For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2016 మగువలు మెచ్చిన..బాగా పాపులర్ అయిన ఫ్యాషన్లు ఇవే..!!

2016 సంవత్సరం ముగిసిపోయింది.‘‘హ్యాపీ న్యూ ఇయర్ ’’ అంటూ సంతోషంగా పార్టీ చేసుకున్నారు కదా.. మరి 2016 ట్రెండ్ ఎలా నడించింది. ఈ ఏడాది మగువలను ఆకర్షించిన కొన్ని ఫ్యాషన్లు గురించి తెలుసుకోవడానికి మంచి సమయం.

|

2016 సంవత్సరం ముగిసిపోయింది.''హ్యాపీ న్యూ ఇయర్ '' అంటూ సంతోషంగా పార్టీ చేసుకున్నారు కదా.. మరి 2016 ట్రెండ్ ఎలా నడించింది. ఈ ఏడాది మగువలను ఆకర్షించిన కొన్ని ఫ్యాషన్లు గురించి తెలుసుకోవడం ఇది ఒక మంచి సందర్భం అనే అనుకుంటాము..

ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా దుస్తుల్లో కొత్త కొత్త మోడల్స్ వస్తుండడం...వాటిని ఆహ్వానించడంలో మహిళలు ఆసక్తి చూపడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏడాదంతా ఎన్నో ఫ్యాషన్లు వచ్చాయి..వెళ్లిపోయాయి. కానీ అందులో కొన్నే మగువల మనస్సుల్ని దోచేశాయి.

అంతే కాదు వచ్చే సంవత్సరంలోనూ కొనసాగుతామంటున్నాయి. మరి అలాంటి కొన్ని ఫ్యాషనబుల్...ట్రెండీ దుస్తులేంటో ఒక సారి తెలుసుకుందాం...

దుస్తుల్నీ చీలికలు చేశారు?

దుస్తుల్నీ చీలికలు చేశారు?

అదేంటి కొత్త ఫ్యాషన్లు గురించి చెబుతుంటే మధ్యలో ఈ చీలికలు చెండాడమేంటి..ఎక్కడి నుంచి వచ్చిందనుకోండి..ఈ ఏడాది వచ్చిన ఫ్యాషన్లలో ఎక్కువ మందికి నచ్ఛినవి చీల్చిన డ్రస్సులే.. అదేనండీ స్లిట్ డ్రస్సులు. డ్రస్సు మొత్తంలో ఒకే చోట స్లిట్ ఉండే ఈ తరహా దుస్తుల్ని ఎక్కువమంది వేసుకోవడానికి ఆసక్తి చూపించారు. వీటిలోనూ కొంత మంది సైడ్ స్లిట్స్ కి ప్రాధాన్యమిస్తే చాలా మంది మాత్రం ముందు భాగంలో ఉండే ఫ్రింట్ స్లిట్ డ్రస్సులవైపే మొగ్గు చూపారు. ఈ తరహా దుస్తులను వేసుకుని పార్టీల్లోనూ, ఇతర ఫంక్షన్లలోనూ ..తామే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.

లెహంగా పై జాకెట్ :

లెహంగా పై జాకెట్ :

లెహంగా అనగానే మనకు బ్లౌజ్, దాని పై ఓణీ ఉన్న లెహెంగానే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు స్టైల్ మారింది. లెహెంగా కూడా ఈ ఏడాది కొత్త రూపు సంతరించుకుంది. జాకెట్ లెహంగాల రూపంలోని ఈ ట్రెండ్ ఎక్కువ మంచిది మనసుల్ని దోచేసింది. పెళ్లిళ్లలో చూడీదార్లకు ప్రాధ్యాన్యం ఇచ్చే వారంతా ప్రస్తుతం ఈ జాకెట్ లెహెంగాల వైపే మొగ్గు చూపుతున్నారంటే అతిశయోక్తి కాదేమో...జాకెట్ లెహంగాలో ఉండే సౌకర్యమే ఇందుకు కారణం. సాధారణ లెహెంగాలో అయితే నడుము కనిపిస్తుందేమోనన్న భయం ఉంటుంది. అందుకే చాలా మంది మరీ అవసరమైతే తప్ప అలాంటివి ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపరు. ఈ జాకెట్ లెహంగా వల్ల అయితే అలాంటి సమస్య ఉండదు. కాబట్టి సౌకర్యంగా ఉండొచ్చు.

