స్కిన్, హెయిర్, బాడీకెర్ లో బానాన చేసే అద్భుతమైన మార్పులు..!!

అరటిపండ్లను బ్యూటిని మెరుగుపరుచుకోవడానికి ముఖం, శరీరం, జుట్టుకు ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. అరటి పండును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల శరీరం, చర్మం, జుట్టుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీని

Posted By:
Subscribe to Boldsky

అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసన విషయమే.. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు ఇన్ స్టాంట్ ఎనర్జీని పొందుతారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లేదా బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక కప్పు కాఫీ తాగడం కంటే, ఒక అరటిపండు తింటే ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు.

అరటి పండ్లలో పొటాషియం వంటి న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉంటాయి కాబట్టి, వీటిని డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో యాంటీబ్యాక్టీయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా చర్మ సంరక్షణకు గ్రేట్ రెమెడీ అని చెప్పవచ్చు.

ఇంకా అరటిపండ్లను జుట్టుకు కండీషనర్ గా, హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. న్యూట్రీషియన్స్ కు పవర్ హౌస్ వంటి అరటిపండ్లను రెగ్యులర్ బ్యూటీకి ఎందుకు ఉపయోగంచకూడదు?వీటి ఖరీదు కూడా తక్కువే మరియు అద్భుతమైన ఫలితాలుంటాయి.

 అరటిపండ్లను బ్యూటిని మెరుగుపరుచుకోవడానికి ముఖం, శరీరం, జుట్టుకు ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. అరటి పండును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల శరీరం, చర్మం, జుట్టుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే రుచిగా బ్యూటి బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. అదెలాగో తెలుసుకుందాం...

మొటిమల నివారణకు ప్యాక్:

అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయిజ ఇది మొటిమలకు సంబంధించిన బ్యాక్టీరియా, క్రిములను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలో జిడ్డును నివారించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

హెయిర్ కండీషనర్ :

అరటి పండ్ల గుజ్జులో కొద్దిగా పెరుగు చేర్చి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి. ఇండి ఎగ్ కండీషనింగ్ మాస్క్ వలే పనిచేస్తుంది. జుట్టుకు మంచి కండీషనర్ ను అందిస్తుంది. జుట్టుకు అరటిపండును అప్లై చేయడం వల్ల అద్భుతమైన మార్పులను అందిస్తుంది.

ఓట్స్ మరియు బనాన స్ర్కబ్:

 అరకప్పు బానాన పేస్ట్ లో కొద్దిగా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి, దీన్ని ముఖానికి అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది.

బనానా షుగర్ స్క్రబ్:

ముఖానికి బనానా షుగర్ స్ర్కబ్ ను ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ముఖ చర్మంలో మాశ్చరైజర్ ను కోల్పోతుంది.

మాయిశ్చరైజింగ్ మాస్క్

ఒక అరటి పండును మ్యాష్ చేసి, తేనెతో మిక్స్ చేసి దీన్ని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

కళ్ళ ఉబ్బు తగ్గిస్తుంది:

ప్లెయిన్ బనానా పేస్ట్ ను ముఖం, కళ్ళకు అప్లై చేయడం వల్ల చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందివ్వడంతో పాటు, ముఖం వాపును తగ్గిస్తుంది.

పాదాల పగుళ్ళను నివారిస్తుంది:

బానాన పేస్ట్ కు కొద్దిగా పంచదారను పాదాలకు అప్లై చేసి పాత సాక్సులను ధరించాలి. రాత్రుల్లో ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్ళు తొలగిపోతాయి.

English summary

How You Can Use Bananas For Beauty

Bananas are the best sources of energy for when you want a healthy kick in the morning. Even better than that morning cup of coffee, we say. But, bananas can be used for beauty too.
Please Wait while comments are loading...
Subscribe Newsletter