ఆయిల్ స్కిన్ ఉన్నవారికి టాప్ 10 ఫెయిన్ నెస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ..!!

ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చర్మానికి బెటర్ గా సహాయపడుతాయి. చర్మాన్ని అందంగా మార్చుతాయి. చాల మంది అలోపతిక్ మెడిసిన్స్, ఆయిట్ మెంట్స్ హోం రెమెడీస్ కంటే ఎఫెక్టివ్ గ

Subscribe to Boldsky

ఆయిల్ స్కిన్ ఉన్న వారికి చర్మ సమస్యలు అధికంగాద ఉంటాయి. మొటిమలు, మచ్చలు ఎక్కువై అవి మరిన్ని ఇతర సమస్యలకు దారితీస్తుంది.ఆయిల్ స్కిన్ నివారించుకోవడం కోసం ఉపయోగించే క్రీములు, టానిక్స్ ఎలాంటి ఫలితం ఉండవు . దాంతో ఆయిల్ స్కిన్ తో బాధపడే వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది . ఆయిల్ స్కిన్ కు తోడు , మొటిమలు, మచ్చలతో బయట వెళ్ళడానికి భయపడుతుంటారు. ఫంక్షన్స్, క్యారాలకు దూరంగా ఉంటారు .

అయితే , ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చర్మానికి బెటర్ గా సహాయపడుతాయి. చర్మాన్ని అందంగా మార్చుతాయి. చాల మంది అలోపతిక్ మెడిసిన్స్, ఆయిట్ మెంట్స్ హోం రెమెడీస్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయన్న అపోహ అందిరిలో ఉంటుంది. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు.

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అందంగా, గ్లామరస్ గా..మెరిసిపోతూ కనబడాలని అనుకుంటారు. ఇక్కడ కొన్ని ఫెయిర్ నెస్ టిప్స్ ఉన్నాయి. ఆయిల్ స్కిన్ నివారించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ హోం రెమెడీస్ ను సమస్య ఉన్న వారందరూ తప్పనిసరిగా ఇష్టపడుతారు. ఈ పదార్థాలు ప్రతి ఒక్క ఇంట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఆయిల్ స్కిన్ నివారించే ఫెయిర్ నెస్ టిస్ ఈ క్రింది విధంగా ..

ఫేస్ వాష్

మొదట, చల్లటి నీటితో రోజుకు 5నుండి 7 సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫేషియల్ క్లెన్సర్ ను ఫేస్ వాష్ కోసం ఉపయోగించుకోవచ్చు. క్లెన్సర్ కు నేచురల్ పదార్థాలను ఉపయోగించిన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి.

ఉ్పు

ముఖం శుభ్రం చేసుకునే నీటిలో కొద్దిగా ఉ్పు వేసి, కరిగిన తర్వా త ఆనీటితో ముఖం శుభ్రం చేసుకుంటే ముఖంలో ఎక్సెస్ ఆయిల్ తొలగిపోతుంది .

ప్యాట్ డ్రై

ఫేస్ వాష్ చేసిన తర్వాత తడిలేకుండా పూర్తిగా తుడిచేసుకోవాలి. పూర్తిగా తడి ఆరిన తర్వాత , రఫ్ గా ఉన్న టవల్ తో తుడవడం వల్ల చర్మానికి హానికలుగుతుంది, అందువల్ల మొటిమలున్న వారు , వాటిని స్ర్కాచ్ చేయాలి.

స్కిన్ టోనర్

రెగ్యులర్ గా ఉపయోగించడానికి స్కిన్ టోనర్ ను కొనడం మంచిది. ఇది చర్మంను శుభ్రపరచడంలో సహాయపడుతుంది . ఈ టోనర్ చర్మాన్ని మాత్రమే కాదు, మొటిమలను కూడా తొలగిస్తుంది . చర్మ రంద్రాలను ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తే స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

కీరదోసకాయను

హోం రెమెడీ విషయానికొస్తే, కీరదోసకాయను ముక్కలు చేసి, జ్యూస్ తీసి, అందులో తేనె మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి తక్షణ ఫెయిర్ నెస్ అందుతుంది.

బొప్పాయి

రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిన మరో టిప్ , హోం మేడ్ ఫేస్ వాష్ ను మీరే స్వయంగా తయారుచేసుకోవడం.
ఒక బొప్పాయిని తీసుకుని, మ్యాష్ చేయాలి. అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలను జోడించాలి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్

నాన్ వెజిటేరియన్స్ కోసం మరో చిట్కా, ఎగ్ వైట్ ను ముఖానికి వారంలో రెండు సార్లు అప్లై చేయవచ్చు. దీన్ని ఫెయిర్ నెస్ మాస్క్ గా వేసుకోవచ్చు.

వాల్ నట్ స్ర్కబ్

వాల్ నట్ స్ర్కబ్ ను వారంలో రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు. స్ర్కబ్బింగ్ వల్ల చర్మంలో చేరిన దుమ్ము,ధూళి తొలగిస్తుంది. అలాగే డ్రై అండ్ డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం ఫెయిర్ కంప్లెక్షన్ పొందుతారు.

పచ్చిపాలు

పచ్చిపాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫెయిర్ స్కిన్ టోన్ ను అందిస్తుంది. పచ్చిపాలతో ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చర్మంలో కొత్త కాంతి వస్తుంది.

శెనగపిండిలో

శెనగపిండిలో కొద్దిగా పసుపు , కుంకుమ పువ్వు, పాలు, చేర్చి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ఇన్ స్టాంట్ గా మార్పులను గమనిస్తారు. ఇప్పుడు అర్థమైందా...పెళ్లిలో వధువు కాంతివంతంగా మెరిసిపోతుంటుందో...

English summary

Top 10 Fairness Tips For Oily Skin

Everyone in this world wants to look fairer, glamorous and dazzling. So, here are some homemade fairness tips for oily skin to help you look much fairer and beautiful. I hope all of you will like these tips. I am sure that you would have all of these items available at your home. So, get ready to work on the following tips:
Please Wait while comments are loading...
Subscribe Newsletter