ఇవాళే ట్రై చేయాల్సిన వెల్లుల్లిలోనూ సౌందర్య రహస్యాలు..!

వెల్లుల్లిలోని బ్యూటి సీక్రెట్స్ గురించి నమ్మడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఒకసారి ప్రయత్నిస్తే.. ఫలితాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. వెల్లుల్లి చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది ?

Posted By:
Subscribe to Boldsky

వెల్లుల్లి అనగానే.. అందులో దాగున్న ఆరోగ్య రహస్యాలు గుర్తొస్తాయి. కానీ.. వెల్లుల్లి ఆరోగ్య రక్ష మాత్రమే కాదు.. అందానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మొటిమలు నివారించడంతో పాటు, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో కూడా వెల్లుల్లి అద్భుతం చేస్తుంది.

garlic beauty uses

ఈ సీక్రెట్ నమ్మడానికి కాస్త ఇబ్బందిగా, ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఒకసారి ప్రయత్నిస్తే.. ఫలితాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. వెల్లుల్లి చర్మానికి ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఉన్న బ్యూటి సీక్రెట్స్ ముందుగా తెలుసుకోవాలి.

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని రిపేర్ చేసి.. ఎలాంటి సమస్యనైనా నివారిస్తాయి. అలాగే వెల్లుల్లిలో పవర్ ఫుల్ అల్లిసిన్, సెలీనియం ఉంటాయి. ఇవి చర్మంలో ఉండే దుమ్ముని తొలగిస్తాయి. యాక్నేని నివారించి.. మచ్చ పడకుండా చేస్తాయి.

అలాగే వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సిచ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మ రంధ్రాలను సన్నగా మార్చి.. చర్మాన్ని ఫ్రీరాడికల్స్ ని రక్షిస్తాయి. దీనివల్ల పిగ్మెంటేషన్ తొలగిపోతుంది, ఏజింగ్ ప్రాసెస్ నెమ్మదిగా మారుతుంది. కాకపోతే వెల్లుల్లి అందరికీ పడకపోవచ్చు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ కలిగినవాళ్లు.. వెల్లుల్లిని చర్మంపై టెస్ట్ చేయాలి. ఆ తర్వాతే.. ఈ కింద వివరించిన ప్యాక్స్ ప్రయత్నించవచ్చు.

చర్మరంధ్రాలను సన్నగా చేయడం

ఒక టేబుల్ స్పూన్ టమోటా పేస్ట్, దంచిన ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు, గడ్డంకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మొటిమలు

ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, అంతే మొత్తంలో వెల్లుల్లి జ్యూస్ తీసుకుని మిక్స్ చేయాలి. కాటన్ బాల్ సహాయడంతో.. రోజుకి అనేకసార్లు మొటిమపై పట్టిస్తూ ఉండాలి. పూర్తీగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

యాక్నె

1టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, కొన్ని చుక్కల వెల్లుల్లి ఆయిల్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

తామర, దురద వంటి స్కిన్ డిసీజ్

ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఆయిల్ ని 10 సెకన్లు సన్నని మంటపై వేడిచేయాలి. చల్లారిన తర్వాత కాటన్ ప్యాడ్ పై చిలకరించాలి. ఇప్పుడు దాన్ని ఎక్కడైతే రింగ్ వార్మ్ ఉందో అక్కడ రోజుకి రెండుసార్లు పట్టించాలి.

యాంటీ ఏజింగ్ మాస్క్

ఒక గుడ్డులోని తెల్లసొన, 5చుక్కల ఆల్మండ్ ఆయిల్, 2 ఎండిన వెల్లుల్లి రెబ్బల పొడి తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

హెయిర్ గ్రోత్ మాస్క్

వెల్లుల్లిలో ముఖ్యమైన మినరల్స్ ఉంటాయి. అవి హెయిర్ గ్రోత్ ని మెరుగుపరుస్తాయి. గోరువెచ్చని గార్లిక్ ఆయిల్ ని స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంది.

English summary

Incredible Beauty Uses Of Garlic That You Should Try Today!

Incredible Beauty Uses Of Garlic That You Should Try Today! From drying out pimples, clearing acne and boosting hair growth, learn the incredible beauty uses of garlic!
Please Wait while comments are loading...
Subscribe Newsletter