For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరాకృతిని బట్టి సరైన చోలీ(బ్లౌజ్)ను ఎంపిక చేసుకోవడానికి: చిట్కాలు

|

ఒక చోలీ లేదా లెహంగా వంటి భారతీయ దుస్తులు ప్రత్యేక సందర్భాలలో స్త్రీలు ధరిస్తుంటారు. మహిళల శరీరాకృతికి అనుగుణంగా చోళీలు అన్ని రంగులలో వస్తాయి. కేవలం ఏ శరీరాకృతికి ఏ రకమైన చోలీ సరిపోలుతుందో తెలుసుకోవటం ముఖ్యం.

అలంకరణ ఉపకరణాలు మరియు మేకప్ తో పాటు చోలీ కూడా మహిళకు సొగసు మరియు అందాన్ని తెస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జాకెట్టు మీద చేసిన పనితనం లేదా లెహంగా మీద చేసిన పనితనం ఆయా సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఇటువంటి దుస్తులు వివాహసందర్భాలలో ధరిస్తారు మరియు అందుకే, వీటికి పనితనం చాలా అందంగా చేస్తారు.

మీకు ఒక అందమైన చోలీ ఉంటే, మీరు చేయవలసిన మంచి పని ఏమిటంటే ఒక డిజైనర్ లెహంగాను తీసుకోండి. లెహంగా, నడుము చుట్టూ ధరించే గౌను శైలిలో ఉండాలి. చోలీ, ఒక భారీ డిజైన్ గల జాకెట్టులాగా ఉండాలి. రెండూ కూడా అందమైన ఎంబ్రాయిడరీ, సిక్విన్స్ , పెర్ల్ లేదా జరి పని ఏదైనా సరే, మీరు కోరుకున్న పనితనంతో అలంకరించండి.

చోలీ బిగుతుగా లేకుండా సరిగా మీ ఆకృతికి అమరేట్లుగా చూసుకోవటం ఎల్లప్పుడూ ఉత్తమం. సరిఅయిన జాకెట్టు ఎంచుకోవటం ఎలా తెలుసుకోవాలి అన్నది కూడా ముఖ్యం. క్రింద ఇచ్చిన కొన్ని చిట్కాలను ఉపయోగించి చూడండి.

Choosing The Right Choli For Body Type: Tips

గంటసీసా
మీరు ఒక గంటసీసా శరీరాకృతి కలిగి ఉంటే, మీకు ఒక నిర్దిష్టమైన నడుము, వంపుతో కూడిన హిప్స్ మరియు మంచి ఆకారంతో ఉన్న కాళ్లతో మరింత అందంగా కనిపిస్తారు. ఈ శరీరాకృతికి తగ్గట్లుగా సరిఅయిన జాకెట్టు ఎంచుకోవలసి వచ్చినప్పుడు, ఫిష్ టైల్ లేదా ఒక మెర్మైడ్ శైలి లెహంగా ఎంచుకోవటం మంచిది. ఒక సంపూర్ణమైన, అందమైన రూపంలో కనపడాలంటే హాల్టర్ మెడ లేదా ఒక కంచుకం ఆకారం గల మెడను ఎంచుకోవటం మంచిది.
Choosing The Right Choli For Body Type: Tips

పీయర్ ఆకారం
ఎవరికైనా శరీర ఎగువభాగం చిన్నఆకారం మరియు దిగువభాగం భారీగా ఉన్నప్పుడు ఈ ఆకారాన్ని పీయర్ పండు ఆకారంలో ఉన్నదని చెపుతారు. ఈ శరీరాకృతి ఉన్నవారు పఫ్ఫీ స్లీవ్ జాకెట్టు ఎంచుకోవడం ఆవసరం. మీరు అందమైన పనితో చేసిన చోలీ వేసుకున్నా సరే, మీ శరీరఎగువ భాగం వ్యక్తపరచటానికి ఈ జాకెట్టు సహాయపడుతుంది. లెహంగా నడుము నుండి A లైన్ ఆకారంలో ఉండాలి.
Choosing The Right Choli For Body Type: Tips

పెటైట్
మీ శరీర నిర్మాణం చిన్నగా ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది మరియు అదే సమయంలో సులభంగా కూడా ఉంటుంది. ఇటువంటి శరీరాకృతి గలవారు ఆఫ్ షోల్డర్ షార్ట్ చోలీని ఎంచుకోవటం చాలా ఉత్తమం. స్లీవ్ లెస్ లేదా షార్ట్ స్లీవ్లు ధరించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. విశాలంగా లేని లెహంగాను ఎంచుకోండి.
Choosing The Right Choli For Body Type: Tips

రూలర్ / నిటారు ఆకారంలో
ఒక మహిళ శరీరఎగువ మరియు దిగువభాగాలు సమానమైన ఆకారాన్నికలిగి ఉన్నప్పుడు నిటారుగా ఉన్నారని అంటాము. నడుము ఎక్కడ,యెంత ఉన్నదో చెప్పలేని స్థితి మరియు సన్నని కాళ్లు కలిగి ఉన్న సగటు శరీరాకృతి. ఈ రకమైన శరీరాకృతి ఉన్నవారికి చోలీకి జాకెట్టు మెడ లైన్ జత్రుక క్రిందకు వొచ్చేట్లుగా ఎంచుకోవటం ఉత్తమం. లెహంగా, చుట్టబెట్టిన లంగా లేదా ఒక ప్యానెల్ శైలీ స్కర్ట్ ఆకృతిలో ఉండాలి.

ఇన్వర్టెడ్ ట్రయాంగిల్
విస్తృతమైన ఎగువ శరీరభాగం మరియు సన్నని దిగువశరీరభాగం కలిగిన మహిళను ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఆకారంలో ఉన్నదని చెపుతారు. ఈ రకమైన శరీరాకృతి ఉన్నవారు ఎగువ,దిగువ శరీరభాగాలను సరిగా చూసుకోవటం అవసరం. చోలీ ఎక్కువగా పనితనంతో అలంకరించబడి ఉండకూడదు. ఈ రకమైన శరీరాకృతి గలవారు జాకెట్టు మెడ లోతుగా ఉండేట్లుగా చూసుకోవాలి. లెహంగా తప్పనిసరిగా ప్లీట్స్ తో దట్టంగా, అందంగా పని చేయించుకోవాలి.

మీరు చోలీ ఎంచుకోవడంలో మరిన్ని సలహాలు ఇస్తారా? మాతో పంచుకోండి .

English summary

Choosing The Right Choli For Body Type: Tips

A choli or a lehenga is an Indian dress that is worn by women on very special occasions. The cholis come in all colours and suit women of any body type. It is just important to know the right kind of choli for the body type.
Desktop Bottom Promotion