For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 వారాల్లో ఫర్ఫెక్ట్ స్కిన్ తో ఫెయిర్ గా కనబడాలంటే 10 సింపుల్ ఎఫెక్టివ్ టిప్స్ ..!!

రాత్రి రాత్రి అందంగా మారిపోవచ్చనే భ్రమలో మార్కెట్లో అందుబాటులో ఉండే అటువంటి చీప్ మార్కెటింగ్ జిమ్మిక్స్ కు పడిపోకుండా ఎఫెక్టివ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేయని హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవాలి.

|

ప్రతి అమ్మాయి అందంగా..ఆకర్షణీయంగా కనబడాలని కోరుకుంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు వారే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకోవడం సహజం. అందుకోసం మార్కెట్లో ఉండే ఫెయిర్ నెస్ క్రీములను వాడితే చర్మానికి మంచి కంటే హానే ఎక్కువ జరుగుతుంది. రాత్రి రాత్రి అందంగా మారిపోవచ్చనే భ్రమలో మార్కెట్లో అందుబాటులో ఉండే అటువంటి చీప్ మార్కెటింగ్ జిమ్మిక్స్ కు పడిపోకుండా ఎఫెక్టివ్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేయని హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవాలి.

అటువంటి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ప్రక్రుతి ప్రసాధించిన వరాల్లో చాలనే ఉన్నాయి. ఇవి సెన్సిటివ్ చర్మ తత్వం నుండి అన్ని రకాల చర్మాలకు ఉపయోగపడుతాయి. ఈ హోం రెమెడీస్ డల్ స్కిన్ నుండి డ్యామేజ్ స్కిన్ వరకూ అన్ని రకాల చర్మ సమస్యలను నివారించి చర్మం రంగును అట్రాక్టివ్ గా మార్చుతుంది. మీకు ఆ నమ్మకం కలగాలంటే ఈ క్రింది హోం రెమెడీస్ ను ఈ రోజే ప్రయత్నించి చూడండి...

 కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఒక టేబుల్ స్పూన్ కీరదోసకాయ రసంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. కీరదోసకాయ జ్యూస్ ఆస్ట్రిజెంట్ గా , నిమ్మరసం ఫర్ఫెక్ట్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి, చర్మంలో ట్యానింగ్ ను తొలగిస్తుంది.

ముల్లంగి:

ముల్లంగి:

కొద్దిగా ముల్లంగి ముక్కలను పేస్ట్ చేసి, అందులో నుండి రసం తీసి, ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ముల్లంగి చర్మంను బ్రైట్ గా మరియు టైట్ గా మార్చుతుంది. ముల్లంగి లో ఉండే ఫైబర్ కంటెంట్ చర్మంలోని అన్ని రకాల టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

రాత్రి నిద్రించడానికి ముందు ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ రసంలో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇవి చర్మంను ప్రకాశవంతంగా మార్చుతాయి. మరియు చర్మాన్ని హెల్తీగా మార్చుతాయి. ఉసిరికాయ ఒక మ్యాజిక్ ఫ్రూట్ . ఇది చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. స్కిన్ టైట్ గా మార్చుతుంది.

పెరుగు:

పెరుగు:

ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు పెరుగును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత డ్రైగా మారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. పెరుగులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మంలో మురికిని తొలగిస్తుంది. చర్మ రంద్రాలను తెరచుకునేలా చేసి చర్మం ఫెయిర్ గా కనబడేలా చేస్తుంది.

పెరుగు ఉండే ల్యాక్టిక్ యాసిడ్ నేచురల్ ఆల్ఫా హైడ్రాక్సీ గా పనిచేస్తుంది. దాంతో స్కిన్ కాంప్లెక్షన్ మెరుగుపడుతుంది.

తేనె:

తేనె:

అరటీస్పూన్ తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. తర్వాత డ్రైగా మారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ స్కిన్ బ్రైట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది. ఎప్పుడూ యంగ్ గా కనబడాలంటే? డైలీ రొటీన్ లో దీన్ని తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది మొటిమలను నివారిస్తుంది. ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది.

పాలు :

పాలు :

ఒక టేబుల్ స్పూన్ పాలు మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖాని అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ స్కిన్ లోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. మురినికిని తొలగించి చర్మం ఫెయిర్ గా ఉండేందుకు సహాయపడుతుంది. చర్మంలో ఫైన్ లైన్స్ తొలగిస్తుంది. ముడుతలను పోగొడుతుంది. స్కిన్ ఎలాసిటి పెంచుతుంది,.

 ఆరెంజెస్ :

ఆరెంజెస్ :

ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పౌడర్ చేసి , అందులో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి లు స్కిన్ బ్లీచ్ చేసి, బ్రైట్ గా మార్చుతుంది. ఆరెంజె స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి:

రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి పేస్ట్ లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. బొప్ాపయిలో విటమిన్ ఎ, సిలు చర్మంను బ్రైట్ గా మార్చడంలో కొత్తగా చర్మకణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి, బొప్పాయిని ఫ్రూట్ సలాడ్స్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

టమోటో:

టమోటో:

ఒక టేబుల్ స్పూన్ టమోటో పేస్ట్ లో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. టమోటోల్లో ఉండే లైకోపిన్ కంటెంట్ స్కిన్ టానింగ్ తొలగిస్తుంది , చర్మం రంగును బ్రైట్ గా మార్చుతుంది. లైకోపిన్ సన్ బర్న్ నుండి రక్షణ కల్పిస్తుంది, స్కిన్ యంగ్ గా కనబడేలా చేస్తుంది.

పసుపు:

పసుపు:

ఒక టేబుల్ స్పూన్ పసుపులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ టానింగ్ తొలగిస్తుంది, స్కిన్ బ్రైట్ గా మార్చుతుంది. సెబాస్టియస్ గ్రంధుల ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

English summary

Look Fairer in Just 2 Weeks! Adopt These 10 Simple yet Effective Home Remedies for the Perfect Skin

We all want fair and flawless skin. But we do not want those chemical loaded fairness creams available in the market that do much harm to the skin than good. We do not want you to fall prey to those cheap marketing gimmicks that claim they can make you fairer overnight. Yes, we definitely want instant results but not false promises.
Story first published: Wednesday, February 8, 2017, 17:38 [IST]
Desktop Bottom Promotion