For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : ఈ బ్యాడ్ ఫుడ్స్ మిమ్మల్ని అందవిహీనంగా మార్చుతాయి..?

సహజంగా మనం తినే ఆహారం మీద ఆరోగ్యం అందం ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలుసు. ఆరోగ్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆరోగ్యం ఓకే, అయితే అందం?

|

సహజంగా మనం తినే ఆహారం మీద ఆరోగ్యం అందం ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలుసు. ఆరోగ్య పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విధంగా ఆహారాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆరోగ్యం ఓకే, అయితే అందం? ముఖ్యంగా చర్మ సౌందర్యం... చర్మానికి కూడా ఆరోగ్యకరమైన డైట్ ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే అందం రిఫ్లెక్ట్ అవుతుంది.

చర్మం అందంగా కనబడాలంటే చర్మానికి ఎక్కువ మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది. చర్మం ఆరోగ్యంగా తేమగా ఉండాలంటే న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.

తెల్ల జుట్టును నివారించే 10 పవర్ ఫుల్ హోం రెమెడీస్

మనం రోజూ తినే ఆహారాలే అయినా కొన్ని మాత్రం చర్మ సౌందర్యానికి హానికలిగిస్తాయి. చర్మ సౌందర్యాన్ని అతి భయంకరంగా పాడుచేస్తాయి. చర్మంలో గ్లో తగ్గించేస్తాయి. కాబట్టి, . చర్మం అందంగా, కాంతివంతంగా..స్కిన్ బ్యూటీ మెరుగుపరుచుకోవాలంటే ఈ క్రింది సూచించిన బ్యాడ్ ఫుడ్స్ ను నివారించుకోవాలి..

ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్:

ఫాస్ట్ ఫుడ్స్ లో నూడిల్స్, స్మైలీస్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినడానికి టేస్ట్ గా అనిపించవచ్చు. అయితే వీటిలో న్యూట్రీషియన్స్ చాలా తక్కువగా ఉంటాయి.వీటిలో ఆయిల్ మరియు సాల్ట్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ ను డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. కాబట్టి పాస్ట్ ఫుడ్స్ తినే అలవాటును మానుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గిస్తే ఆటోమాటిక్ గా చర్మంలో గ్లో పెరుగుతుంది.

 రెడ్ మీట్ :

రెడ్ మీట్ :

రెడ్ మీట్ తినడం వల్ల ముఖ్యంగా ఫాట్ ఎక్కువగా ఉండే పార్ట్స్ ను తినడం వల్ల ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కు దారితీస్తుంది. వీటిలో శ్యాచురేటెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధికంగా తినడంవ వల్ల ఫ్రీరాడికల్స్ మరింత పవర్ తో పునరుత్పత్తి అవుతాయి. ఆక్సిడేషన్ కెప్యాజిటీ పెరుగుతుంది. ఫ్రీరాడికల్స్ పెరిగి వయస్సైన వారిలా కనిపించేలా చేస్తాయి.

నాన్ ఆర్గానిక్ ఫుడ్స్:

నాన్ ఆర్గానిక్ ఫుడ్స్:

నాన్ ఆర్గానిక్ ఫుడ్స్ హార్మోన్స్ , హెర్బిసైడ్స్, ఫగ్సైడ్స్, మరియు వాక్స్ కలిగి ఉండి, పండ్ల యొక్క నేచురల్ కలర్ ను తగ్గించేస్తాయి. కాబట్టి, ఇటువంటి నాన్ ఆర్గానికి ఫ్రూట్స్ తినడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది.

చిప్స్ :

చిప్స్ :

ప్రిజర్వేటివ్ ఫుడ్స్ మరియు చిప్స్ లో ఉండే నూనెలో చర్మాన్ని మరింత వరెస్ట్ గా మార్చుతుంది. ఫలితంగా బ్రేక్ అవుట్స్ అధికం అవుతాయి.

ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు స్వీట్నర్స్ :

ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మరియు స్వీట్నర్స్ :

స్వీట్నర్ ఆర్టిఫీషియల్ గా ఉంటాయి. వీటిని నిల్వచేయడం కోసం డిఫరెంట్ కెమికల్స్ ఉపయోగించి తయారుచేస్తుంటారు. ఇవి మీ అందాన్ని పాడు చేస్తాయ!

 ఫుడ్ సప్లిమెంట్ :

ఫుడ్ సప్లిమెంట్ :

ఫుడ్ సప్లిమెంట్ తీసుకోవడం ఆరోగ్యపరంగా శరీరానికి మంచిదే. అయితే సప్లిమెంట్ తీసుకునేటప్పుడు ఎదైన అకస్మాత్ గా చర్మంలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. ఒక వేళ మీరు తిసున్న సప్లిమెంట్ క్వాలిటీ మీ శరీరానికి సరిపడకపోవచ్చు.

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ :

డైరీ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు, అయితే చర్మానికి?అది చర్మ తత్వం మీద ఆధారపడి ఉంటుంది. హార్మోనుల అభివ్రుద్దికి ఇది చాలా అవసరం అవుతుంది. న్యూట్రీషియన్స్ కూడా పెరుగుతుంది. ఫలితంగా చర్మంలో మొటిమలు, మచ్చలు, పెరిగి తర్వగా వయస్సైన వారిలాగా కనబడతారు.

జ్యూస్ అండ్ సోడాలు:

జ్యూస్ అండ్ సోడాలు:

పైబర్ లోపం వల్ల కూడా చర్మం సౌందర్యం దెబ్బతింటుంది. శరీరంలో ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అయితే జ్యూస్ లు, సోడాల రూపంలో తీసుకోవడం వల్ల, చర్మంలో ముడుతలకు దారితీస్తుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. వైన్, బీర్, లిక్కర్ వంటివి కూడా డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. స్కిన్ మాయిశ్చరైజర్ ను తగ్గిస్తుంది. దాంతో చర్మంలో గ్లో తగ్గుతుంది.

సాల్ట్ :

సాల్ట్ :

రెగ్యులర్ డైట్ లో ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడం వల్ల చర్మం డ్రైగా మరియు డల్ గా మారుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఉప్పు తగ్గించాలి.

English summary

10 Worst Foods Those Are Actually Terrible for Your Skin

However there are lot of food product that will rid your body and skin of that healthy glow. To make sure keep the beauty, your skin is as healthy and glowing as always, avoid these bad foods as follows.
Story first published: Monday, April 24, 2017, 15:09 [IST]
Desktop Bottom Promotion