రెగ్యులర్ ఆయిల్లో కొన్ని చుక్కల మింట్ ఆయిల్ మిక్స్ చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదను ప్రోత్సహిస్తుంది.

మొటిమలు:

చర్మం పూర్తిగా ఆయిలీగా మారకుండా సహాయపడుతుంది. మొటిమలను లేకుండా నివారిస్తుంది.

ఫేస్ స్క్రబ్

మిట్ ఆయిల్ కొద్దిగా బ్రౌన్ షుగర్ జోడించి చర్మానికి అప్లై చేసి స్ర్కబ్బింగ్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫేస్ స్ర్కబ్ ఇన్ స్టాంట్ గా బ్రైట్ గా మార్చుతుంది.

టోనర్:

మింట్ ఆయిల్లో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి, టోనర్ గా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలో పిహెచ్ లెవల్ పెరుగుతుంది. ఆయిల్ నెస్ తగ్గుతుంది.

ఫేస్ ప్యాక్ :

మింట్ ఆయిల్ ను ఫేస్ ప్యాక్ లలో వేసుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ ను అందిస్తుంది. ఫేస్ ప్యాక్ ను అప్లై చేసి డ్రైగా మారిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

డ్రై హెయిర్ :

కోకనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ రెండింటిని మిక్స్ చేసి మసాజ్ చేయాలి. జుట్టుకు మాయిశ్చరైజింగ్ ను పెంచుతుంది.

English summary

How To Use Peppermint For Your Skin

Peppermint is best used in its oil form. It is an aromatic oil and can be used for multiple things. It is rich in vitamins and minerals. It is even rich in omega fatty acids, which as we all know, is a godsend for skin and hair.
Please Wait while comments are loading...
Subscribe Newsletter