For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్(షుగర్) పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

|

డయాబెటిస్ వ్యాధి కాదు. అయితే ఇది ఐసొలేషన్ మీద ప్రభావం చూపుతుంది. మధుమేహం మీ శరీర వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది షుగర్ వ్యాధి రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. మధుమేహానికీ, గుండెజబ్బులకూ దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఇప్పటికే వచ్చిన షుగర్‌ని నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు తీసుకునే ఆహారంలో ఫ్లేవనాయిడ్‌లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి'' యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునేవారిలో కొవ్వు శాతం కూడా గణనీయంగా తగ్గుతుందట. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీరాడికల్స్‌ను సమర్థంగా నిరోధించే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మధుమేహాన్ని నిరోధించడానికి మరియు నియంత్రించడానికి, మీరు తీసుకొనే ఆహారం సాధారణంగా మరియు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వాటిలో అధికంగా ఆహార విలువలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మధుమేహగ్రస్తులకు సహాయకారిగా పనిచేస్తాయి. అయితే మధుమేహగ్రస్తులు తినే ఆహారం ఎప్పూడూ చేదు లేదా రుచి లేకుండా తీసుకోవల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు డైయట్ ప్లాన్ ను ముందే తయారు చేసుకొని దాని ప్రకారం తినడం అవసరం. అందుకు మీ డైయట్ ప్లాన్ లో చేర్చడానికి 12సూపర్ ఫుడ్స్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వారంలో ఒక రోజుకు ఒక రకం ఆహారాన్నిమీరు తీసుకొన్నా రెండు వారాలకు సరిపోయో ప్లాన్ లిస్ట్ మీ మధుమేహాన్నిఅరికట్టేందుకు మరియు రక్తంలో చెక్కరను నియంత్రణకు బాగా సహాయపడుతుంది. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం...

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

నట్స్: సూపర్ ఫుడ్స్ లో నట్స్ అతి పెద్ద హీరోస్ గా అభివర్ణింపవచ్చు. ఎందుకంటే వీటిలో మంచి కొవ్వులు(ఒమేగా 3ఫాటీ యాసిడ్స్), విటమిన్స్, మినిరల్స్ మరియు మధుమేహగ్రస్తులకు కావల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి. ఈ నట్స్ కొన్ని రకాల కొవ్వులు ఇన్సులిన్ నిరోధకత తగ్గించేందుకు బాగా సహాయం చేస్తాయి.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

ఆలివ్ ఆయిల్: ఇతర నూనెలతో పోల్చితే ఆలివ్ ఆయిల్ చాలా తేలికైనటువంటిది. అంతే కాదు ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి మధుమేహగ్రస్తులు బరువు కోల్పోవడానికి బాగా సహాయపడుతుంది.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

బీన్స్: శరీరంలో ఇన్సులిన్ స్థాయిని కంట్రోల్ చేయడానికి కావలసినన్ని న్యూట్రియంట్స్, పొటాషియం, మెగ్నీషియం, మినిరల్స్ ఈ బీన్స్ లో పుష్కలంగా ఉంటాయి . మినిరల్స్ మధుమేహగ్రస్తులకు చాలా ఉపయోగకరం. అందువల్ల ఇది డయాబెటిక్ పేషంట్స్ వీటిని ఎక్కువగా వాడితే ఆరోగ్యకరం.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

పెరుగు: లోఫ్యాట్ పెరుగు. చాలా మంది అడల్ట్స్ లో పాలు జీర్ణం కావు. కాబట్టి అటువంటి వారికి క్యాల్షియం పొందడానికి పెరుగు మంచి ఎంపిక. శరీరంలో సరిపడినంత క్యాల్షియం ఉండుటం చేతా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.అంతే కాదు ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

ఫిష్: ఉడికించిన లేదా గ్రిల్ చేసిన ఫిష్ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తుంది. మధుమేహం వల్ల కళ్ళ మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ ఆహారంలో చేపలను లేదా చేపనూనెను చేర్చడం ద్వారా కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి చేపలను తిని హైబ్లడ్ ప్రెజర్ వల్ల కలిగి కళ్ళ సమస్యలను నియంత్రించండి.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. సిట్రస్ పండ్లను (నిమ్మజాతికి చెందిన పండ్లు, ఆరెంజ్, బత్తాయి, జామ)వంటివి తీసుకోవడం వల్ల సాయంత్రంలో కలిగే ఆకలిని కంట్రోల్ చేస్తుంది. వీటిలో విటమిన్ సి, ఫ్లావోనోయిడ్స్ రక్తనాళాల పనితీరును మెరుగుపరిచి సుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ సి, మరియు ఫైబర్ మరియు అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. ఈ న్యూట్రీషియన్స్ అన్నీ కూడా మధుమేహగ్రస్తులకు చాలా బాగా ఉపయోగపడుతాయి.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

టమోటో అధిక రోగనిరోధక శక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమోటోలో విటమిన్ సి తో పాటు ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి టమోటోలను అలాగే తినకుండా వంటల్లో (సూప్, రోస్టెడ్ టమోటో)ఉపయోగించి తినడం మంచిది.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

గుమ్మడికాయ: గుమ్మడికాయ తియ్యగా ఉంటుందని చాలా మంది మధుమేహగ్రస్తులు దీని దూరంగా ఉండవచ్చు. అయితే గుమ్మడిలో చాలా తక్కువ గ్లిసెమిక్ కలిగి ఉండటం వల్ల గుమ్మడిని మీ డైయట్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

స్ట్రాబెర్రీ-బెర్రీస్: స్ట్రాబెర్రీస్‌, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్‌, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్‌ ఉంటాయి. ఇవి కేన్సర్‌ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడు పళ్ళలో విటమిన్‌ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

గోధుమలు: గోధుమల్లో చాలా తక్కువ శాతంలో పిండి పదార్థాలు కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బియ్యానికి బదులు, బ్రౌన్ రైస్, రిఫైండ్ పిండి నుండి స్వచ్చమైన గోధుమ పిండిని వాడండి.

షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

కాకరకాయ: కాకరకాయను మధుమేహగ్రస్తులకు మెడిసినల్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులో ఆకుకూరల్లో కంటే అధికంగా క్యాల్షియం , ఐరన్, బీటా కెరోటిన్ ఉంటుంది. మధుమేహ గ్రస్తులకు తినగలిగే కూరగాయల్లో కాకరకాయ అద్భుతమైనటువంటిది కాకరకాయ. ఒక గ్లాసు కాకరకాయ జ్యూస్ తో మధుమేహ గ్రస్తుల్లో చెక్కర స్థాయిని కంట్రోల్ చేసుకోచ్చు.

English summary

12 Superfoods That Diabetics Must Have | షుగర్ పేషంట్స్ తినగలిగే 12 సూపర్ ఫుడ్స్

Diabetes is not a disease that affects you in isolation. Diabetes affects your entire system and almost every organ of your body. Thus having high blood sugar is more like a degenerative disease that will eventually claim your kidneys, eyes, heart etc. So it is better to have a strict diet for diabetes and keep the blood sugar levels under control.
Story first published: Wednesday, January 16, 2013, 18:32 [IST]
Desktop Bottom Promotion