For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గిన తర్వాత చర్మం వదులుగా కనిపిస్తోందా..? ట్రై దిస్ హోం రెమెడీస్

|

బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాంటి మార్పుల్లో స్కిన్ చేంజేస్ కూడా ఒకటి. సెడెన్ గా బరువు తగ్గడం వల్ల చర్మంలో ఎలాసిటి తగ్గి, సాగినట్లు కనబడుతుంది.

బరువు తగ్గడం వల్ల చర్మం వదులౌతుంది. దాంతో చర్మం సాగినట్లు కనబడుతుంది. ఫలితంగా చర్మం చూడటానికి ఆకర్షనీయంగా కనబడదు. ఇటువంటి నిర్జీవమైన , వదులైన చర్మం కలిగి ఉండటం వల్ల మనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతాయి.

అయితే, ఓవర్ వెయిట్ ఉన్న వారిలో ఇది అత్యంత సాధారణ సమస్య. వెయిట్ లాస్ స్కిన్ ప్రాబ్లెమ్ తో బాధపడే వారు , ఈ సమస్య నుండి బయటపడటం అంత సులభం కాదు.

ఈ సమస్యను నివారించుకోవడానికి కాస్మోటిక్ సర్జరీలు కూడా చేసుకుంటారు. స్కిన్ ఎలాసిటి పెరుగుతుంది. అయితే ఈ సమస్య నుండి నేచురల్ గా బరువు తగ్గాలని కోరుకుంటే కొన్ని మోస్ట్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల వదులైన చర్మం టైట్ గా మారుతుంది.

అంతే కాదు, ఇందులో ఉండే నేచురల్ ఏజెంట్స్ వదులైన చర్మం మీద పనిచేస్తాయి. ఈ నేచురల్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ట్రై అండ్ టెస్ట్ చేసి నిర్ధారించబడినవి. వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. త్వరగా స్కిన్ ఎలాసిటిని పెంచుకుంటారు.

హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా ఈ క్రింది సూచించిన హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేసి, పోస్ట్ వెయిట్ లాస్ తర్వాత స్కిన్ ఎలాసిటిని పెంచుకుకోవచ్చు.

మసాజ్:

మసాజ్:

స్కిన్ మసాజ్ చేయడం వల్ల చర్మం వదులైన చర్మం టైట్ గా మారుతుంది. నేచురల్ లేదా హెర్బల్ఆరోమా ఆయిల్స్ తో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవచ్చు . చర్మం టైట్ గా మరియు అందంగా తయారవుతుంది.

మాయిశ్చరైజర్:

మాయిశ్చరైజర్:

స్కిన్ మాయిశ్చరైజర్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల, మంచి ఫలితం ఉంటుంది. రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే చాలు స్కిన్ టైట్ గా మారుతుంది. క్రమంగా స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది మరియు చర్మం లో కొత్త కణాలు పెరుగుతాయి. ఉదయం సాయంత్రం మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ మార్పులను తీసుకొస్తుంది.

చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి:

చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి:

ఇది చాలా సింపుల్ , పవర్ ఫుల్ హోం రెమెడీ. వదులైన చర్మాన్ని టైట్ గా మార్చడానికి ఎప్పుడూ చర్మం తేమగా ఉండేలా చూసుకోవాలి. అందుకు రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి. .ఇది స్కిన్ ఎలాసిటి పెంచడంతో పాటు, మొత్తం స్కిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

ఎండలో తిరగడం తగ్గించాలి:

ఎండలో తిరగడం తగ్గించాలి:

ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సూర్య రశ్మిలోని యూవీ కిరణాలు చర్మం మీద పడినప్పుడు, స్కిన్ టాన్ తో పాటు, స్కిన్ ఎలాసిటి తగ్గుతుంది. కాబట్టి, సన్ రేస్ కు గురి అవ్వకుండా చర్మాన్ని కాపాడుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్ర్కీన్ అప్లై చేయాలి. మరియు చర్మానికి రక్షణ కల్పించాలి.

ఆముదం నిమ్మరసం:

ఆముదం నిమ్మరసం:

ఇది ఎఫెక్టివ్ రెమెడీ. ఈ రెండింటి కాంబినేషన్లో మసాజ్ చేయడం వల్ల స్కిన్ ఎలాసిటి పెరిగి, స్కిన్ టైట్ గా మారడంతో పాటు, స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మొత్తం చర్మానికి దీన్ని అప్లై చేయవచ్చు. 5 నుండి 10 నిముషాలు మసాజ్ చేయాలి. ఇది వదులైన చర్మాన్ని టైట్ గా మార్చడం మాత్రమే కాదు, ఇది చర్మాన్ని సాప్ట్ గా మరియు అందంగా మార్చుతంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

చర్మంలో ఏవిధమైన స్ట్రెచ్ మార్క్స్ ఉన్నా బాదం ఆయిల్ గ్రేట్ గా నివారిస్తుంది, ఇది వదులైన చర్మాన్ని ఎఫెక్టివ్ గా టైట్ చేస్తుంది. కొద్దిగా బాదం ఆయిల్ చేతిలోకి తీసుకుని ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

సీసాల్ట్ స్ర్కబ్:

సీసాల్ట్ స్ర్కబ్:

సీసాల్ట్ ను స్ర్కబ్బింగ్ గా అప్లై చేయడం వల్ల నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, చర్మాన్ని తేమగా మరియు కాంతివంతంగా మార్చుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది . చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

English summary

Try These Remedies To Tighten Your Skin After Weight Loss

Loose, sagging skin is probably one of the only side effects of rapid weight loss.Loss of weight can make your skin lose its elasticity and tightness. And the result is appearance of unattractive, sagging skin that can adversely affect your confidence level.But, this is a highly common problem that most people who lose weight have to deal with. And dealing with this post-weight-loss skin problem is not an easy task.
Story first published: Tuesday, June 28, 2016, 9:58 [IST]
Desktop Bottom Promotion