For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో ఎటువంటి దుస్తులు సురక్షితంగా ఉంటాయి?

|

వర్షాకాలం..వాతావరణం మొత్తం డల్ గా అయిపోయి, మబ్బుగా ఉంటుంది. ఇలాంటి సీజన్ లో మనం వేసుకొనే దుస్తులు మనలో ఉత్సాహాన్ని పెంపొదించేవి..వానల తడిసినా మనకు ఇబ్బంది కలిగించకుండా ఉండేవి అయితే బాగుంటుంది. అప్పుడే వానల సీజన్ ని ఆనందంగా ఎంజాయ్ చేసేయొచ్చు. మరలా చేయాలంటే వర్షాకాలానికి తగ్గట్టుగా మన వార్డ్ రోబ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ మార్పులేంటో ఒక సారి చూద్దాం...

How to Dress Up in Rainy Season

1. వర్షాకాలంలో నేచురల్ ఫ్యాబ్రిక్స్, డెనిమ్ లేదా క్రేవ్ సిల్క్ మెటీరియలత్ తో తయారైన దుస్తులు, గాబర్ డైన్ దుస్తులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ కాలంలో మంచి కలర్ ఫుల్ డ్రెస్సులను ఎంపిక చేసుకోవాలి. వాతావరణం ఎలాగూ డల్ గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ ట్రై చేయడానికి ఇదే మంచి సమయమన్నమాట. ఇలా చేయడం వల్ల మనసు కూడా ఉల్లాసంగా గంతులేస్తుంది.
2. ప్రయాణం చేసేటప్పుడు ఒక వేళ తడిసినా త్వరగా ఆరిపోయే దుస్తులు వేసుకుంటే మంచిది. అయితే బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనం వేసుకునే డ్రెస్ చల్లటి గాలులను తట్టుకునేలా ఉండాలి.
3. ఒక వేళ మీకు డార్క్ కలర్స్ నచ్చకపోతే లైట్ కలర్ దుస్తులు వేసుకుని వాటిపై డార్క్ కలర్ స్కార్ఫ్ కట్టుకుంటే అదిరిపోతుంది.
4. వర్షాకాలంలో ఎక్కువ మంది ఎలాంటి బాదరబందీ లేకుండా ఉండే ట్రెంచ్ కోట్ ని ఇష్టపడుతారు. మీరూ అదే దారిలో వెళ్లాలనుకుంటే దాన్ని జీన్స్ తో మ్యాచ్ చేయాలి.
5. కేవలం జీన్స్ మాత్రమే కాదు..ట్రెంచ్ కోట్ మీదకు ఫార్మల్ ట్రౌజర్స్ కూడా సూటవుతాయి.. కాకపోతే అవి డార్క్ కలర్ లో ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
6. వర్షాకాలం సల్వార్స్, పటియాలా లాంటివి ధరించకపోతేనే మంచిది..వాటికి బదులుగా కుర్తీలు వేసుకోవచ్చు. వీటికి డెనిమ్ ప్యాంట్స్, లెగ్గింగ్స్ జతచేసుకోవచ్చు.
7. అలాగే ఈ కాలంలో ఫుల్ జీన్స్ వేసుకోకపోవడం మంచిది. 3/4 వేసుకుంటే అందంగానే కాదు..సౌకర్యంగా కూడా ఉంటుంది.
8. పొడవుగా కాళ్ల చివర్ల వరకూ ఉండే గౌన్లను ఈ కాలంలో వేసుకోకపోవడమే మంచిది..వాటికి బదులుగా షార్ట్ స్కర్ట్స్ వాడవచ్చు. షిఫాన్ ఖాదీ చీరలను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
9. ఒంటికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులను ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. ఈ కాలంలో దుస్తులు లూజ్ గా ఉండటమే బాగుంటుంది.
ఇలా సరైన దుస్తులు ఎంపిక చేసుకుంటే, ఈ వర్షాకాలం సౌకర్యంగా, అందంగా గడిచిపోతుంది. మరి మీరేమంటారు?

English summary

How to Dress Up in Rainy Season

Rainy season is coming and we must be careful about our outfit whether going to a office or party. It’s necessary to protect our body and dress and boots from water. Here we have some collections for all men, women, kids, boys and girls with the best dresses in rainy season.
Story first published: Friday, August 1, 2014, 17:49 [IST]
Desktop Bottom Promotion