For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లెమన్ టీతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!

లెమన్ టీలో ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిన విషయమే. లెమన్ టీలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, బ్యూటి బెనిఫిట్స్ కూడా దాగున్నాయి.

|

లెమన్ టీలో ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిన విషయమే. లెమన్ టీలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, బ్యూటి బెనిఫిట్స్ కూడా దాగున్నాయి. అందంగా కనబడాలంటే కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, ఆరోగ్యంతో ాపటు, చర్మం, కేశ సౌందర్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

చాలా మంది ముఖ్యంగా అమ్మాయిలు చర్మసంరక్షణ కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందుకు కారణం ఇది చర్మ సౌందర్యాన్ని, పర్సనాలిటిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. స్కిన్ బ్యూటీ పెంచుకోవడం కోసం అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇవి రసాయనాలతో తయారుచేయడం వల్ల ఆలస్యంగా చర్మం మీద ప్రభావం చూపుతాయి. స్కిన్ డ్యామేజ్ చేస్తాయి.

Reasons to Wash Face with Lemon Tea

కాబట్టి అలా చర్మం డ్యామేజ్ కాకుండా స్కిన్ బ్యూటిని రెట్టింపు చేసుకోవడానికి ఒక నేచురల్ రెమెడీని మీకు పరిచయం చేస్తున్నాము. అదే లెమన్ టీ ఆరోగ్య పరంగా ఇంటర్నల్ గా తీసుకోవడం కాదు, అందం కోసం ఎక్స్ టర్నల్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. లెమన్ టీతో ఫేస్ వాష్? అవును లెమన్ టీతో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల అద్భుతమైన బ్యూటి బెనిఫిట్స్ పొందుతారు. అవేంటో తెలుసుకుందాం..

మొటిమలను నివారిస్తుంది :

మొటిమలను నివారిస్తుంది :

ప్రతి మహిళ మొటిమలు మచ్చలతో బాధపడుతుంటారు. వీటిని నివారించుకోవడం కోసం పర్మనెంట్ సొల్యూషన్ లెమన్ పేష్ వాష్. లెమన్ టీలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కిన్ యాక్నే నివారిస్తుంది. చర్మంలో మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దాంతో మొటిమలు, మచ్చలను నివారించుకోవచ్చు. ఇందులో ఇండు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను పూర్తిగా మాయం చేస్తుంది.

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది

ఆయిల్ స్కిన్ నివారిస్తుంది

లెమన్ టీని ఫేస్ వాష్ గా ఉపయోగించడం వల్ల ,ఇందులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆయిల్ స్కిన్ నివారిస్తుంది. చర్మంలో ఆయిల్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. కొద్దిగా లెమన్ టీ అప్లై చేయడానికి కాటన్ బాల్ తీసుకుని, లెమన్ టీలో డిప్ చేయాలి. కాటన్ ను ముఖం మొత్తం అప్లై చేసి మర్ధన చేయాలి. కొద్దిసేపు నేచురల్ గా డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది

బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది

లెమన్ టీని చర్మానికి ఉపయోగించడం వల్ల బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, బ్లాక్ హెడ్స్ ను తొలగిస్తుంది. గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. లెమన్ టీలో ఉండే లక్షణాల వల్ల బ్లాక్ హెడ్స్ ను ఎఫెక్టివ్ గా మరియు సలభంగా తొలగిస్తుంది.

మొటిమల కారణంగా ఏర్పడ్డ చర్మ రంద్రాల సైజ్ తగ్గిస్తుంది:

మొటిమల కారణంగా ఏర్పడ్డ చర్మ రంద్రాల సైజ్ తగ్గిస్తుంది:

లెమన్ టీ, లెమన్ జ్యూస్ లాగే పనిచేస్తుంది. ఇది చర్మంలో ఏర్పడ్డ మొటిల తాలూకు రంద్రాలను ఎఫెక్టివ్ గా ముడుచుకుపోయేలా చేస్తుంది. అందుకు కొద్దిగా లెమన్ టీ తీసుకుని, అందులో కొద్దిగా కాటన్ డిప్ చేసి ముఖం మీద మర్ధన చేయాలి. ముఖ్యంగా చర్మ రంద్రాల మీద అప్లై చేయాలి. లెమన్ టీని ముఖానికి అప్లై చేసి, నేచురల్ గా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ముఖంలో మొండిగా మారిన నల్ల మచ్చలను తొలగిస్తుంది

ముఖంలో మొండిగా మారిన నల్ల మచ్చలను తొలగిస్తుంది

: ముఖంలో డార్క్ లేదా బ్లాక్ స్పాట్స్ ఉండటం చాలా సాధారణ సమస్య. వీటిని తొలగించుకోవడం కష్టం అని భావిస్తుంటారు. అయితే లెమన్ టీతో వీటిని ఎఫెక్టివ్ గా తొలగించుకోవచ్చు. లెమన్ టీని డార్క్ స్పాట్స్ మీద అప్లై చేస్తే చాలు ముఖంలో మొండిగా మారిన నల్ల మచ్చలను తొలగిస్తుంది.

చర్మంను శభ్రం చేస్తుంది :

చర్మంను శభ్రం చేస్తుంది :

మార్కెట్లోని ఆర్టిఫిషియల్ క్రీమ్ ల కంటే లెమన్ టీతో అందమైన రేడియంట్ స్కిన్ పొందవచ్చు. ఇది డార్క్ స్పాట్స్ ను, చర్మంలో ముడుతలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చర్మంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద చర్మ రంద్రాలను ముడుచుకునేలా చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది. కాబట్టి, లెమన్ టీతో ఫేస్ వాష్ చేసుకోవడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్ తెలుసుకున్నారుగా మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ స్కిన్ బ్యూటీని ఎన్హాన్స్ చేసేసుకోండి.

English summary

Reasons to Wash Face with Lemon Tea

Reasons to Wash Face with Lemon Tea which is very useful for every girl for fair skin. Taking care of your health is your primary responsibility and it is only you who can take care of your health including skin and hair as well. People take lots of effort to take care of their skin because it reflects your personality.
Story first published: Tuesday, April 25, 2017, 12:29 [IST]
Desktop Bottom Promotion