For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ముఖంలో చెమటలు తగ్గించుకోవడానికి సింపుల్ టిప్స్..!

ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చర్మం జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంది. ఎంత మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వేసవిలో చెమటలు తగ్గించుకోవడం అంత సులభం కాదు .

|

వేసవి ఎండలు ఒకరకంగా ఇబ్బంది కలిగిస్తే.. చెమటలు మరో రకంగా చీకాకు ఇబ్బంది కలిగిస్తాయి. అరచేతుల్లో చెమటలు.... కాళ్లలో చెమటలు, ముఖంలో చెమటలు..ఇలా బాడీ మొత్తం చెమటలతో ఇబ్బంది..అసౌకర్యం.

ముఖ్యంగా ఎన్ని సార్లు స్నానం చేసినా..ముఖం శుభ్రం చేసుకున్నాముఖంలో ఫ్రెష్ నెస్ కనబడదు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది. వేసవిలో డే మరియు నైట్ టైమ్ చెమటలు పట్టడం సహజం. అయితే ముఖంలో చెమటలు పడితే ఇబ్బంది మాత్రమే కాదు, హ్యాండిల్ చేయడానికి కూడా కష్టమే. ఇటువంటి సమయంలో చర్మం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

ఎక్కువ చెమటలు పట్టడం వల్ల చర్మం జిడ్డుగా, ఆయిలీగా కనబడుతుంది. ఎంత మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. వేసవిలో చెమటలు తగ్గించుకోవడం అంత సులభం కాదు .

అయితే ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ తో ఈ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కూడా ఫేషియల్ స్వెట్టింగ్ ను దూరం చేసుకోవచ్చు.

ఈ సింపుల్ టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ చిట్కాలను డైలీ స్కిన్ కేర్ లో ఉపయోగించడం కూడా చాలా మంచిది. వీటిని రెగ్యులర్ గా కొద్దిరోజులు ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది . మార్పు కనబడుతుంది . వేసవి సీజన్ లో ముఖంలో చెమటలు పట్టకుండా సహాయపడే కొన్ని ఫేషియల్స్ గురించి తెలుసుకుందాం..

చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి :

చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి :

రోజులో రెండు మూడు సార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంద్రాల నుండి ఎక్కువ చెమట పట్టకుండా ఉంచుతుంది. సమ్మర్ సీజన్ లో కోల్డ్ వాటర్ ఎక్కువగా ఉపయోగించి ముఖం శుభ్రపరుచుకోవడం వల్ల నేచురల్ గా హీట్ తగ్గించుకోవచ్చు. ఫేషియల్ స్వెట్టింగ్ కూడా తగ్గించుకోవచ్చు .

టాల్కమ్ పౌడర్

టాల్కమ్ పౌడర్

టాల్కమ్ పౌడర్ త్వరగా చెమటను గ్రహిస్తుంది. ఎక్సెస్ చెమటను దూరం చేస్తుంది. ఇంటి నుండి బయట వెళ్లడానికి ముందుకి కొద్దిగా టాల్కమ్ పౌడర్ ను ముఖం, మెడ, గొంతు భాగంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వేసవిలో అధిక చెమట, అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.

ఐస్ క్యూబ్స్ ను ఉపయోగించాలి.

ఐస్ క్యూబ్స్ ను ఉపయోగించాలి.

గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద మర్ధన చేయాలి. ఈ పద్దతిని తరచూ ఫాలో అవుతుంటే ఎఫెక్టివ్ గా ఫేషియల్ స్వెట్టింగ్ ను నివారించుకోవచ్చు .

కుకుంబర్ జ్యూస్

కుకుంబర్ జ్యూస్

రాత్రి నిద్రించడానికి ముందు కీరదోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేస్తే అధిక చెమట నుండి ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి సీజన్ లో రాత్రుల్లో ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ నుండి ఉపశమనం పొందవచ్చు.

ఆయిల్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి:

ఆయిల్ బేస్డ్ స్కిన్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి:

ఆయిల్ బేస్డ్ క్రీమ్స్, ప్యాక్స్, మేకప్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. ఈ స్కిన్ ప్రొడక్ట్స్ వల్ల చర్మ రంద్రాలు బ్లాక్ అవుతాయి. దాంతో ఆ ప్రదేశంలో మురికి చేరుతుంది. దాంతో చెమట ఎక్కువ అవుతుంది. అందువల్ల ఆయిల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

తక్కువ మేకప్ పదార్థాలను ఉపయోగించాలి.

తక్కువ మేకప్ పదార్థాలను ఉపయోగించాలి.

వేసవి సీజన్ లో ఎక్కువగా మేకప్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం, మేకప్ వేసుకుని ఎండలో తిరగడం , రాత్రుల్లో మేకప్ తొలగించుకుండా అలా నిద్రించడం వంటి పనులు చేయడం వల్ల చెమటలు మరింత ఎక్కువ అవుతాయి. చెమటలతో పాటు, స్కిన్ సమస్యలు కూడా అధికమవుతాయి. వేసవి సీజన్ లో మేకప్ వేసుకోకపోవడమే మంచిది.

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఆల్కలైన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది మిరాకిల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు శుభ్రపడుతాయి. ఎక్సెసివ్ ఫేషియల్ స్కిన్ సమస్యలను నివారించుకోవచ్చు .

English summary

Best Ways To Reduce Facial Sweating During Summer Season

Sweaty palms....No! Sweaty face....Hell NO! Reach out to these simple measures to reduce facial sweating during the summer season.
Story first published: Tuesday, May 2, 2017, 12:36 [IST]
Desktop Bottom Promotion