For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బొద్దులోనూ బోలెడంత అందాన్ని చూపించే ట్రెండీ ఐడియాస్

By Nutheti
|

లావుగా ఉన్న అమ్మాయిలు డ్రెస్ ఎంపిక చేసుకునేటప్పుడు, ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. మిమ్మల్ని మరింత లావుగా మార్చేసే ఎట్రాక్టివ్ ట్రెండ్స్ కి దూరంగా ఉండాలి. అంటే.. ట్రెండ్ ఫాలో అవుతూనే.. మిమ్మల్ని స్లిమ్ గా అందంగా చూపించే ట్రిక్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా ఫాలో అవండి.. అందరినీ ఆకట్టుకోండి. లావుగా ఉన్నామని ఎప్పుడో ఒకే స్టైల్ ఫాలో అవకండి. మీకు కూడా.. విభిన్నంగా డ్రెస్సింగ్ చేసుకునే అవకాశముంది. బొద్దులోనూ బోలెడంత అందముందని ఈ బోల్డ్ ఐడియాస్ మీకు వివరిస్తాయి.

బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ? బొద్దుగా ఉన్నా.. చీరకట్టులో ముద్దుగా కనిపించాలంటే ?

లావుగా ఉన్న అమ్మాయిలకు తరచుగా.. చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పక్కనవాళ్లు ఇచ్చే ఉచిత సలహాలు విని విగుసు వచ్చేసింటుంది. కానీ.. లావుగా ఉన్న అమ్మాయిలకూ న్యూ ట్రెండ్స్ ఫాలో అవ్వాలని ఉంటుంది. కాబట్టి ట్రెండ్ కి తగ్గట్టు మీరు కూడా.. అందంగా మెరిసిపోయే ఐడియాలున్నాయి. సైజు, షేప్ గురించి మర్చిపోయి.. ఆకర్షణీయంగా కనిపించడానికి ఇప్పుడు ట్రెండీ దుస్తుల ఎంపికలో కొన్ని టిప్స్ మైండ్ లో పెట్టుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిమ్మల్ని ఎట్రాక్టివ్ గా మార్చేస్తాయి. అవేంటో మీరే చూడండి..

నిలువు గీతలు

నిలువు గీతలు

ప్లస్ సైజ్ ఉన్న అమ్మాయిలు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఇది. నిలువుగా గీతలు ఉన్న డ్రెస్ లు, స్కర్ట్స్ ఎంపిక చేసుకోవడం వల్ల.. స్లిమ్ గా కనిపిస్తారు.

వదులుగా ఉండే దుస్తులు

వదులుగా ఉండే దుస్తులు

టైట్ గా ఉండే డ్రెస్ లు వేసుకోవడం వల్ల.. ప్లస్ సైజ్ మహిళలు.. షేప్ లెస్ గా.. అందవిహీనంగా కనిపిస్తారు. కాబట్టి కాస్త వదులుగా ఉన్నవి వేసుకోవడం వల్ల మీ లావు కనిపించదు. అలాగే లావుగా ఉన్న భాగాలు ఎబ్బెట్టుగా లేకుండా ఉంటుంది.

బ్లాక్ కలర్

బ్లాక్ కలర్

లావుగా ఉన్న అమ్మాయిలు ఎక్కువగా బ్లాక్ ఎంచుకోవడం మంచిది. ఇది మిమ్మల్ని స్లిమ్ గా కనిపించడానికి చాలా పవర్ ఫుల్ గా సెట్ అవుతుంది. అంటే ప్రతిసారీ బ్లాక్ కే ఎంచుకోవడం కష్టం కాబట్టి.. బ్రైట్ కలర్స్ వాడితే మిమ్మల్ని మీరు చూసుకుని ఆశ్చర్యపోతారు.

పెద్ద పెద్ద ప్రింట్స్

పెద్ద పెద్ద ప్రింట్స్

ఈ రూల్ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే.. లావుగా ఉన్న వాళ్లు పెద్ద పెద్ద ప్రింట్స్ ఉన్న డ్రెస్ లు వేసుకుంటే.. మరింత లావుగా కనిపిస్తారు. కాబట్టి సన్నగా, సింపుల్ గా ఉండే ప్రింట్స్ ఎంచుకోవాలి. అప్పుడు రాక్ స్టార్ లా మెరిసిపోవచ్చు.

మిని స్కర్ట్స్, షార్ట్స్ కి నో

మిని స్కర్ట్స్, షార్ట్స్ కి నో

మిని స్కర్ట్స్, షార్ట్స్ లో తొడలు కనిపిస్తాయి. అయితే.. లావుగా ఉన్న అమ్మాయిలకు ఇది మరింత అందవిహీనంగా, లావుగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఇలాంటి ట్రెండీ దుస్తులకు దూరంగా ఉండాలి.

డార్క్ బాటమ్స్

డార్క్ బాటమ్స్

లైట్ కలర్ టాప్, డార్క్ కలర్ బాటమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు స్లిమ్ గా కనిపిస్తారని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ.. ఇది అస్సలు సెట్ అవదు. దీనివల్ల మరింత లావుగా కనిపిస్తారు.

క్రాప్ టాప్స్

క్రాప్ టాప్స్

లావుగా ఉన్న అమ్మాయిలు క్రాప్ టాప్స్ ని ఎంచుకోకూడదు. అందరికీ ఇష్టమైన ఈ ట్రెండ్ బొద్దుగా ఉన్నవాళ్లను మరింత బొద్దుగా కనిపించడానికి కారణమవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

స్విమ్ సూట్

స్విమ్ సూట్

కొంతమంది మోడల్స్ లావుగా ఉన్నా.. స్విమ్ సూట్స్ తో రెచ్చిపోతుంటారు. కానీ.. లావుగా ఉన్న మోడల్స్ కి స్విమ్ సూట్ అందవిహీనంగా మారుస్తుంది. కాబట్టి.. దీనికి దూరంగా ఉండాలి.

చూశారుగా ట్రెండ్ ఫాలో అవుతూనే.. లావుగా ఉన్న అమ్మాయిలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో.. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అన్నింటినీ మీ మైండ్ లో నోట్ చేసుకోండి.

English summary

8 Fashion Rules Every Plus-Sized Girl Must Break

Every plus-size girl is bound with a set of rules that the fashion-society has imposed on her. You know what we are talking about, ‘do not wear that’, ‘do not try this’, ‘stay away from those prints’, and some other lines just like these. So often, these rules make them resort to the ‘baggy jeans and T-shirt’ syndrome, and fashion takes a backseat.
Story first published: Thursday, December 17, 2015, 14:42 [IST]
Desktop Bottom Promotion