For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యంగా బరువు పెరగడానికి 20 ఉత్తమ మార్గాలు

By Super
|

ఒక ఆరోగ్యకరమైన శరీరం పొందడానికి రహస్యంగా ఆరోగ్యకరమైన ఆహారం ఎల్లప్పుడూ ఉంది. అయితే ప్రస్తుత రోజుల్లో అనేక మంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు, వారిలాగే మరికొంత మంది బరువు పెరగాలనే కోరికను కలిగి ఉన్నారు . బరువు పెరడగం చాలా సులభం అని మీరు భావిస్తూ ఉండవచ్చు. అందుకు కేవలం, ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే చాలు ఆటోమాటింక్ గా బరువు పెరవచ్చు అనుకుంటారు.కానీ ఇలా చేయడం ఖచ్చితంగా ఆరోగ్యకరమైన మార్గం కాదు.

ఆరోగ్యకరంగా ఉంటూనే బరువు పెరగడం అనేది ఒక చాలెంజ్ వంటిదే, అయితే బరువు అదిగమించడానికి అంత కష్టమైన పనేం కాదు. అందుకు మీరు కేవలం కేలరీలు అధికంగా ఉన్నా మరియు సరైన పోషకాంశాలు కలిగి ఆహారాలను తీసుకోవడమే. అధిక ప్రోటీనులున్న ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీరంలో కండరాలు ఏర్పడటానికి మరియు బరువు పెరగడానికి బాగా సహాయపడుతాయి.

అంతే కాదు బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా హెల్తీ లైఫ్ స్టైలన్ ను మెయింటైన్ చేయాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా, క్రోనిక్ సమస్యలు లేకుండా బరువును క్రమంగా పెంచుకోవచ్చు. సెడన్ గా బరువు పెరగడం వల్ల ఊబకాయం, బరువు వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది . కొన్ని సందర్భాల్లో ఆకలి లేకపోవడం వల్ల కూడా బరువు కోల్పోతుంటారు. ఇలా జరగకుండా హెల్తీగా బరువు పెరగడానికి కొన్ని ఉత్తమ పద్దతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం...

 డిన్నర్ కు ముందు వైన్ తీసుకోవాలి:

డిన్నర్ కు ముందు వైన్ తీసుకోవాలి:

వైన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తక్కువగా ఉన్నవారు, ఒక గ్లాస్ వైన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు టానిన్స్ వ్యాధినిరోధకతను పెంచుతాయి. దాంతో ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.

పెరుగు:

పెరుగు:

కార్డియో వాస్కులార్ వ్యాయామాలు బరువు పెరగడానికి సహాయపడుతాయి. అంతే కాదు, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతాయి. అయితే, వ్యాయామాల్లో భాగంగా బరువులు ఎత్తడం వల్ల బరువు పెంచుకోవచ్చు. కండరాలు ఫిట్ గా తయారవుతాయి. మరియు ఆరోగ్యంగా ఉంటారు. మెటబాలిజం రేటును పెంచి కండాలను బలోపేతం చేస్తుంది. బాడీ మాస్ మెరుగుపరుచుకోవడానికి వెయిట్ లిప్టింగ్ ఒక ఉత్తమ ఉపాయం

తక్కువగా నీరు త్రాగాలి:

తక్కువగా నీరు త్రాగాలి:

నీరు ప్రతి ఒక్క జీవికి అత్యంత అవసరం అయినటువంటి వనరు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరు త్రాగినా పొట్టనింపుతుంది, జీవక్రియలు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది. కాబట్టి, కొన్ని సందర్భాల్లో నీటి అవసరం చాలా ఉంది. అయితే భోజనం సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నీటిలో క్యాలరీలు లేకపోవడం వల్ల మిమ్మల్ని బరువు పెరగనివ్వదు. కాబట్టి, బరువు పెరుగాలనుకొనే వారు నీరు తక్కువగా త్రాగాలి.

వ్యాయామం తర్వాత భోజనం చేయాలి:

వ్యాయామం తర్వాత భోజనం చేయాలి:

మీ శరీరంలో అధిక స్థాయిలో పనిచేస్తున్నప్పుడు రక్తం ఎక్కువగా పంప్ చేస్తుంది, అప్పుడు మీలో మెటబాలిజం కూడా హైలో ఉంటుంది . ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలను గ్రహిస్తుంది. వ్యాయామం తర్వాత జీవక్రియలు చురుకుగా ఉండటం వల్ల, అలాంటి సమయంలో ఆహారం తీసుకుంటే, చాలా త్వరగా జీర్ణం అయ్యి, క్యాలరీలను శరీరం గ్రహించేలా చేస్తుంది.

ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి:

ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి:

మీరు తీసుకొనే ఆహారం చాలా తక్కువగా ఉన్నట్లైతే, బరువు పెరగాలనుకొనేవారు తీసుకొనే ఆహారం యొక్క మోతాదాను పెంచాలి. మోతా ఎక్కువ అంటే మరీ ఎక్కువగా కాదు, మీకు కడుపు నిండేంత తీసుకోవాలి. మిగిలిన సమయంలో స్నాక్స్ తీసుకుంటుండాలి. రోజులో మూడు ఫుల్ మీల్స్ రెండు హెల్తీ స్నాక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా బరువు పెంచుకోవచ్చు.

