For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహ వ్యాధితో బాధపడుతున్నసెలబ్రిటీలు

By Super
|

ఇటీవల, నటుడు టామ్ హాంక్స్ ఆయన శరీరం తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకుండా ఉండటం వలన వొచ్చే మధుమేహం 2వ రకం వ్యాధితో, బాధపడుతున్నట్లుగా నిర్దీకరిస్తూ వెల్లడించారు. 57 ఏళ్ల నటుడు టామ్ హాంక్స్ 36 సంవత్సరాల వయసు నుండే అధిక రక్తపోటు వ్యాధితో బాధపడుతున్నారని contactmusic.com నివేదించింది. ఈ పరిస్థితిని సమర్థవంతమైనఆహారం(డైట్ టిప్స్) తీసుకోవటం ద్వారా నియంత్రించవచ్చు. దీనిని పోషకాహారం తీసుకోవటం ద్వారా నియంత్రిన్చావొచ్చు.

మీరు హై స్కూల్ లో ఏమి బరువు ఉన్నారో, మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండవలసింది మరియు మధుమేహం 2వ రకం వొచ్చి ఉండేది కాదు." అని నా వైద్యుడు అన్నాడు. అప్పుడు నేను అన్నాను" సరే, నాకు మధుమేహం 2వ రకం వొచ్చింది. అయితే!" టామ్ హాంక్స్, ఒక్క సెలెబ్రిటీ మాత్రమే కాదు మధుమేహంతో బాధపడుతున్నది. ఇక్కడ ఈ ప్రమాదకర వ్యాధితో బాధపడుతున్న కొంతమంది సెలెబ్రిటిల గురించి ఇస్తున్నాము:

సోనం కపూర్

సోనం కపూర్

అనిల్ కపూర్ కూతురు తన యుక్తవయసు నుండి మధుమేహవ్యాధితో పోరాడుతోంది. ఆమె రోజువారీ ఇన్సులిన్ తో, ఖచ్చితమైన ఆహారనియమాన్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నది. ఆమె రోజువారి హడావుడి షెడ్యూల్ వలన ఆమె ఆరోగ్య పరిస్థితి అదుపు తప్పుతున్నది అనిపించినప్పుడల్లా, వెంటనే పరిస్థితిని అదుపులో తీసుకుని కావలసిన జాగ్రత్తలను తీసుకుంటుంది మరియు ఆమెను B-పట్టణం అత్యంత అభిమానించే నటీమణులలో ఒకరిగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.

హాలీ బెర్రీ

హాలీ బెర్రీ

ఆమె 23 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒక TV సెట్ మీద ఉన్నప్పుడు కళ్ళుతిరిగి పడిపోయినప్పుడు, ఈ బాండ్ గర్ల్ కు మధుమేహం ఉన్నదని తెలిసింది. ఆమె కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఈ వ్యాధితో బాధపడలేదు,కాని ఈమె మాత్రం ఈ వ్యాధి బారిన పడింది. అప్పటి నుండి, ఆమె జీవితంలో రోజువారీ ఇన్సులిన్ సూది మందులు తీసుకోవడం మరియు ఆహారంలో మార్పులు చేసి తీసుకుంటున్నారు. ఆమె ఇప్పుడు కొవ్వు, చక్కెర, ప్రాసెస్ పిండి పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం మరియు అన్ని రకాల జంక్ ఆహారం లేదా స్వీట్లు తొలగించిన ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు.

సల్మా హాయక్

సల్మా హాయక్

ఆమె కుటుంబంలో ఉన్న గర్భధారణ మధుమేహం (గర్భధారణ సమయంలో మధుమేహం) వ్యాధితో బాధపడినట్లుగా పేర్కొన్నారు. ఆమె అమెరికన్ బేబి మాగ్జెన్ లో చెప్పారు" నేను ఈ గర్భధారణ మధుమేహవ్యాధిని మొదట్లో కనుక్కోలేకపోయాను. ఇది హై బ్లడ్ షుగర్ ఉన్న గర్భిణి స్త్రీలలో వొస్తుంది. నాకు గర్భిణిగా ఉన్నాను కనుక నేను ఎప్పుడు అనారోగ్యంగా అనుభూతి చెందలేదు లేదా ఇది చాలా తీవ్రమైన సమస్యగా కూడా అనుకోలేదు. దీని లక్షణమైన వికారం తొమ్మిది నెలలు నేను అనుభవించాను."

