For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొప్పాయి-తేనెలో ఎలాంటి చర్మ సమస్యలైనా నివారించే గుణాలు..!

|

బొప్పాయి లేదా పపాయ అంటే తెలియని వారుండరు. క్రిస్టోఫర్ కొలంబస్ బొప్పాయిని ''ఫ్రూట్ ఆఫ్ ఏజిల్'' అని కూడా పిలుస్తారు . బొప్పాయి చూడటానికి, తినడానికి స్మూత్ గా, స్వీట్ గా ఉంటుంది. ఆరెంజ్ కలర్లో నోరూరించే ఈ ఫ్రూట్ లో విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ, మరియు విటమిన్ కె లు పుష్కలంగా ఉన్నాయి. సోలబుల్ ఫైబర్ వంటివి కూడా అధికంగా ఉండటం వల్ల ఇది సౌందర్య పోషణనకు గ్రేట్ గా సహాయపడుతుంది.

బొప్పాయితో పాటు మరో పదార్థాన్ని కూడా సౌందర్య పోషణకు ఉపయోగించుకోవచ్చు. తేనెలో ఆరోగ్య ఔషధ గుణాలు మాత్రమే కాదు, సౌందర్యానికి సహాయపడే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

తేనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటం వల్ల దీన్ని బ్యూటీ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. స్వచ్చమైన తేనెను ఎంపిక చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మ సౌందర్యానికి తేనె ఉపయోగించడానికి ముందు, బొప్పాయి ఉపయోగించడం వల్ల అందులోని చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

చర్మానికి బొప్పాయి ఉపయోగించడం వల్ల పొందే 5 అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది:

1. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది:

చర్మంలో ఉండే ఎలక్ట్రోలైట్, పెపైన్ , ఫ్లూయిడ్స్ చర్మానికి కావల్సిన తేమను అందివ్వడం మాత్రమే కాదు, స్కిన్ పిహెచ్ లెవల్స్ ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది స్కిన్ ఏజ్ అయినట్లు కనబడకుండా ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది.

2. యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి:

2. యాంటీ ఏజింగ్ లక్షణాలున్నాయి:

బొప్పాయి ఎక్సఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. బొప్పాయిలో ఆల్ఫా హైడ్రాక్సిల్స్ యాసిడ్స్ ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్, ముడతలు, చారలను తొలగిస్తుంది. బొప్పాయిలో కొద్దిగా పెరుగు చేర్చి మెత్తగా చేసి చర్మానికి అప్లై చేయాలి.

3. మొటిమలను నివారిస్తుంది:

3. మొటిమలను నివారిస్తుంది:

బొప్పాయిలో ప్రోటాలిక్ ఎంజైమ్స్ అధికంగా ఉండటం వల్ల ముఖంలో మొటిమలను మచ్చలను తొలగిస్తుంది. పచ్చిబొప్పాయి మెత్తగా పేస్ట్ చేసి మొటిమల మీద అప్లై చేయడం వల్ల రాత్రి రాత్రి మొటిమలను నివారిస్తుంది.

4. సన్ టాన్ తొలగిస్తుంది:

4. సన్ టాన్ తొలగిస్తుంది:

ఉష్ణమండల ప్రదేశాల్లో నివసించే వారికి మాత్రమే కాదు, ఎండ, వేడిలో తిరిగే వారిలో కూడా ట్యానింగ్ సమస్యలుంటాయి. చర్మ త్వరగా నల్లగా మారుతుంటుంది. అటువంటప్పుడు బొప్పాయి జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.

5. అవాంఛిత రోమాలను తొలగిస్తుంది:

5. అవాంఛిత రోమాలను తొలగిస్తుంది:

బొప్పాయి , తేనె, పుల్లర్స్ ఎర్త్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంలో అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. మరి బొప్పాయిలోని బ్యూటి బెనిఫిట్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు తేనెలోని అమేజింగ్ బ్యూటి సీక్రెట్స్ తెలుసుకుందాం..

6. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది:

6. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది:

తేనెను చర్మానికి అప్లై చేసినప్పుడు డీప్ కండీషనర్ గా పనిచేసి , మాయిశ్చరైజింగ్ గా మారుతుంది.

7. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది:

7. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది:

మైక్రో పార్టికల్స్ గా పనిచేస్తుంది. చర్మంలోని సన్నిని రంద్రాలను క్లీన్ చేసి, తిరిగి ష్రింక్ అయ్యేందుకు సహాయపడుతుంది. చర్మ రంద్రాల్లో దుమ్మూ, ధూళి చేరకుండా రక్షణ కల్పిస్తుంది.

8. బాడీని క్లీన్ చేస్తుంది:

8. బాడీని క్లీన్ చేస్తుంది:

రెంటు టేబుల్ స్పూన్ తేనెను ఒక కప్పు హాట్ వాటర్ తో మిక్స్ చేయాలి. ఈ వాటర్ ను స్నానం చేసే నీటితో మిక్స్ చేయాలి. ఈ వాటర్ తో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అయితే తలకు పోసుకోకూడదు.

9. క్యూటికల్స్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది:

9. క్యూటికల్స్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది:

నెయిల్ పాలిష్ తొలగించిన తర్వాత అసిటోన్ నెయిల్ క్యూటికల్స్ ను డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల నెయిల్స్ కు పోషణను అందివ్వడం చాలా అవసరం. ఒక టీస్పూన్ తేనె 1/4టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ , 1 టీస్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేసి, గోరువెచ్చని నీటిలో డిప్ చేసి గోళ్ళను శుభ్రం చేసుకోవాలి.

10. సన్ బర్న్ నివారిస్తుంది:

10. సన్ బర్న్ నివారిస్తుంది:

వేసవిలో ఎండల కారణంగా చర్మం తర్వగా నల్లగా కమిలినట్లు తయారవుతుంది. తేనెను చర్మానికి అప్లై చేయడం వల్ల సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాల నుండి రక్షణ కల్పిస్తుంది.

English summary

Benefits Of Using Papaya And Honey On Skin

Papaya is a fleshy tropical fruit dubbed as the "Fruit of Angels" by Christopher Columbus. It has a very smooth texture, like a sweet butter. Being an orange coloured fruit, it is rich in vitamin A, carotenoids, vitamin E and vitamin K. It is rich in soluble fibre and therefore helps in all your beauty purposes. Here are certain benefits of using papaya and honey on skin..
Desktop Bottom Promotion