For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం(చక్కెర వ్యాధి) నివారణకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు

|

మధుమేహం అనేది రక్తంలో అసాధారణ అధిక గ్లూకోజ్ స్థాయిలు గల ఒక వ్యాధి.అధిక మూత్రవిసర్జన మరియు నిరంతర దాహం అనే లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. సాదారణంగా మధుమేహం అనేది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది. సాధారణంగా మధుమేహ రోగులలో రక్తంలో చక్కర శాతం ఎక్కువ ఉంటుంది.

ఈ వ్యాధి వారసత్వంగా రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మధుమేహం రావటానికి వయసు, సరైన ఆహారం లేకపోవటం, ఒత్తిడి, స్థూలకాయం, రక్తపోటు మొదలైన కారణాల వల్ల వస్తుంది. మధుమేహంను నివారించడానికి కొన్నిముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాము.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి: కనీసం 25 నిమిషాలు రోజువారీ నడక, లేదా ఒక గంట వ్యాయామం చేయాలి.ఈవిధంగా చేయుట వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి క్రమ పద్దతిలో జరుగుయుంది. వ్యాయామం చేయటం అనేది మధుమేహ రోగులకు రోజు వారి జీవితంలో ఒక భాగంలా ఉండాలి. కానీ కొన్ని కార్యక్రమాలు మీకు సురక్షితంగా లేకపోతె వాటిని చేపట్టడానికి ముందు మీ వైద్యుడుని సంప్రదించటం మంచిది.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

మీరు తగినంత నిద్ర పోవాలి: సరైన నిద్ర లేకపోతె హార్మోన్ స్థాయి పెరగవచ్చు. మీరు ఒక గంట నిద్ర పొతే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచటానికి సహాయపడుతుంది.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం: ఎక్కువ ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారంను తినడానికి ప్రయత్నించండి. కాల్షియం కూడా ఇన్సులిన్ ఉత్పత్తి మరియు శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. విటమిన్లు తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ ను శక్తిగా మారుస్తుంది మరియు శరీరంనకు అవసరం అయిన రోగనిరోధక వ్యవస్థ పునర్నిర్మాణం చేసి హృదయ స్పందన సరిగా ఉండేలా చేస్తుంది. తృణధాన్యాలు, పచ్చటి కూరగాయలు, పెరుగు, పాలు వంటి ఆహార పదార్దాలు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం మానివేయాలి. ఒక్కసారిగా ఎక్కువ భోజనం చేయకూడదు. అయితే భోజనంను 5-6 సార్లుగా తీసుకోవాలి. ప్రతి రోజు నీటిని ఎక్కువగా త్రాగాలి.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

తియ్యటి ఆహార పదార్దాలకు దూరంగా ఉండాలి: మీ ఆహారం నుండి తియ్యటి పదార్దాలను దూరంగా ఉంచండి. షుగర్ లేని పదార్దాలకు ప్రాధాన్యం ఇవ్వండి. క్యాండీలు తినే బదులు ద్రాక్ష, స్ట్రాబెర్రీలు, అరటి మొదలైన పండ్లు తినడం మంచిది.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

నోటి సంరక్షణ: మధుమేహంతో బాధపడేవారు దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ దంతాలకు వాడే రోజువారీ బ్రష్ స్మూత్ గా ఉండేలా చూసుకోవాలి. చిగుళ్ళ నుండి రక్తస్రావం జరిగి ఉంటే, మీ దంతవైద్యుడు సంప్రదించండి, లేకపోతె చిగుళ్ళ వ్యాధులకు దారితీస్తుంది.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

పాదాల సంరక్షణ: మధుమేహంతో బాధపడేవారికి పాదాలు మరియు కాలిలో నరాలు దెబ్బతింటాయి. మధుమేహం ఉన్న సమయంలో సాదారణంగా పుళ్ళు, బొబ్బలు వస్తు ఉంటాయి. మీ పాదం పరిశీలించేందుకు మరియు మీ కాలి మధ్యలో క్లీన్ సాక్స్ ఉపయోగించడం మొదలు పెట్టాలి. బిగుతైన బూట్లు ధరించకూడదు. చెప్పులు లేకుండా ఉండకూడదు.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

రెగ్యులర్ పరిశీలన: మధుమేహం నివారించడానికి ఉత్తమమైన పద్ధతులలో ఒకటి మీ డాక్టర్ తో సాధారణ చెకప్ చేయించుకోవాలి. మీరు ప్రతి వారం మీ చక్కెర స్థాయిని పర్యవేక్షించుకోవాలి. దీని వల్ల నివారణ చర్యలు తెలుసుకోవటానికి సహాయం చేస్తుంది మరియు మీరు సరైన స్థాయిల్లో ప్రతిదీ ఉంచడానికి సహాయం చేస్తుంది.

షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

ఒబేసిటీ: మధుమేహం రావటానికి ఒబేసిటీ కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవాలి. ధూమపానం మరియు మద్యపానము మానుకోండి. మధుమేహం నివారించడం నిజంగా ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని గడపటానికి ఉపయోగపడుతుంది.

English summary

Some Important Tips to Prevent Diabetes...! | షుగర్ వ్యాధిని ఇలా నియంత్రించండి..!

Diabetes a polygenic disease characterized by abnormally high glucose levels in the blood; any of several metabolic disorders marked by excessive urination and persistent thirst. In simple words, diabetes occurs due to a relative or absolute deficiency of insulin.
Story first published: Wednesday, March 20, 2013, 17:59 [IST]
Desktop Bottom Promotion