For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ ఉమెన్స్ ఫాలో అయ్యే టాప్ 10 అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్

By Nutheti
|

ఇండియన్ ఉమెన్స్ చాలా అందగత్తెలు.. అంటే ఎవరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే.. ప్రపంచంలో ప్రతి భారతీయ స్ర్తీ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. ఇండియన్ ఉమెన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది సంప్రదాయం. ఎందుకంటే.. పొడవాటి జుట్టు, మెరిసేటి చర్మం, సంప్రదాయబద్దమైన కట్టుబొట్టు. ఇది తరతరాలుగా భారతీయ మహిళ అందాన్ని వివరిస్తున్న తీరు.

READ MORE: మహిళలు తమ పెళ్ళి విషయంలో ఎందుకు భయపడుతారు

ఇండియన్ ఉమెన్స్ అంత అందంగా, ఆకర్షణీయంగా ఉండటానికి వాళ్లు ఫాలో అవుతున్న బ్యూటీ సీక్రెట్సే కారణం. కొన్ని తరాలుగా ఇండియన్ బ్యూటీ బ్యూటిఫుల్ అన్న కాంప్లిమెంట్ వస్తూనే ఉంది. అలాంటి బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. అవేంటో చూసి ఫాలో అయిపోండి.

ఉసిరి ఆయిల్

ఉసిరి ఆయిల్

ఉసిరి ఆయిల్ నుంచి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ ఆయిల్ ని పూర్వం నుంచి భారతీయ మహిళలు జుట్టుకు వాడుతున్నారు. ఇది జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా, ఒత్తుగా, అందంగా కనిపించడానికి, పెరగడానికి సహాయపడుతుంది. అలాగే స్కాల్ఫ్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ ని రోజూ వాడటం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

శనగ పిండి

శనగ పిండి

ప్రతి ఇండియన్ కిచెన్స్ ఉండే పదార్థం శనగపిండి. ఇది న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్ గా చాలా పాపులారిటీ సంపాదించింది. శనగపిండిని పాలు, మీగడతో కలిపి ముఖానికి ప్యాక్ లా వాడటం ఇండియన్ ఉమెన్ బ్యూటీ సీక్రెట్. పాలు, మీడగ చర్మాన్ని స్మూత్ గా మార్చడానికి సహాయపడుతుంది. అంతేకాదు తేనె, పాలు, లేదా నిమ్మరసం కలిపి కూడా ముఖానికి రాసుకోవడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. దీన్ని జుట్టులో ఉండే ఆయిల్ ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు.

పసుపు

పసుపు

పసుపు కొన్ని శతాబ్ధాలుగా చర్మ సంరక్షణకు వాడుతున్నారు. భారతీయ సంప్రదాయంలో కూడా పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్, మచ్చలు, ముడతలు, దురద పోగొట్టడానికి సహాయపడతాయి. స్కిన్ ట్యాన్ తొలగింన్ స్కిన్ టోన్ మెరుగవడానికి పసుపుని ఇండియన్ గర్ల్స్ వాడతారు. పిగ్మెంటేషన్, ఫేషియల్ హెయిర్ తొలగించడానికి పసుపు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు

కాశ్మీర్ లోయల్లో ఎక్కువగా లభిస్తుంది కుంకుమ పువ్వు. పొడి చర్మానికి, అనేక రకాల చర్మ సమస్యలతో పోరాడటానికి కుంకుమ పువ్వు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే చర్మ కాంతి పెరగడానికి, స్కిన్ టోన్ కి కొత్త మెరుపు తీసుకురావడానికి కుంకుమ పువ్వు సహాయపడుతుంది.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

డార్క్ సర్కిల్స్, టోనర్ గా, చర్మ కాంతికి రోజ్ వాటర్ ఉపయోగిస్తారు. అలాగే అనేక రకాల ఫేస్ ప్యాక్ లలో ఇండియన్ ఉమెన్ రోజ్ వాటర్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఇది ఆయిల్ తోపాటు, చర్మంపై దుమ్ము, ధూళి తొలగించడానికి ఉపయోగపడుతుంది.

గంధం

గంధం

పూర్వీకుల కాలం నుంచి బ్యూటీ సీక్రెట్స్ గంధానికి చాలా ప్రాధాన్యత ఉంది. చందనాన్ని మహిళలు, పురుషులు ఇద్దరు వాడుతారు. ఇది ర్యాషెస్, మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ తొలగించడానికి సహాయపడుతుంది.

షీకాయ్

షీకాయ్

ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే షీకాకాయ ఇండియన్ ఉమెన్ బ్యూటీ సీక్రెట్స్ లో ఒకటి. ఇది చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి, కుదుళ్లను దృఢపరచడానికి ఉపయోగపడుతుంది.

పెరుగు

పెరుగు

ఇండియాలో పెరుగును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ లలో పెరుగును ఇండియన్ ఉమెన్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల చర్మం చాలా స్మూత్ గా, షైనీగా మారుతుంది.

అలాగే జుట్టు సంరక్షణలో భాగంగా పెరుగు, నిమ్మరసం పట్టించుకున్న మంచి ఫలితం ఉంటుంది.

లిప్ కేర్

లిప్ కేర్

ఇండియన్ ఉమెన్స్ కి పర్ఫెక్ట్ గా లిప్స్ ఉంటాయి. చాలా ఆకర్షణీయంగా ఉండే పెదాలు అందరినీ ఆకర్షిస్తాయి. అంతేకాదు ఇండియన్ ఉమెన్స్ లిప్ స్టిక్ అప్లై చేయడానికి ఆసక్తి చూపుతారు. ఎక్కువగా మెరూన్, రెడ్ కలర్ షేడ్స్ వాడటం వల్ల గార్జియస్ లుక్ సొంతం చేసుకుంటారు.

బొట్టు

బొట్టు

బొట్టు లేకుండా.. ఇండియన్ మేకప్ పూర్తికాదు. బ్రైట్ రెడ్ కలర్ బొట్టు పెట్టుకోవడం వల్ల ముఖం చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది. చూశారుగా ఇండియన్ ఉమెన్ బ్యూటీ సీక్రెట్స్. ఇక అన్నింటినీ పర్ఫెక్ట్ గా ఫాలో అయి.. చూడచక్కని అందం మీ సొంతం చేసుకోండి.

English summary

Top 10 Beauty Secrets Of Indian Women

There is no one who can deny it!! Indian women are the most beautiful women. No matter where you are in the world, women always desire to look beautiful and healthy. Think of Indian beauty? What comes to the mind is the picture of a humble, traditional woman with alluringly long hair and a gleaming delicate skin.
Story first published: Wednesday, December 16, 2015, 14:05 [IST]
Desktop Bottom Promotion