For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే వంటగది వస్తువులు

|

మధుమహం ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యలలో ప్రధానమైనది. ప్రస్తుత రోజుల్లో ఈ సమస్యను చాలా సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. మధుమేహ నివారణ పద్దతులను కూడా బాగా తెలుసుకొన్నారు. అందుకే కొందరు మధుమేహాన్ని తేలికగా తీసుకుంటారు. తీసుకొన్నా కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. మధుమేహం ఉన్న అలసట లేదా కళ్ళు మసకబారడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఫార్మసీల చుట్టూ తిరగడం మొదలపెడుతుంటారు. అలాకాకుండా మీ స్వంతంగా కొంత జాగ్రత్తలు తీసుకోవడం, ఇంట్లోనే కొన్ని చికిత్స పద్దతులను పాటించడం వల్ల కూడా మధుమేహాన్ని అధుపులో ఉంచుకోవచ్చు. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని వంటగది వస్తువులు బాగా ఉపయోగపడుతాయి.

చక్కెర వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఒక్క కొన్ని వంటగది వస్తువుల పట్టికను అంధిస్తున్నాం. అవి మీ వంటగదిలో కూడా ఉండవచ్చు. ఈ వంటగది వస్తువులు చాలా సులభం, అతి తక్కువ ధరకు దొరుకుతాయి. ఇవి మధుమేహానికి ఫార్మసీలో కొనుగోలు చేసే మందులకంటే తక్కువ ధరలో లభించడం వల్ల మీరు వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకోండి. తక్కువ ధరఅయినా కూడా రసాయనిక మాత్రలకంటే ఎక్కువ ప్రభావాన్ని ఈ వంటింటి వస్తువులు చూపెడుతాయి. కాబట్టి, చక్కెర వ్యాధిని ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకుంటే ఈ వంటగది వస్తువుల మీదు ఒక కన్నేయాల్సిందే...

కాఫీ:

కాఫీ:

మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి కాఫ్ ఒక బెస్ట్ మార్గం. నిపుణుల ప్రాకారం భోజన సమయంలో ఎవరైతే ఒక కప్పు టీ తాగుతారో వారిలో మధుమేహం అభివ్రుద్ది చెంది అవకాశం చాలా తక్కువ. మరి ఇది, మీ వంటగదిలో ఉంటే ఇంకెందుకు ఆలస్యం?

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

అరచెంచా దాల్చిన చెక్కపొడి శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్క మధుమేహంతో పాటు వంచ్చే ప్రమాదకరమైన గుండె సంబంధిత వ్యాధులను మరియు కీళ్ళనొప్పల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు చేయాల్సిందల్లా పెరుగులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తినడమే..

మెంతి:

మెంతి:

మీరు టైప్ 2డయాబెటిస్ తో బాధపడుతున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో మెంతిని ఎక్కువగా చేర్చుకోవాల్సిందే. ఇందులో ఉండే అనేక ఔషధగుణాలు మధుమేహాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతాయి.

ఫైబర్ బ్రెడ్:

ఫైబర్ బ్రెడ్:

రుచికరమైన ఫైబర్ బ్రెడ్ మధుమేహగ్రస్తులకు చాలా ఆరోగ్యకరమైనది. ధాన్యంతో తయారు చేసి బ్రెడ్ ఒక్క స్లైడ్ లో మూడు గ్రాముల ఫైబర్ మరియు 3గ్రాముల ప్రోటీనులను కలిగి ఉండి, శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. హైఫైబర్ ఉన్న బ్రెడ్ స్లైస్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ ను అబ్సార్షన్ ను తగ్గిస్తుంది మరియు దాంతో ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ధాన్యంతో తయారు చేసే బ్రెడ్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ డయాబెటిక్ పేషంట్స్ కు చాలా ఉపయోగకరమైనవి. ఇవి టైప్ 2 డయాబెటిక్ నియంత్రణకు ఒక గొప్ప మార్గం. కొన్ని స్టడీస్ ద్వారా నిర్థానది ఏంటంటే వాల్ నట్స్ ను రెగ్యులర్ గా 6నెలలపాటు తిన్న వారిలో ఇన్సులిన్ లెవల్స్ పెరుగుదల, గణనీయంగా తగ్గిందని చెబుతున్నారు.

రెడ్ వైన్:

రెడ్ వైన్:

మధుమేహ నివారణకు రెడ్ వైన్ ఉపయోగిస్తుంటారు. కొందరి ఇళ్ళలో వైన్ వంటగదివస్తువుగా కొన్ని రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. రెగ్యులర్ గా రెడ్ వైన్ తీసుకొనే వారిలో మధుమేహ రిస్క్ ను తగ్గించాయని కనుగొన్నారు. భోజనం తర్వాత ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ అకస్మికంగా తగ్గడమే జరగవచ్చని పరిశోధకులు కూడా నిర్ధారిస్తున్నారు.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

టేస్టీ మరియు న్యూట్రిషియన్స్ ఉన్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్ ఏ వంటకైన అదనపు రుచిని అంధించాల్సిందే. వీటిలో ఆరోగ్యకరమైన ఫైబర్ మరియు ఓమేగా 3ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల అణువైన కణత్వచం నిర్వహించడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

మానవ శరీర మొత్తం ఆరోగ్యానికి మేలుచేసిది గ్రీన్ టీ. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెల్ డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది. గ్రీన్ టీ రక్తనాళాల వాపు నుండి రక్షించేందుకు సహాయపడుతుంది.

బ్లాక్ టీ:

బ్లాక్ టీ:

గ్రీన్ టీ వంటిదే, బ్లాక్ టీ కూడా మధుమేహగ్రస్తులకు ఉపయోగకరమైనది. ఇది శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ఒక కప్పు బ్లాక్ టీతో డయాబెటిస్ కంట్రోల్ చేయవచ్చు లేదా నివారించవచ్చు.

సోబనూడిల్స్:

సోబనూడిల్స్:

ఈ జపనీస్ పాస్తా గురించి మీరు విన్నారా? ఈ సోబా నూడిల్స్ బుక్వీట్ పిండి నుండి తయారు చేస్తారు. ఇది ఒక పండు విత్తనాల నుండి తయారు చేసే పిండి. ఈ సోబనూడిల్స్ టైప్ 1డయాబెటిస్ నయం చేయడానికి సహాయపడుతాయని నమ్ముతారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ల్ల బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను 12 నుండి 19శఆతం తగ్గించగలదు.

English summary

Prevent Diabetes With These Kitchen Ingredients

When you have been diagnosed with diabetes, it is only human tendency to completely freak out. However, this disease has become so common that one needs to accept the fact and move on by taking precautions.
Story first published: Wednesday, August 28, 2013, 18:33 [IST]
Desktop Bottom Promotion