For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిటికెలో మేకప్ ను తొలగించే వెరీ సింపుల్ టిప్: పాలు

ముఖానికి వేసుకునే అలంకరణను తొలగించడానికి ఖరీదైన రసాయన ఉత్పత్తులే అన్నిసార్లు వాడాలని లేదు. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనూ దాన్ని తొలగించుకోవచ్చు. పైగా వాటివల్ల లాభాలు కూడా ఉంటాయి తెలుసా

|

మగువులు ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో చిట్కాలు, మెళుకువులు పాటిస్తుంటారు. అయితే వారు వాడే కొన్ని సౌందర్య సాధనాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవటంవల్ల, కొన్ని పొరపాట్లు జరిగి కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఆ పొరపాట్లేమిటో తెలుసుకోగలిగితే, వాటిని సరిదిద్దుకోగలుగుతాము. బాహ్యసౌందర్య కోసం మేకప్ ఎలా వేసుకొంటామో..ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటామో వాటిని రిమూవ్ చేసేటప్పుడు అన్నే జాగ్రత్తలు పాటించగలిగినప్పుడు చర్మాన్ని కాపాడుకోవచ్చు.

6 Best Ways to Remove Makeup Before Bed Time

రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ను తప్పనిసరిగా తీసేయాలి. మేకప్ తీసివేయటానికి సబ్బు వాడకుండా క్లెన్జింగ్ మిల్క్ రాసుకుని, తరువాత సున్నితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని వేడినీటితో కడుక్కుని, మాయిశ్చరైజర్ క్రీమ్‌గానీ, లోషన్ గానీ రాసుకోవాలి. అలా కాకుండా సబ్బు వాడటంవల్ల మేకప్ పూర్తిగా పోదుకదా, సబ్బు ప్రభావం చర్మం మీద పూర్తిగా పడుతుంది. ముఖాన్ని సబ్బుతో అదేపనిగా రుద్దటంవల్ల ముఖ చర్మం డ్రైగా మారి ర్యాషెస్ (దద్దుర్లు) రావటం, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి, మేకప్ ను రిమూవ్ చేయడానికి కొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి.

ముఖానికి వేసుకునే అలంకరణను తొలగించడానికి ఖరీదైన రసాయన ఉత్పత్తులే అన్నిసార్లు వాడాలని లేదు. మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనూ దాన్ని తొలగించుకోవచ్చు. పైగా వాటివల్ల లాభాలు కూడా ఉంటాయి తెలుసా.

పెరుగు

పెరుగు

పావుకప్పు పెరుగులో రెండు చుక్కల ఆలివ్‌నూనె కలిపి దానిలో ముంచిన దూదితో అలంకరణను తుడిచేయండి. అలంకరణ పూర్తిగా పోతుంది. పెరుగు చర్మంపై పేరుకున్న మురికినే కాదు.. మృతచర్మాన్నీ తొలగిస్తే ఆలివ్‌నూనె మృదుత్వాన్ని అందిస్తుంది.

తేనె

తేనె

రెండు చెంచాల తేనెపై కొద్దిగా వంటసోడాను వేసి దాంతో ముఖాన్ని తుడుచుకుని చూడండి. ఈ రెండింటిలో ఉండే సుగుణాల వల్ల చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. తాజాగానూ కనిపిస్తుంది.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

నీటిఆధారిత మేకప్‌ని తొలగించడం కాస్త పెద్దపనే. దీన్ని వేసుకున్నప్పుడు కొబ్బరినూనెను ఉపయోగించాలి. ఆ నూనెలో దూదిని ముంచి.. ముఖాన్ని తుడుచుకోవాలి. అలంకరణ పూర్తిగా పోయి.. చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.

టొమాటోను

టొమాటోను

టొమాటోను మెత్తగా చేసుకుని దానికి కాస్త కొబ్బరినూనె లేదా పిల్లల ఒంటికి రాసే నూనెను కలిపి ముఖానికి రాసుకున్నా కూడా అలంకరణ పోతుంది. పైగా ఆ మిశ్రమం చర్మాన్ని శుభ్రం చేస్తుంది కూడా. టొమాటో అందుబాటులో లేకపోతే.. కీరదోస గుజ్జుని కూడా వాడొచ్చు.

ఆవిరి పట్టాలి

ఆవిరి పట్టాలి

ముఖాన్ని కొబ్బరినూనెతో తుడిచేసుకుని ఆ తరవాత కాసేపు ఆవిరి పట్టాలి. చర్మగ్రంథులు తెరుచుకుని అలంకరణ పూర్తిగా పోతుంది.

ఆలివ్‌నూనెను

ఆలివ్‌నూనెను

ఆలివ్‌నూనెను కాస్త తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాలయ్యాక దూదితో తుడిచేసి, ఆ తరవాత కడిగేసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగానే కాదు, మృదువుగానూ కనిపిస్తుంది.

English summary

6 Best Ways to Remove Makeup Before Bed Time

After a long day, taking off our face is often the last thing we feel like doing. There are no ways to remove makeup that consist of simply snapping our fingers and having it instantly disappear, so we'll probably forever dread the process.
Story first published: Thursday, February 16, 2017, 17:17 [IST]
Desktop Bottom Promotion