డయాబెటీస్ వ్యాధి ముదిరితే రక్తంలో గ్లూకోజ్ స్ధాయి బాగా పెరుగుతుంది. ఇక ఈ దశ రక్తనాళాలను, నరాల వ్యవస్ధను దెబ్బతీస్తుంది. శరీరం రోగ నిరోధక వ్యవస్ధ బలహీనపడుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్ ఫెక్షన్ వంటివి త్వరగా తగ్గవు. ఈ పరిస్ధితిని అరికట్టాలంటే డయాబెటీస్ రోగులు తరచుగా రక్తపరీక్షలు చేయించుకొని రక్తంలో షుగర్ స్ధాయిలను నియంత్రించుకోవాలి. మూత్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కిడ్నీలు దెబ్బతింటాయి. మూత్రాశయం పూర్తిగా నిండినా అది నిండిందని వ్యాధిగ్రస్తుడికి తెలియదు. అవసరమైనపుడు మూత్రం పోయక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. మూత్రం వాసన, జ్వరం, వెన్ను నొప్పి వంటివి వస్తాయి.
సెక్సు పర సమస్యలు వస్తాయి. మహిళలలో ఈ వ్యాధి కారణంగా 35 శాతం పురుషులలో 75 శాతం సెక్స్ పర ఇబ్బందులు పడుతున్నారు. నరాల వ్యవస్ధ దెబ్బ తినటంతో జననాంగాలు పటుత్వం కోల్పోతాయి. మహిళల జననాంగం ఎండిపోతుంది. ఆసక్తి కలగదు. తరచుగా జననాంగం వ్యాధులకు గురవుతుంది. స్కలనం జరగదు. పురుషులకు కోర్కె వున్నప్పటికి అంగ స్తంభన సమస్య వస్తుంది. ఈ వ్యాధి ముదిరితే, జీర్ణక్రియ సమస్యలుంటాయి. పొట్ట ఉబ్బటం, గుండె మంట, వాంతులు అవటం వంటి సమస్యలొస్తాయి.
నరాలలో రక్తం సరిగా ప్రవహించనందున చర్మ సంబంధిత వ్యాధులు పెరిగి పుండ్లు, గాయాలు అవుతాయి. ఇవి త్వరగా నివారణ పొందవు. డయాబెటీస్ రోగుల కాళ్ళు, పాదాలు స్పర్శ కోల్పోతాయి. రాత్రులందు విపరీతమైన నొప్పులుంటాయి. పాదాలు చల్లబడతాయి. కాళ్ళ, పాదాల చర్మం వెంట్రుకలు లేకుండా నిగ నిగ లాడుతూంటుంది. కాళ్ళు వాపు, గాయాలు, పుండ్లు, పాదాలు మెత్తబడిపోవటం వంటివి గమనించవచ్చు.