For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహంను సులువుగా నియంత్రించడం ఎలా

|

షుగర్‌ (మధుమేహం) ఉందని తెలియగానే చాలా మంది భయపడుతున్నారు. కొంత మంది దాచిపెడుతున్నారు. దీని వల్ల వచ్చే సమస్య గురించి ఆందోళన చెందితే ఫలితం ఉండదు. షుగర్‌ వ్యాధినియంత్రణలో లేకుంటే శరీరంలోని ఇతర అవయవాలు ప్రభావితం అవుతాయి. షుగర్‌ వ్యాధిని నియంత్రించుకోవడం పెద్ద కష్టమేమి కాదు. భయపడాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌, రక్తపోటులాగే ఇదీ ఒక జబ్బు మాత్రమే. దీన్ని సులువైన క్రమశిక్షణతో నియంత్రించే వీలుంది. మరి మధుమేహాన్నిఎలా నియంత్రించుకోవడం మరియు క్రమశిక్షణ పద్దతులేంటో తెలుసుకుందాం..

ప్రజల్లో షుగర్‌ జబ్బు పెరగడానికి కారణం జీవన విధానంలో మార్పులు రావడమే. తినే ఆహార పదార్థాల్లో, పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. తిన్న ఆహారానికి తగ్గట్టు శారీరక శ్రమ ఉండటం లేదు. మధుమేహం పెరగడానికి ఈ రెండు ప్రధాన కారణాలని పరిశోధనలో వెల్లడైంది. నడుం దగ్గర కొవ్వు చేరడాన్ని సెంట్రల్‌ ఒబేసిటి అంటారు. దీని వల్ల కూడా షుగర్‌ వస్తుంది. కుటుంబంలో తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 70 శాతం ఉంటుంది. మేనత్త, మేనమామకు ఉంటే కూడా 50 శాతం షుగర్‌ వచ్చే అవకాశముంది.

5 Easy Tips for Controling Diabetes

మధుమేహంను సులువుగా నియంత్రణ
షుగర్‌ను నియంత్రించడం పెద్ద కష్టమేమి కాదు. ఇది మన చేతుల్లోనే ఉంది. దీన్ని సులువుగా నియంత్రించొచ్చు. అదేలాగో చూద్దాం..
1. మొదటిది షుగర్‌ గురించి తెలుసుకోవడం. రక్తంలో షుగర్‌ ఎందుకు పెరుగుతుంది, ఎంత షుగర్‌ లేవల్‌ ఉండాలనేది తెలుసుకోవాలి. అంటే అవగాహన పెంచుకోవాలి.
2. రెండోది షుగర్‌ నియంత్రణలో క్రమశిక్షణ పాటించడం. అంటే టైం ప్రకారం తినడం, పడుకోవడం, నిద్రలేవడం. అన్ని టైం ప్రకారం జరగాలి. అరగంట శారీరక శ్రమ ఉండాలి. ఇంట్లో ఏదైనా పని చేయవచ్చు. వ్యాయామం చేయవచ్చు. నడక, సైకిల్‌ తొక్కడం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.
3. శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకోవాలి. ఉదయం టీ మొదలుకుని టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంతా ఫిక్స్‌‌డ్‌గా ఉండాలి. రోజూ ఒకే సమయంలో, ఒకే పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరం నుంచి షుగర్‌ ఒకేలా ఉత్పత్తి అవుతుంది. ఇలా క్రమశిక్షణతో ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని బట్టి వైద్యులు మందుల మోతాదు సూచిస్తారు. ఆహారం, మందులు మ్యాచ్‌ అయితే షుగర్‌ ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది.
4. షుగర్‌ వ్యాధి ఉందని తెలిస్తే వెంటనే నియంత్రించుకోవాలని పరిశోధనలు వెల్లడించాయి. హెచ్‌బిఎ1సి అనే రక్తపరీక్ష ఫలితం 7కన్నా తక్కువుండాలి. డాక్టర్‌ సూచించిన మందులు వాడుకుని ప్రతీనెలా షుగర్‌ పరీక్ష చేయించుకోవాలి. అవసరం అయితే ప్రతీనెలా డాక్టర్‌ను కలవాలి.
5. ఇవి కూడా నియంత్రణలో ఉండాల్సిందే...
రక్తపోటు, కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉండే షుగర్‌ రాదని పరిశోధనల్లో వెల్లడైంది. రక్తపోటు 140/80 ఉండాలి. టోటల్‌ కొలెస్ట్రాల్‌ 150 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎల్‌డిఎల్‌ 100 కంటే ఎక్కువ ఉండకూడదు. ట్రైగ్లిజరైడ్స్‌ 150 కంటే ఎక్కువ ఉండకూడదు. బిఎంఐ పురుషులకు 23, మహిళలకు 22 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ నియంత్రణలో ఉంటే షుగర్‌ రాని వాళ్లకు షుగర్‌ రాదు. ఒక వేళ షుగర్‌ వచ్చినా నియంత్రణలో ఉంటుంది.

English summary

5 Easy Tips for Controling Diabetes

Diabetes is becoming a very common and chronic disease that is effecting people worldwide. It is a condition when your blood sugar level shoots up thus giving rise to many health complications.
Story first published: Thursday, December 19, 2013, 17:56 [IST]
Desktop Bottom Promotion