For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం 8 చెత్త పండ్లు

By Derangula Mallikarjuna
|

ఒక సమతుల్య ఆహారం అనేది మీ శరీరం మరియు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతాలను చేస్తుంది. మీ ఆహారంలో పండ్లు జోడించడం వలన అవసరమైన విటమిన్లు,కార్బోహైడ్రేట్లు మరియు ఖనిజాల రూపంలో అవసరమైన పోషణ మన శరీరంనకు అందుతుంది. మధుమేహం ఉన్నవారు పండ్లు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పండ్లు మన ఆరోగ్యానికి మంచివి. కానీ మధుమేహం ఉన్న వారి ఆహారంలో పండ్లను చేర్చటం వలన వ్యతిరేకంగా పరిణమించవచ్చు.


పండ్లు పోషణ మరియు శక్తి యొక్క ఒక మంచి మూలం కలిగి ఉన్నాయి. అంతేకాక పండ్లు అనేవి మంచి మరియు చెడు రెండింటిని కల్గిస్తాయి. శరీరానికి అవసరమైన యాంటీ యాక్సిడెంట్లు మరియు పోషకాలు ఉంటాయి. మధుమేహం ఉన్నవారు వివిధ రకాల పండ్లను తినటం వలన రక్తంలో చక్కెర స్థాయిల మార్పులకు కారణం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి కొన్ని పండ్లను మానివేయాల్సిన అవసరం ఉంది.


పండ్లలో అత్యధిక రక్త చక్కెర స్థాయి సవరించడానికి వాటి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. మధుమేహం నివారించేందుకు వారి భోజనంలో పండ్లను జోడించటానికి ముందు GI ఇండెక్స్ విలువ పరిగణించాలి. సాదారణంగా GI విలువ అంటే మధుమేహస్థాయి సూచిక అని అర్దము. మధుమేహం ఉన్న వారిలో మధుమేహస్థాయి సూచిక 55 లేదా సమానంగా ఉండాలి. స్ట్రాబెర్రీస్,బేరి పండ్లు మరియు ఆపిల్ వంటి పండ్లలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని మధుమేహ ఆహారంలో చేర్చవచ్చు.


మధుమేహ ఆహారంలో నివారించాల్సిన 8 పండ్లు

మామిడి

మామిడి

'పండ్లలో రాజు' అయిన ఈ పండు ప్రపంచంలో అత్యంత రుచికరమైన పండ్లలో ఒకటి. దీనిలో అధిక చక్కెర కంటెంట్ ఉండుట వలన మధుమేహ రోగులు వాడకూడదు. సాధారణ వినియోగం వలన రక్తంలో చక్కెర స్థాయిలు దీర్ఘకాల పెరుగుదలకు దారితీస్తుంది.

చికో

చికో

దీనిని సపోటా అని కూడా పిలుస్తారు. ఈ పండులో GI విలువ 55 పైన ఉండుట వలన మీ ఆహారంలో ఉండటం మంచిది కాదు. అంతేకాక దీనిలో చక్కెర మరియు పిండి పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి.

ద్రాక్ష

ద్రాక్ష

దీనిలో ఫైబర్,విటమిన్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ద్రాక్షలో కూడా చక్కెర పరిమాణం ఎక్కువగానే ఉంటుంది. 3 ఔన్సులు ద్రాక్షలో 15 గ్రాముల కంటే ఎక్కువగా పిండిపదార్ధాలు ఉండుట వలన మధుమేహ ఆహారంలో చేర్చకూడదు.

 పైనాపిల్

పైనాపిల్

పైనాపిల్ ను ఖచ్చితంగా మధుమేహం ఆహారంలో చేర్చకూడదు. ఎందుకంటే పైనాపిల్ లో GI విలువ అధికంగా ఉంటుంది. ఒక చిన్న కప్పు పండ్ల ముక్కలలో 20 గ్రాముల లేదా మరింత ఎక్కువగా పిండిపదార్ధములను కలిగి ఉంటుంది.

సీతాఫలం

సీతాఫలం

దీనిలో విటమిన్ సి,కాల్షియం,ఇనుము మరియు ఫైబర్ వంటి మంచి వనరులు ఉన్నప్పటికీ మధుమేహ ఆహారంలో నివారించాల్సిన పండ్లలో ఒకటి. ఒక చిన్న 100 గ్రాముల పండులో 23 గ్రాముల కంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటుంది.

ఆప్రికాట్

ఆప్రికాట్

ఆప్రికాట్ లో GI విలువ 57 ఉండుట వలన మధుమేహం ఆహారంలో చేర్చకూడదు. ఒక అర కప్పు ఆప్రికాట్ లో సగటున 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

అరటిపండు

అరటిపండు

అర కప్పు అరటిపండు ముక్కలలో 15 గ్రాముల పిండిపదార్ధాలు ఉంటాయి. అలాగే అరటిపండులో GI విలువ 46 నుండి 70 మధ్య వరకు ఉంటుంది. పూర్తిగా పండిన అరటి పండ్లను మధుమేహ ఆహారంలో నివారించాలి.

పుచ్చకాయ

పుచ్చకాయ

పుచ్చకాయలో ఫైబర్ మరియు కెలోరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాక GI విలువ 72 మరియు విటమిన్ A

Story first published: Monday, December 9, 2013, 18:06 [IST]
Desktop Bottom Promotion