For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలో మెడ నలుపును మాయం చేసే బేకింగ్ సోడా చిట్కాలు ..!!

బేకింగ్ సోడాతో డార్క్ నెక్ ను తెల్లగా మార్చడం ఎలా? బేకింగ్ సోడా చర్మానికి ఉపయోగించడం మంచిదేనా?బేకింగ్ సోడా చర్మానికి ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుంది ? ఎలా ఉపయోగించాలి?ఎన్నిసార్లు ఉపయోగించాలో తెలుసుకుందాం

By Lekhaka
|

బేకింగ్ సోడాతో డార్క్ నెక్ ను తెల్లగా మార్చడం ఎలా? బేకింగ్ సోడా చర్మానికి ఉపయోగించడం మంచిదేనా?బేకింగ్ సోడా చర్మానికి ఉపయోగిస్తే ఫలితం ఎలా ఉంటుంది ? ఎలా ఉపయోగించాలి? ఎన్నిసార్లు ఉపయోగించాలో తెలుసుకుందాం..?

చర్మ సమస్యలను నివారించుకోవడానికి ప్రతి సారి ఏదో ఒక పదార్థాలను ఎంపిక చేసుకుంటాము. ఏదోఒక విదంగా చర్మ సమస్యలను నివారించుకోవడానికి ముందు ఉపయోగించే పదార్థాల గురించి ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకు, ఎప్పుడు ఉపయోగించాలన్న ప్రశ్నలు మొదలవుతాయి. అనుకోకుండా వీటికి మనదగ్గర సమాధనాలు ఉండవు.

This Baking Soda Mask Can Get Rid Of Dark Neck In 7 Days!

అందుకే ఆ ఆర్టికల్ మీకోసం ప్రత్యేకంగా మీమనస్సులో మెదిలే అన్ని ప్రశ్నలకు సమాదానం ఇస్తుంది. డార్క్ నెక్ (మెడ నలుపును)తగ్గించుకోవడానికి బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలి?

దానికి ముందు మెడ నల్లగా ఎందుకు మారుతుంది ? అంటే మెడ మీద నలుపు శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల , ఇది హార్మోనుల అసమతుల్యత వల్ల , ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ లేదా యూవీ రేస్ వల్ల ఎక్కువగా ఉంటుంది.

మెడ నలుపు తొలగించడంలో బేకింగ్ సోడా ఎలా సహాయపడుతుంది. బేకింగ్ సోడా రఫ్ గా ఉండటం వల్ లఇది చర్మం మీద ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . డెడ్ స్కిన్ లేయర్స్ ను తొలగిస్తుంది. ఇది చర్మంను శుభ్రం చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, బ్యాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ను తొలగిస్తుంది. స్కిన్ టోన్ లో మార్పులను ఒక వారంలో మీరు గమనించగలరు. అయితే హైపర్ పిగ్మెంటేషన్ పూర్తిగా తొలగించడానికి రెండు మూడు నెలల సమయం తీసుకుంటుంది.

బేకింగ్ సోడా చర్మానికి అప్లై చేయడానికి ముందు ప్యాచ్ టెస్ట్ ను మొదట ప్రయత్నించి స్కిన్ లో ఏలాంటి ప్రభావం, ఇరిటేషన్ లేకపోతే మెడకు నేరుగా అప్లై చేయవచ్చు.

స్టెప్ : 1

స్టెప్ : 1

ఒక బౌల్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేయాలి. బేకింగ్ సోడా కొద్దిగా రఫ్ గా ఉన్నదాన్ని ఎంపికచేసుకోవాలి. మరీ కఠినంగా ఉన్నదాన్ని తీసుకోకూడదు.

స్టెప్ : 2

స్టెప్ : 2

బేకింగ్ సోడకు ఒక టీస్పూన్ పెరుగు చేర్చాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేయాలి. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, చర్మంను లైట్ గా ..బ్రైట్ గా ... స్మూత్ గా మార్చుతుంది.

స్టెప్ : 3

స్టెప్ : 3

ప్రత్యామ్నాయంగా, బేకింగ్ పౌడర్ లో ప్లెయిన్ వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేయాలి. ఇది డార్క్ నెక్ ను తేలికగా, వైట్ గా మార్చుతుంది.

స్టెప్ : 4

స్టెప్ : 4

బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి, ఫోర్క్ తో బాగా మిక్స్ చేయాలి. రెండుబాగా కలిసి పేస్ట్ చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే ల్యూరిక్ యాసిడ్ చర్మ రంద్రాల్లోని మురికిని శుభ్రం చేస్తుంది. బ్లాక్ స్పాట్స్ ను తొలగిస్తుంది.

స్టెప్ : 5

స్టెప్ : 5

మైక్రో ఫైబర్ టవల్ తీసుకుని, హాట్ వాటర్ లో డిప్ చేయాలి. తర్వాత ఎక్సెస్ వాటర్ ను పిండేసి, నిధానంగా మెడమొత్తం తుడవాలి. 5 నిముషాలు తుడివాలి. టవల్లో ఉండే స్టీమ్ చర్మం రంద్రాలు తెరచుకునేల చేసి, మురికిని తొలగిస్తుంది. డార్క్ నెక్ ను త్వరగా నయం చేస్తుంది.

స్టెప్ : 6

స్టెప్ : 6

బేకింగ్ సోడాతో రెమెడీ తయారుచేసుకున్న తర్వాత చేతి వెనక భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కొన్ని నిముషాలు అయిన తర్వాత ఎలాంటి రియాక్షన్ కనబడకపోతే, స్కిన్ ఇన్ఫ్లమేషన్ కు గురికాకపోతే, దీన్ని మెడకు అప్లై చేయాలి.

స్టెప్ : 7

స్టెప్ : 7

బేకింగ్ సోడతో రెమెడీ తయారుచేసుకున్న తర్వాత మెడకు అప్లై చేయాలి . పల్చగా మాత్రమే అప్లై చేయాలి.

స్టెప్ : 8

స్టెప్ : 8

మాస్క్ 15నిముషాలు వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత కొన్ని నీళ్ళు మెడ మీద చిలకరించి, బేకింగ్ సోడా మాస్క్ ను స్క్రబ్ చేయాలి. తర్వాత ప్లెయిన్ వాటర్ తో కడిగేసుకోవాలి.

స్టెప్ : 9

స్టెప్ : 9

సాఫ్ట్ టవల్ తో తుడవాలి. రబ్ చేయకుండా స్మూత్ గా తుడవాలి. కిచెన్ టవల్ కూడా ఉపయోగించవచ్చు. చర్మం మీద తుడిచి, ఎక్సెస్ మాయిశ్చరైజర్ ను తొలగించాలి.

స్టెప్ : 10

స్టెప్ : 10

టవల్ తో తేమను పూర్తిగా తుడిచిన తర్వాత లైట్ గా బాడీ లోషన్ ను అప్లై చేయాలి. జిడ్డు లేకుండా చూసుకోవాలి. ఆయిలీగా లేకుండాజ చర్మ రంద్రాలు ఓపెన్ కాకుండా చూపుకోవాలి.

సూచన: గాయాలు, ఓపెన్ రంద్రాలున్నప్పుడు బేకింగ్ సోడాను ఉపయోగించకపోవడం మంచిది.

English summary

This Baking Soda Mask Can Get Rid Of Dark Neck In 7 Days!

How to get rid of dark neck with baking soda? Is baking soda safe to use? How soon can you expect results? How often can you use?
Story first published: Monday, December 26, 2016, 7:48 [IST]
Desktop Bottom Promotion