రాత్రికి రాత్రే గోల్డెన్ గ్లో అందించే.. న్యాచురల్ ఫేస్ ప్యాక్..!

గోల్డెన్ గ్లో అందించే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి విటమిన్ ఈ, గ్లిజరిన్, రోజ్ వాటర్ అవసరం. విటమిన్ ఈలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంటస్ ఉంటాయి. అవి చర్మం మాయిశ్చరైజర్ కోల్పోకుండా కాపాడతాయి.

Posted By:
Subscribe to Boldsky

పెద్ద పెద్ద రంధ్రాలు, అసహ్యమైన మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి రకరకాల సమస్యలతో చర్మం అందవిహీనంగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం కష్టం. అలాగని.. అలాగే వదిలేయడమూ కష్టమే.

golden glow

ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి చాలామంది వంటింట్లో ఉన్నవాటిని వదిలేసి.. కెమికల్ ప్రాడక్ట్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. హెర్బల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల.. ఈ సమస్యలన్నింటికీ ఒక్కసారిగా గుడ్ బై చెప్పవచ్చు.

గోల్డెన్ గ్లో అందించే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి విటమిన్ ఈ, గ్లిజరిన్, రోజ్ వాటర్ అవసరం. విటమిన్ ఈలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంటస్ ఉంటాయి. అవి చర్మం మాయిశ్చరైజర్ కోల్పోకుండా కాపాడతాయి. అలాగే డార్క్ స్పాట్స్, వయసు ఛాయలను మాయం చేస్తాయి.

గ్లిజరిన్ లో కార్బన్, ఆక్సిడన్, హైడ్రోజన్ ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. దుమ్ము, ధూళిని తొలగిస్తాయి. గ్లోని పెంచుతాయి. ఆయిలీనెస్ ని కంట్రోల్ చేస్తాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తాయి. మరి ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో చూద్దామా..

స్టెప్ 1

ముందుగా చర్మాన్ని మైల్డ్ క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత టవల్ తో తుడుచుకోవాలి. ఎక్కువ రుద్దకూడదు.

స్టెప్ 2

ఒక గిన్నె తీసుకుని.. 1 విటమిన్ ఈ ట్యాబ్లెట్ వేయాలి. శుభ్రమైన సేఫ్టీ పిన్ తో జెల్ ని కప్ లోకి తీసుకోవాలి.

స్టెప్ 3

1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ ని అందులో కలపాలి. స్పూన్ తో రెండింటినీ బాగా మిక్స్ చేయాలి.

స్టెప్ 4

కొన్ని చుక్కల రోజ్ వాటర్ ని ఆ మిశ్రమంలోకి కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి.

స్టెప్ 5

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించాలి. మసాజ్ చేయాలి. బాగా బ్లడ్ ఫ్లో జరగడానికి కింది నుంచి పైకి స్క్రబ్ చేయాలి. ఈ ప్యాక్ చర్మంలోకి ఇంకిపోయేలా బాగా మసాజ్ చేయాలి.

స్టెప్ 6

ఈ మాస్క్ రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత.. చర్మం సాఫ్ట్ గా మారడం గమనించవచ్చు. అలాగే గ్లోని కూడా చూడవచ్చు. ఒకవేళ మీ చర్మం చాలా పొడిబారిన తత్వం కలిగి ఉంటే.. ప్రతిరోజూ రాత్రి ఈ మాస్క్ అప్లై చేయాలి. ఒక వేళ కాంబినేషన్ లేదా ఆయిలీ స్కిన్ అయితే.. వారానికి రెండుసార్లు అప్లై చేయాలి.

English summary

This 1 Mask Can Give Your Skin Golden Glow Overnight, Try It!

This 1 Mask Can Give Your Skin Golden Glow Overnight, Try It! Hello Cleopatra golden glow! Now you can get that golden glow overnight with this one mask!
Please Wait while comments are loading...
Subscribe Newsletter