వసీం అక్రమ్

వసీం అక్రమ్

ఈయన 30 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుటి నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఎల్లప్పుడూ ఒక నిశ్చల జీవనశైలితో ఉన్న ఏస్ స్వింగ్ బౌలర్ కు దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, అనారోగ్యం ప్రతిగా తన ఆహారం మరియు వ్యాయామ నియమాలలో మార్పులు చేసుకోవటం మరియు మోతాదుకు తగ్గట్టుగా ఇన్సులిన్ తీసుకోవటం చేస్తున్నారు. ఈ వ్యాధి, క్రికెట్ ప్రపంచంలో ఆయనను తనదైన శైలిని ఏమి మార్చలేదు మరియు ఎప్పుడు కనివినీ ఎరుగనంత గొప్ప బౌలర్లలో ఒకరిగా ఎదిగారు.

కమల్ హాసన్

కమల్ హాసన్

ఈ గొప్ప నటుడు మధుమేహం 1వ రకం వ్యాధితో బాధపడుతున్నారు మరియు ఈ రకమైన వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య భారతదేశంలో 5% ఉన్నారు. ఈ నటుడు తన హాస్య ప్రసంగాలు ఈ వ్యాధిని తగ్గించడానికి దోహదపరుస్తున్నాయి మరియు ఈ వ్యాధిని నియంత్రించటంలో ఈయన మధుమేహం అవగాహన కోసం వెబ్సైట్ www.sugarbp.org ని సమర్ధిస్తున్నారు.

గౌరవ్ కపూర్

గౌరవ్ కపూర్

మాజీ చానల్ V VJ మరియు IPL అదనపు ఇన్నింగ్స్ హోస్ట్, తన 22 సంవత్సరాల వయస్సు నుండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఈ చమత్కార నటుడు తన అడుగులను తూచితూచి వేస్తున్నారు మరియు ఈ వ్యాధికి ప్రతిగా ఒక ఆరోగ్యకరమైన జీవనశైలితో నివసిస్తున్నారు. అతను యోగా అభ్యసిస్తూ, క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ మరియు మద్యం నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా ఒక ఖచ్చితమైన ఆహారనియమాన్ని పాటిస్తూ తన రక్త చక్కెరను నియంత్రణలో ఉంచుతున్నారు.

డ్రూ కర్రీ

డ్రూ కర్రీ

ఒక అధిక బరువు హాస్యనటుడు మరియు సందర్భోచిత హాస్య నటుడుగా ప్రసిద్ధి చెందిన డ్రూ కర్రీ ఈ వ్యాధి ఉన్నదని నిర్ధారణ చేసుకున్న తరువాత 80 పౌండ్స్ బరువు తగ్గించుకున్నారు. అతను బరువు కోల్పోయిన తరువాత, ఇప్పుడు ఇకపై ప్రతి రోజు మధుమేహ ఔషధం అవసరం లేదని పేర్కొన్నారు.

జార్జ్ లుకాస్

జార్జ్ లుకాస్

స్టార్ వార్స్ సృష్టికర్త, ఈయన కళాశాల నుండి గ్రాడ్యుయేట్ కు వొచ్చినప్పుడు మరియు ఆయన వియత్నాం యుద్ధం కోసం జరిపిన భౌతిక పరీక్షలో ఆయన మధుమేహం 2 రకంలో బాధపడుతున్నారని తేలింది మరియు డ్రాఫ్ట్ నుండి అతనిని మినహాయింపు చేశారు.

బిల్లీ జీన్ కింగ్

బిల్లీ జీన్ కింగ్

ఈ గొప్ప మహిళా టెన్నిస్ ప్లేయర్, 2006 నుండి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. ఈమె వ్యాధితో పోరాడటానికి 35 పౌండ్స్ బరువు కోల్పోయింది మరియు మధుమేహం అవగాహన కోసం ఒక ప్రతినిధిగా ఎదిగింది.

మధుమేహవ్యాధికి గొప్ప,పేద భేదం లేదు కాని దీనిని నిర్వహించగలిగిన పరిస్థితిలోనే ఉంచవొచ్చు. మీరు చేయవలసిందల్లా ఈ ప్రమాదాన్ని అధిగమించేందుకు జాగ్రత్తగా ఉండండి.

English summary

10 Celebrities living with Diabetes

Recently, actor Tom Hanks revealed that he was diagnosed with type 2 diabetes, a lifelong condition, which occurs when the body does not produce enough insulin. 
Desktop Bottom Promotion