ఒక్క క్యారెట్ తో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ..!!

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్లతో పాటు ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ ,అనేక సమస్యలను నివారించడంలో చర్మానికి రక్షణ కల్పించడంలో క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది.

Posted By:
Subscribe to Boldsky

వెజిటేరియన్ డైట్ లో క్యారెట్స్ ముఖ్యమైనవి హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్. చూడగానే అట్రాక్ట్ చేసే కలర్ తో, ఉండే క్రంచీ పవర్ వెజిటేబుల్ ఇది. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం, ఇందులో విటమిన్ ఎ, ఇ, మరియు పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆరోగ్యానికి ఇది పవర్ హౌస్ వంటింది. అరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది,. ఈ క్రంచీ వెజిటేబుల్లో కేవలం హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఎక్కువ దాగున్నాయి.క్యారెట్ లోని పోషక విలువలు స్కిన్ ను రేడియంట్ గా మార్చుతుంది. స్కిన్ క్యాన్సర్ , యాంటీఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

క్యారెట్ లో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్లతో పాటు ఉండే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ ,అనేక సమస్యలను నివారించడంలో చర్మానికి రక్షణ కల్పించడంలో క్యారెట్ గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా మెరుస్తుండటానికి క్యారెట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మ సంరక్షణలో ఉపయోగించే వివిద రకాల వెజిటేబుల్స్ లో క్యారెట్ ఒకటి.


ఈ క్రంచీ ఫుడ్ రెగ్యులర్ గా తింటే, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి, జీర్ణ శక్తి పెరుగుతుంది. స్కిన్ క్వాలిటి పెరుగుతుంది. ఇంకా మరికొన్ని స్కిన్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి .

మొటిమలను నివారిస్తుంది:

క్యారెట్ లో ‘రెటినోల్’ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ’ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఫలితంగా బ్రేక్ ఔట్స్ తగ్గుతాయి. అలాగా హానికరమైన యూవీ రేస్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. స్కిన్ క్వాలిటి పెంచుతుంది.

చర్మంను కాంతి వంతంగా మార్చుతుంది.

క్యారెట్ లో యాంటీఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్ లో ఉండే విటమిన్ ఇ, సి మరియు క్యారెటోల్ చర్మానికి ఎలాంటి హాని జరగకుండా యూవీ రేస్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

స్కిన్ క్యాన్సర్ నివారిస్తుంది:

క్యారెట్ ను రెగ్యులర్ గా తింటుంటే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ , కోలన్ క్యాన్సర్ వంటి సమస్యలుండవు.

ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది:


క్యారెట్ లో ఉండే క్యారెటోల్ శరీరంలో టాక్సిక్ మెటీరియల్ తో పోరాడుతుంది. ఇది కొత్త కణాల ఏర్పాటకు సహాయపడుతుంది. చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఎగ్జిమా, రోసాసియా, ఇన్ఫెక్షన్ తో కూడిన గాయాలు, వీపింగ్ సోర్స్, డెర్మటైటిస్, వంటి చర్మ సమస్యలను, ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది

క్యారెట్ లో ఉండే నేచురల్ ఏజెంట్స్ చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి పునరుద్దరిస్తుంది, చర్మంను ఎల్లప్పుడూ తేమగా ఉంచుతుంది. చర్మంలో నేచురల్ ఆయిల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

స్కిన్ టాన్ నివారిస్తుంది :

కమిలిన చర్మానికి: ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది. క్యారెట్ ను మెత్తగా పేస్ట్ లా చేసిన ఆ పేస్ట్ ను ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ లా వేసుకుంటే సన్ టాన్ నివారించి మంచి కాంతిని అందిస్తుంది.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును తొలగించేందుకు.. క్యారెట్, క్యాబేజీ, టమోటో ముక్కలను సమపాళ్లలో తీసుకుని మెత్తగా నూరి పేస్టులా చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని చల్లటి నీటితో కడిగిన తరువాత నూరిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేయాలి. ఐదు నిమిషాల తరువాత మునివేళ్లతో వలయాకారంలో మర్దనా చేయాలి. ఆరిన తరువాత చన్నీటితో ముఖం కడిగేయాలి. ఆ తరువాత ముల్తానీ మట్టితో ముఖం, మెడకు ప్యాక్ వేసుకుని, కాసేపాగి శుభ్రం చేసుకోవాలి. చివరిగా నాణ్యమైన మాయిశ్చరైజర్ రాసుకుంటే, చర్మం తాజాదనంతో మిలమిలా మెరిసిపోతుంది.

ముడుతలను మాయం చేస్తుంది:

క్యారెట్ యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో సగం అరటి పండు గుజ్జ, గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వలయాకారంగా రుద్దుతూ ఇరవై నిముషాల తర్వాత గోరెవెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖం మీద ముడతలు మాయమవుతాయి.

డెడ్ స్కిన్ తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, కొత్త చర్మం వస్తుంది: క్యారెట్ జ్యూస్ తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ కలపాలి. అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే.. డెడ్ సెల్స్ తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

డ్రై స్కిన్ నివారిస్తుంది: –

పొడిచర్మంతో బాధపడేవాళ్లకు క్యారెట్ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. టేబుల్‌ స్పూన్‌ క్యారెట్‌ జ్యూస్‌, టీ స్పూన్‌ తేనె తీసుకుని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది.

English summary

Top 10 Amazing Benefits Of Carrot For Skin Care

Carrots have been an important part of vegetarian diets. When you include this orange, crunchy power food in your diet, you get vitamin A and many other powerful health benefits that are associated with it.
Please Wait while comments are loading...
Subscribe Newsletter