పలాజో తిరిగొచ్చింది:

పలాజో తిరిగొచ్చింది:

పలాజో కొన్నేళ్ల క్రితం నాటి ఫ్యాషన్..ఇది ఈ ఏడాది మళ్లీ తిరిగొచ్చింది. అయితే అలాగే మాత్రం కాదండోయ్..కాస్త ప్రత్యేకమైన లుక్ తో ..! అవును ..సాధారణంగా పలాజోలను మోడ్రన్ డ్రస్సులుగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం కుర్తీల కింద, జాకెట్స్ తో మ్యాచ్ అయ్యేలా పలాజోలను కలిపి వేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల ఇటు లెహెంగా వేసుకున్న లుక్ తో పాటు అటు సౌకర్యవంతంగానూ ఉంటుంది. కొంత మందిలో లెహెంగాతో ఉన్న కాస్త అసౌకర్యంగా కూడా ఈ పలాజోతో దూరమవుతుంది. దీన్ని వేసుకుని బైక్ పై రెండువైపులా కూర్చోవడం ..ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడిచే వీలు కూడా ఉంటుంది. అదుకేనేమో ..పెళ్లిళ్లు , ఫంక్షన్లలో ప్రస్తుతం వీటి హవానే కొనసాగుతోంది.

చేతులు ఫ్యాషనబుల్ గా..

చేతులు ఫ్యాషనబుల్ గా..

ఈ ఏడాది ఫ్యాషన్లు చేతుల చుట్టే ఎక్కువగా తిరిగాయి. చేతులకు విభిన్న డిజైన్లు వచ్చే ఫ్యాషన్లను ఎక్కువగా ఆదరించారు మగువలు. ముఖ్యంగా ఇందులో అప్ షోల్డర్ డ్రస్సులు ఎక్స్ మోడల్ హ్యాండ్స్ కోల్డ్ షోల్డర్ ట్రెండ్ హైలైట్ అయ్యాయి. వీటిని ఉపయోగించని సెలబ్రిటీ లేదంటే అవి ఎంతగా పాపులరయ్యాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే కేవ్ బ్లౌజులు, షర్టులు వేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. వాటి చేతలు వదులుగా ఉండడం వల్ల అవి చీరకే సరికొత్త వన్నె తీసుకొచ్చాయి. అలా ఈ ఏడాది ఫ్యాషన్లన్నీ చేతుల చుట్టే తిరిగాయని చెప్పుకోవచ్చు.

మాంగ్ పట్టీల ట్రెండ్:

మాంగ్ పట్టీల ట్రెండ్:

పెళ్ళిళ్లలో సాధారణంగా పాపిటి బిళ్లలు పెట్టుకోవడం మామూలే..అయితే ఈ మధ్య మాత్రం మాంగ్ పట్టీల ట్రెండ్ ఎక్కువైంది. ఇది ఇంతకు ముందే ఉన్నా.. తలంతా కప్పి ఉంచేలా మాంగ్ పట్టీలను ధరించడం ఈ సంవత్సరంలోనే ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఇదే కాదు..మెడకు అలా పట్టి ఉండే స్టేట్ మెంట్ చోకర్లు కూడా ఈ ఏడాది వాటి హవా కొనసాగించాయి. అమ్మమ్మల కాలం నాటి ఈ ఫ్యాషన్ కి కొద్దిగా మార్పులు చేసి, స్టేట్ మెంట్ పీసులుగా వీటిని ధరిస్తున్నారు . మెడకు గట్టిగా పట్టి ఉండడం వల్ల అవి బాగా హైలైట్ అవుతాయి. దీంతో సింపుల్ డ్రస్సులకు కూడా మంచి లుక్ ని అందిస్తాయివి. ఇవే కాదు, ఈ ఏడాది చేత్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కి, ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. వాటిని వాడే వారు ఎక్కువయ్యారు.

ఇంకా :

ఇంకా :

తెలుపు, నారింజ రంగులు ఈ ఏడాది చలామని అయ్యాయి. నడిచిన ఫ్యాషన్లలో ఎక్కువగా ఈ రంగులే హైలైట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇవే కాదు ..వెల్వెట్ దుస్తులు ఫ్యాషన్ తిరిగొచ్చింది. బెల్ స్లీవ్స్ ఉన్న దుస్తులు, స్ట్రైప్స్ ఉన్న సూట్లు, ప్లెయిడ్ షర్టులు మైక్రోఫ్లీట్స్ ఉన్న గౌన్లు ఉపయోగించడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించారు. అలాగే నెట్ మోడల్ ఇంతకు ముందే ప్రారంభమైనా ఈ ఏడాది దానికి చాలా మంది గులాములయ్యారు. హీరోయిన్ల నుంచి సాధారణ యువతుల వరకూ అంతా అలాంటి దుస్తులు ధరించడానికి ఆసక్తి చూపించారు.

English summary

FindOut The Biggest Fashion Trends That Ruled 2016

Find out which trends ruled the year 2016. Did you miss any of these or were you ruling them all? Check out.
Story first published: Wednesday, January 11, 2017, 15:44 [IST]
Desktop Bottom Promotion