For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహంను ఓడించటానికి వండర్ ఆహారాలు

By Super
|

డయాబెటిస్ అనేది నిశ్శబ్దంగా ఒక వ్యక్తిని చంపే వ్యాధిగా చెప్పవచ్చు. మీరు తగినంత శ్రద్ధ మరియు సంతోషకరమైన జీవనం కొరకు దీనిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవటం అత్యవసరం. మీరు మధుమేహంనకు గురి అయినప్పుడు" ఒక ఆరోగ్యకరమైన జీవనానికి ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం" అని చెప్పవచ్చు. వాస్తవానికి కొంత శారీరక శ్రమ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీరు డయాబెటిస్ ను ఓడించాలని అనుకున్నప్పుడు సరైన మార్గం ఆహారం మాత్రమే అని చెప్పవచ్చు.

కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి ఆరు సెకన్లకు మధుమేహంతో ఒక వ్యక్తి చనిపోతున్నారని నిరూపణ జరిగింది.

గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు మధుమేహం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మధుమేహం ఓడించటానికి ఒక పరిష్కారంను కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ మధుమేహ దినోత్సవంను అంతర్జాతీయ స్థాయిలో వివిధ మార్గాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించే లక్ష్యంగా పెట్టుకొని నిర్వహిస్తుంది. స్థూలకాయం మరియు జీవన శైలి సమస్యలు మధుమేహంనకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అందువల్ల మనకు వ్యాధి రాకుండానే శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఇక్కడ మీరు మధుమేహంను ఓడించటానికి సహాయం కొరకు కొన్ని వండర్ ఆహారాలు ఉన్నాయి.

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు

రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు

ప్రసిద్ధ చెందిన సామెత ప్రకారం రోజు ఆపిల్ వినియోగించుట వలన మీరు మధుమేహంను ఓడించటానికి సహాయపడుతుంది. దీనిలో కేలరీలు తక్కువగా,పీచు అధికంగా ఉండుట వల్ల ఆపిల్ మధుమేహ ఆహారంలో ఒక వండర్ ఆహారం అవుతుంది. మంచి ఫలితాల కోసం తొక్క తీయకుండా తినడానికి ప్రయత్నించాలి.

చేపలు

చేపలు

మధుమేహ ఆహారంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గొప్ప ఆవశ్యకతను కలిగి ఉన్నాయి. దానిని ఎక్కడ కనుగొనాలి? అయితే మీరు సాల్మొన్ వంటి మంచి నీటి చేపలు, సార్డిన్లు, మార్కెల్ మొదలైన వాటిలో పొందవచ్చు. అవి రుచికరమైనవి మరియు మీ చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది

ఆకుపచ్చని కూరలు

ఆకుపచ్చని కూరలు

మధుమేహంను ఓడించటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి "ఆకుపచ్చని కూరలు" అని చెప్పవచ్చు. మీ ఆహారంలో వెజ్జీస్ ను జోడించండి. అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. డయాబెటిస్ వలన వచ్చే దృష్టి సమస్యలు తగ్గటానికి ఆకుపచ్చని కూరలలో సమృద్ధిగా ఉండే విటమిన్ B మరియు విటమిన్ సి సహాయం చేస్తాయి.

వోట్ మీల్ ఆహారాన్ని ప్రయత్నించండి

వోట్ మీల్ ఆహారాన్ని ప్రయత్నించండి

వోట్ మీల్ అల్పాహారం మీకు మధుమేహంను ఓడించటానికి మెరుగ్గా సహాయం చేస్తుంది. వోట్ మీల్ లో ఫైబర్ మూలం ఉండుటవలన రక్తంలో పిండి పదార్థాలు చక్కెరగా మారటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇకనుంచి ప్రతి ఉదయం వోట్ మీల్ ను అల్పాహారంగా తీసుకోవటానికి ప్రయత్నించండి.

ఒక కప్పు టీ

ఒక కప్పు టీ

మీరు ఒక టీ ప్రేమికుడు అయితే,ఇక్కడ మీ కొరకు ఏదో ఉంది! టీ లో టానిన్లు మరియు కాటెచిన్స్ ఉండుట వలన బ్లడ్ షుగర్ స్థాయిలను నిర్వహించటానికి సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా టీ త్రాగి మధుమేహంను ఓడించవచ్చు.

ఫ్రూట్ డైట్

ఫ్రూట్ డైట్

మీరు మధుమేహంను ఓడించాలని అనుకుంటే మీ ఆహారంలో పండ్లు ఉండవలసిన అవసరం ఉంది. మీ ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉన్న కొన్ని సిట్రస్ పండ్లను జోడించండి. విటమిన్ సి ఉన్న పండ్లలో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అవి ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి.

క్యారట్

క్యారట్

బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉన్న క్యారట్ ప్రకృతి ఇచ్చిన వరం అని చెప్పవచ్చు. ఇది మధుమేహంను ఓడించటానికి సహాయం చేస్తుంది. మధుమేహం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మీరు మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఒక క్యారట్ ను తీసుకోండి.

ఆలీవ్ ఆయిల్ ను ప్రయత్నించవచ్చు

ఆలీవ్ ఆయిల్ ను ప్రయత్నించవచ్చు

ఆలివ్ నూనె లో శోథ నిరోధక లక్షణాలు ఒక మెరుగైన మార్గంలో మధుమేహంను ఓడించటానికి సహాయపడతాయి. ఆలివ్ నూనెలో ఉండే మంచి కొవ్వు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. మీ ఆహారం రుచిగా చేయడానికి కూడా ఆలివ్ నూనెను జోడించండి.

నట్స్ మంచివి

నట్స్ మంచివి

నట్స్ అనేవి మధుమేహ ఆహారంలో ఒక భాగంగా ఉన్నాయి. నట్స్ ఆరోగ్యకరమైనవే కాకుండా గుండె వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ మరియు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

పైటో పోషకాలు వినియోగించండి

పైటో పోషకాలు వినియోగించండి

పైటో పోషకాలు కలిగిన బీన్స్ మధుమేహంను ఓడించటానికి సహాయం చేస్తుంది. మీ ఆహారంలో ప్రోటీన్ సమృద్దిగా ఉన్న నానబెట్టిన లేదా కాల్చిన బీన్స్ ను జోడించండి. ఇది రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది. కాబట్టి దీనిని ఒకసారి ప్రయత్నించండి.

English summary

Wonder foods to beat diabetes

Diabetes is a disease that kills a person silently. It is imperative that you take adequate care and measures to control it for a happy living. When you are affected by diabetes the mantra is “healthy diet for a healthy living, of course, with some physical activity”. If you want to beat diabetes then a proper diet is the only way.
Story first published: Tuesday, November 19, 2013, 9:49 [IST]
Desktop Bottom Promotion