For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడానికి 8 నేచురల్ రెమెడీస్ ..!

By Super Admin
|

స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో సన్నని చారలు, లైన్స్ , ముడుతలు వంటివి). స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా మహిళల్లో ఏర్పడుతుంటాయి. హార్మోనుల అసమతుల్యత, సెడన్ గా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం , పబ్బరిటి, ప్రెగ్నెన్సీ వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఈ స్ట్రెచ్ మార్స్ వల్ల బాధపడాల్సిన పనిలేదు. కొన్ని రకాల స్ట్రెచ్ మార్క్స్ దురద కలిగిస్తాయి, అయినా కూడా వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని ట్రై చేసి, స్ట్రెజ్ మార్క్స్ ను పూర్తిగా తొలగించుకోవచ్చు.

సహజంగా స్ట్రెర్చ్ మార్స్ చర్మంలో ఎర్రగా , పర్పుల్ కలర్ లో లేదా సిల్వర్ కలర్ లో స్కిన్ టోన్ కు దగ్గరగా కనబడుతాయి. చర్మంలోని ఎపిడెర్మ్ చిరగడంతో చర్మం క్రింది భాగంలో స్ట్రెర్చ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఇటువంటి స్ట్రెర్చ్ మార్క్స్ ను నయం చేసుకోవడానికి వివిధ రకాల క్రీములను ఉపయోగిస్తుంటారు , అయితే వీటి స్థానంలో హోం రెమెడీస్ ను ఉపయోగిస్తే రెడ్ నెస్ తో పాటు కొత్తగా ఏర్పడే స్ట్రెర్చ్ మార్క్స్ కూడా తొలగిపోతాయి.

స్ట్రెర్చ్ మార్క్స్ ను తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా అందిస్తున్నాము..

విటమిన్ ఇ :

విటమిన్ ఇ :

విటమిన్ ఇ క్యాప్స్యూల్ ను బ్రేక్ చేసి, అందులోని ఆయిల్ ను ఉపయోగించాలి. స్ట్రెర్చ్ మార్స్ ఉన్న ప్రదేశంలో ఈ ఆయిల్ అప్లై చేసి , మసాజ్ చేయాలి. విటమిన్ ఇ కొల్లాజెన్ ఉత్పత్తిని , సెల్ ప్రొడక్షన్ ను క్రమబద్దం చేస్తుంది. ఇవి పాతవాటితో పాటు కొత్తగా ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ ను కూడా తొలగిస్తుంది.

కలబంద:

కలబంద:

సహజసిద్దంగా మనకు అందుబాటులో ఉండే అలోవెర జెల్ ను స్ట్రెర్చ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.ఇది చర్మానికి మాయిశ్చైజర్ ను అందిస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మంలోకి చాలా సులభంగా గ్రహిస్తుంది. చర్మం దురదను నివారిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ

ఆముదం:

ఆముదం:

ఆముదం స్కిన్ టిష్యలోకి డీప్ గా షోషింపబడుతుంది . దాంతో స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. ఫ్లాకీ స్కిన్ కు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది . దాంతో చర్మంలో దురద తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ చర్మంలోనికి పూర్తిగా షోషించి, చర్మం లోపలి నుండి స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది . ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలన్నింటికి గ్రేట్ గా పనిచేస్తుంది, ముఖ్యంగా స్కార్స్ ను తొలగిస్తుంది.

కోకబట్టర్:

కోకబట్టర్:

కోకబట్టర్ ఒక ఎఫెక్టివ్ పదార్థం, అనేక బ్యూటీ క్రీమ్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు . కోకో బీన్స్ నుండి తయారుచేసిన నేచురల్ ఫ్యాట్ , రూమ్ టెంపరేచర్ లోనే కరిగిపోతుంది. ఇది చర్మంలోపలి వరకూ చేరి, స్కార్స్ , స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

బ్యూటీకేర్ లో కొబ్బరి నూనె లేకుండా ఏది కంప్లీట్ కాదు. స్కాల్ఫ్ మరియు స్కిన్ కు గ్రేట్ గా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా డ్రై స్కిన్ కు గ్రేట్ రెమెడీ. ఇది కొత్తగా స్కార్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది .

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంప రసంలో విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువగా ఉంటాయి,ఇది స్కిన్ సెల్స్ ను రీస్టోర్ చేస్తుంది. కొత్తగా చర్మకణాల ఏర్పాటకు సహాయపడుతుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ మరియు అమినోయాసిడ్స్ ఎక్కువ, స్కార్స్ మీద ఎగ్ వైట్ అప్లై చేసి, 1నిముషాల త్వాత శుభ్రం చేసుకుంటే స్కార్స్ తొలగిపోతాయి.

English summary

Top 8 Home Remedies To Get Rid Of Stretch Marks

Stretch marks usually start as red or purple marks and then slowly fade away to silver or closer to the skin tone. It is impossible to actually heal stretch marks, no matter how many creams claim to do so. It is actually a tear in the epidermis of the skin, that is, below the surface of the skin.
Story first published:Sunday, August 28, 2016, 12:04 [IST]
Desktop Bottom Promotion