అన్నం గంజిలో దాగున్న బ్యూటిఫుల్ స్కిన్ సీక్రెట్స్..!

గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది.

Posted By:
Subscribe to Boldsky

ఒకప్పుడు.. మన అమ్మవాళ్లు ఇంట్లో అన్నం వండిన తర్వాత.. ఆ నీటిని అలానే పక్కనపెట్టేవాళ్లు. దాన్ని అన్నం గంజి అని పిలిచే వాళ్లు. ఇప్పుడు రైస్ వాటర్ అని పిలుస్తారు. ఇది బంకగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎవరికీ నచ్చదు. కానీ.. ఈ అన్నం గంజిని.. రకరకాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకునేవాళ్లు.

rice water

కానీ రోజులు గడిచిన తర్వాత.. మనం అన్నం వండిన నీటిని పడేస్తున్నాం. లేదా రైస్ కుక్కర్, ప్రెజర్ కుక్కర్ వంటి వంటసామాన్లు వచ్చిన తర్వాత.. చాలామంది వీటిల్లో అన్నం చేయడం వల్ల గంజి ఇమిరిపోతుంది. వాటిని వంపడం లేదు.

కానీ అన్నం వంపిన నీటిలో బ్యూటి బెన్ఫిట్స్ అమోఘంగా ఉంటాయి. అన్నం వండిన తర్వాత నీటిని పక్కకు తీసి.. 24 నుంచి 28 గంటలు అలాగే వదిలేయాలి. అది చర్మానికి చాలా మంచిది. అలాగే తర్వాత నీళ్లు కలుపుకుని చర్మానికి వాడవచ్చు.

ఈ గంజిలో అల్లాంటన్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను నివారిస్తాయి. అలాగే ఎమినో యాసిడ్స్ ఉండటం వల్ల..రంధ్రాలను క్లెన్స్ చేసి.. చర్మాన్ని బిగుతుగా మార్చి, కాంప్లెక్షన్ ని పెంచుతుంది. మరి అన్నం గంజిలో దాగున్న స్కిన్ సీక్రెట్స్ తెలుసుకుందాం..

యాక్నె

యాక్నె మచ్చలతో అసహ్యంగా మారుతుంది. ఈ మచ్చలు నివారించడానికి కొద్దిగా అన్నం గంజిలో నీళ్లు, పసుపు కలిపి పట్టించాలి.

ముడతలు

అన్నం గంజి.. ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మదిగా మారుస్తుంది. అందుకే ఏసియన్ మహిళలు.. యంగ్ లుక్ పొందడానికి ఈ అన్నం గంజినే ఉపయోగిస్తారు.

చర్మ రంధ్రాలు

పెద్దగా, అసహ్యంగా మారిన చర్మ రంధ్రాలు.. చర్మాన్ని అందవిహీనంగా మారుస్తాయి. కాబట్టి అన్నం గంజిలో కాటన్ బాల్ ముంచి.. చర్మానికి పట్టించాలి. ముఖ్యంగా పెద్దగా చర్మ రంధ్రాలు ఏర్పడిన దగ్గర పట్టించడం వల్ల.. అవి లోపలికి పోతాయి.

ట్యాన్

ట్యాన్ ఎక్కువగా ఉన్న దగ్గర అన్నం గంజిని పట్టించాలి. కనీసం 30 నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత.. శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచుగా చేస్తే.. ట్యాన్ ని తేలికగా తొలగించవచ్చు.

బ్లాక్ హెడ్స్

గోరువెచ్చని రైస్ వాటర్ ని.. బ్లాక్ హెడ్స్ పై అప్లై చేయాలి. ఆరిన తర్వాత రుద్దాలి. ఇలా తరచుగా చేస్తే.. అద్భుత ఫలితాలు పొందుతారు.

వదులుగా మారిన చర్మం

రైస్ వాటర్ తో వదులుగా మారిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి సహాయపడుతుంది. చర్మం సరైన మోతాదులో కొల్లాజెన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది.

టెక్చర్

అన్నం గంజి.. స్కిన్ టెక్చర్ ని మెరుగుపరుస్తుంది. చర్మ రంధ్రాలను తగ్గించడంతో పాటు.. చర్మం నిర్జీవంగా లేకుండా చేస్తుంది. అలా.. అన్నం గంజితో.. క్లియర్ స్కిన్ పొందవచ్చు.

English summary

How To Use Rice Water For Clear Skin

How To Use Rice Water For Clear Skin. Rice water is one of the best kept secrets of Asian women. Find out how you too can incorporate it into your skin care regimen.
Please Wait while comments are loading...
Subscribe Newsletter