For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొటిమలను శాశ్వతంగా దూరం చేసే పుదీనా పూత..!

మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి. మందుల సంగతి అలా ఉంచి , కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ గా మొటిమలను నివ

|

ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పిగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. ఏ పార్టీకో, ఫంక్షన్ కో వెళ్ళాల్సివచ్చినప్పుడు ముక్కుమీదో, బుగ్గమీద మొటిమలు ఉన్నాయనుకోండి మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మన శరీరంలో కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు లాంటి అవయవాలతోబాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి.

మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి. మందుల సంగతి అలా ఉంచి , కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ గా మొటిమలను నివారించుకోవచ్చు. మొటమిలను తగ్గించుకోవడంలో వేపా, తులసీ, లవంగాలూ, పుదీనా వంటివాటితో ఇలా చేసి చూడండి.

Acne Treatment using mint leaves (pudina)

పుదీనా చాలా పాపులర్ అయినటువంటి హేర్బ్. ఎందుకంటే పురాతన కాలం నుండి పుదీనాలోని ఔధగుణాలను వివిధ రకాల జబ్బులను నివారించుకోవడంలో గ్రేట్ గా ఉపయోగించుకుంటున్నారు . ఒక్క ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ ఆరోగ్యానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఘాటైన వాసన కలిగిన రిఫ్రెషింగ్ హెర్బ్ ఇది . పుదీనాలో మెంతాల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి చర్మంలో మెటిమలను నివారించే సత్తా పుదీనాకే ఉంది..అదెలాగో చూద్దాం..

నిమ్మరసం, తేనె:

నిమ్మరసం, తేనె:

సమపాళ్లలో నిమ్మరసం, తేనె కలిపి మొటిమల మీద రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఐదారుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

నువ్వులూ:

నువ్వులూ:

నువ్వులూ మొటిమలకు పరిష్కారం చూపుతాయి. వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మర్నాడు ముద్దలా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఆరాక కడిగేసుకుంటే చాలు.

బంగాళదుంప రసం:

బంగాళదుంప రసం:

ముఖానికి బంగాళదుంప రసం రాసినా ఫలితం ఉంటుంది. ఇది మొటిమలని తగ్గించడమే కాక ముఖానికి సహజ మెరుపునిస్తుంది.

లవంగాలు :

లవంగాలు :

మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు లవంగాలను నీళ్లు, లేదా పాలతో కలిపి మెత్తగా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి.

 పుదీనా :

పుదీనా :

కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తని ముద్దలా చేయాలి. దీన్ని మొటిమలున్న చోట రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే మార్పు కనిపిస్తుంది. పుదీనాలో చర్మానికి చల్లదనాన్నిచ్చే గుణాలున్నాయి.

తులసి ఆకు:

తులసి ఆకు:

తులసి ఆకుల ముద్దను మొటిమలపై రాయడం వల్ల అవి తగ్గుతాయి. బజార్లో తులసి ఆకుల పొడి దొరుకుతుంది. దానికి కాసిని వేడినీళ్లు కలిపి పూతలా చేసి మొటిమలపై రాసి, పది నిమిషాల తరవాత కడిగేయాలి.

వేప ఆకు

వేప ఆకు

వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

పసుపు

పసుపు

కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.

English summary

Acne Treatment using mint leaves (pudina)

Mint (Pudina )is a great way to cure acne. It is considerd to be the best herbal home remeday for the acne. It works on all skin type with any type of acne.
Desktop Bottom Promotion