For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ పేషంట్స్ తొక్కకలిగిన ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

|

మధుమేహగ్రస్థులు వారి పాటించే లేదా ప్లాన్ చేసే డైయట్ చార్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో కొన్ని పండ్లు మధుమేహగ్రస్తులు నిరభ్యంతరంగా ఎంటుంటి భయం లేకుండా తినవచ్చు. అయితే వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేటటువంటి ఆహారాలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకు: కృత్రిమ తీపిపదార్థాలు మరియు వాటితో తయారు చేసే ఆహారాలు కూడా మధుమేహగ్రస్తులకు ప్రమాదకరం.

మధుమేహానికి సంబంధించిన ఒక సాధారణ అపనమ్మకం ఉంది . చాలా మంది మధుమేహగ్రస్తులు పండ్లు ఆరోగ్యానికి చాలా హానికరం అని నమ్ముతారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులకు ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల వారి ఆరోగ్యానికి మేలే చేస్తాయి. ఉదాహరణకు : ఆపిల్స్, బేరికాయలు, బెర్రీస్(స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ మరియు రాస్పెబెర్రీ)మొదలగునవి ఆరోగ్యకరమైన పండ్లు. ఇవి డయాబెటిక్ ను కంట్రోల్ చేస్తుంది మరియు శరీరానికి అవసరమైన పోషకాలను అందించేందుకు బాగా సహాయపడుతాయి.

ఈ పండ్లను కూడ తగు మోతాదులో మీ వైద్యుల పర్యవేక్షణలో సేవించాలి. ఈ పండ్లు మధుమేహ గ్రస్తుల్లో రక్తంలో ని అధిక చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడుతుంది. వీటిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండి, శరీరానికి కావల్సిన ప్రోటినులు మరియు విటమినులు అధికంగా ఉంటాయి. మరి ఆ పండ్లేంటో ఒక సారి చూద్దాం...

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

బేరికాయలు(పీయర్స్): మధుమేహగ్రస్తులకు పెక్టిన్ అధికంగా కలిగినటువంటి మరో ఆరోగ్యకరమై పండు. బేరికాయను తగిన మోతాదులో తీసుకుంటే రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

పుచ్చకాయ(muskmelon): సాధారణంగా దోసకాయలు తియ్యంగా ఉండు కడుపు నిండుగా చేస్తుందంటారు. అయితే వీటిలో ఉండే ఫైబర్ ఆ తియ్యదనాన్ని తగ్గించేస్తుంది. అయితే ఎక్కువగా పండుగా మారిన పండ్లను తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే అవి రక్తంలోని చక్కెరస్థాయిలను పెంచుతుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

ఆపిల్స్: ప్రతి రోజూ ఆపిల్ తినడం వల్ల వైద్యుల అవసరం ఉండదంటారు. అది నిజమే.!ఆపిల్స్ లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ తగ్గిస్తుంది. కాబట్టి తాజాగా ఉండే యాపిల్స్, లేదా జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ గ్లైసిమిక్ ఇండెక్స్ ను తగ్గిస్తుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

ద్రాక్ష: మధుమేహగ్రస్తులు తినగలిగే మరో సిట్రస్ ఫ్రూట్ ఇది, ఇందులో శరీరానికి హాని కలిగించే పిండి పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి తగు మోతాదులో తీసుకోవాలి.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

రేగు(ప్లంమ్స్): వీటిలో లోక్యాలరీస్ కలిగి ఉండటమే కాకుండా, వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. రేగు పండ్లు వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ మధుమేహగ్రస్తులకు మరియు హార్ట్ పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

ఆరెంజ్: జ్యూసి సిట్రస్ పండ్లు మధుమేహగ్రస్తులకు చాలా ఆరోగ్యకరం. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ రక్త ప్రవాహానికి శోషణకు బాగా సహాయపడుతుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

ఆప్రికాట్: ఆప్రికాట్ తాజా పండ్ల కంటే ఎండిన పండ్లు చాలా ఆరోగ్యకరం. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉండి, మధుమేహగ్రస్తులకు చాల మేలు చేస్తుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

బెర్రీస్: అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, మరియు బ్లాక్ బెర్రీ మధుమేహ గ్రస్తుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

చెర్రీస్: చూడటానికి చిన్నగా..పుల్లగా ఉండే ఈ చెర్రీస్ మరో లో గైసిమిక్ ఇండెక్స్ ప్రూట్. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించే ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

దబ్బపండు(గ్రేప్ ప్రూట్): మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇది సాధారణంగా రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని నిలుపుచేయడానికి దీన్ని జ్యూస్ లా తయారు చేసి తీసుకోవడం మంచిది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

అవొకాడో: ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం అవొకాడోలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మధుమేహగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఈ పండు కూడా ట్రిగ్లేసెరైడ్ మరియు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.

షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!

నెక్టారినే(ఒక విధమైన పండు): సిట్రస్ పండ్లలో ఇది ఒకటి. వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.

English summary

12 Healthy Fruits For Diabetics | షుగర్ పేషంట్స్ ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు...!


 Diabetics have to be very careful while preparing their diet chart. There are few foods that a diabetics can have without worry. However, there are a majority of foods that can raise their blood sugar levels. For example, artificial sweeteners and any food that is prepared with it can be dangerous for a diabetic.
Story first published: Wednesday, February 20, 2013, 11:49 [IST]
Desktop Bottom Promotion