తినే ఆహారంను బాగా నమిలి తినాలి:

తినే ఆహారంను బాగా నమిలి తినాలి:

మీరు తినే ఆహారం బాగా నమిలి తినాలి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కు సహాయపడుతుంది మరియు దాంతో మీకు సాద్యమైనంత వరకూ క్యాలరీలను గ్రహించవచ్చు. లేదంటే క్యాలరీలు వేస్ట్ అయిపోతాయి.

ఎక్కువ సార్లు తినాలి:

ఎక్కువ సార్లు తినాలి:

మరో మార్గం మీరు రోజులో తీసుకొనే మూడు సార్ల భోజనాన్ని విడగొట్టి ఐదు, ఆరు సార్లు మరికొంత ఆహారాన్ని చేర్చి తీసుకోవాలి. ఇందులో రెండు ఫుల్ మీల్స్, రెండు హెల్తీ స్నాక్స్ ఇలా తీసుకంటే ఆరోగ్యంగా బరువు పెరుగుటకు సహాయపడుతుంది.

పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి:

పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి:

పెరుగులో అధిక క్యాలరీలు ఉండటం మాత్రమే కాదు, ఇది ఒక ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కలిగినది. ఇది శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మీరు తీసుకొనే ఆహారం ద్వారా పోషకాంశాలను పొందవచ్చు. దాంతో ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు.

 జంక్ ఫుడ్ నివారించాలి:

జంక్ ఫుడ్ నివారించాలి:

జంక్ ఫుడ్ తీసుకోడం ఒక సులభమైన మార్గమే కావచ్చు, కానీ వీటిలో ట్రాన్స్ ఫ్యాట్స్, సాల్ట్ మరియు అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇవన్నీ మితగంగా శరీరానికి అందజేస్తే హెల్తీగా బరువు పెరగవచ్చు .

 డైట్ ను మెయింటైన్ చేయాలి:

డైట్ ను మెయింటైన్ చేయాలి:

చాలా మంది చాలా తక్కుగా పనిచేసి, ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తుంటారు. అనుకోకుండా మీలో ఏవైనా కొత్తగా చెడు అలవాట్లును చేసుకోవడం వల్ల బరువు తగ్గడం తో పాటు, ఆరోగ్యం మీద చెడు ప్రభావాలను ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి, హెల్తీ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేయాలి.

తగినన్ని క్యాలరీలను పొందాలి:

తగినన్ని క్యాలరీలను పొందాలి:

ప్రతి ఒక్క వ్యక్తి డిఫరెంట్ గా ఉంటారు, కాబట్టి, బరువు పెరుగడానికి ప్రతి ఒక్క వ్యక్తి డిఫరెంట్ క్యాలరీలు అవసరం అవుతాయి. కాబట్టి, మన శరీరానికి ఎంత మోతాదులో క్యాలరీలు అవసరం అవుతాయో బిఎమ్ ఐ(బాడీమాస్ ఇండెక్స్ )ద్వారా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనం తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకొన్నట్లైతే మంచి ఫలితం పొందవచ్చు . మంచిగా బరువు పెరగవచ్చు.

 నట్ మరియు పిస్తాలు:

నట్ మరియు పిస్తాలు:

మీ రెగ్యులర్ డైట్ లో పిస్తా, నట్స్, వాల్ నట్స్, మరికొన్ని పోషకాలు, న్యూట్రీషియన్స్ , ఫైబర్ ఫుడ్స్ ను చేర్చుకోవాలి . స్నాక్స్ గా తీసుకొనే ఆహారంలో ఫైబర్ కలిగిన ఆహారాలు వీట్

బ్రెడ్, త్రుణధాన్యాలతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు పెంచుకోవచ్చు.

 సమయానికి భోజనం చేయాలి:

సమయానికి భోజనం చేయాలి:

మన శరీరంలో జీవక్రియలన్నీ సమయం ప్రకారం నడుచుకుంటాయి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మీరు సరైన సమయంకు భోజనం తీసుకోవడం వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేస్తూ, జీర్ణక్రియను మెరుగుపరిచి, తీసుకొన్ని ఆహారం జీర్ణం అయ్యేలా చేయడంమాత్రమే కాదు, క్యాలరీలను, న్యూట్రీషియన్స్, ప్రోటీలను శరీరానికి అందేలా చేయడంతో హెల్తీగా బరువును పెంచుకోవచ్చు.

 భోజనం దాటవేయకూడదు:

భోజనం దాటవేయకూడదు:

ఆకలి లేదని తినకుండా ఉండకూడదు. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ ను మిస్ చేయకూడదు. తర్వాత ఒకే సారి భోజనానికి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల , ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, టైం టు టైం భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు మరియు హెల్తీగా బరువు పెరగవచ్చు.

వేగంగా బరువు పెరగడానికి ప్రయత్నించకూడదు:

వేగంగా బరువు పెరగడానికి ప్రయత్నించకూడదు:

హెల్తీగా బరువు పెరడంలో చాలా మంది చేసే ఒక పెద్ద తప్పిదం. ఒకటి రెండు వారాల్లోనే బరువు పెరగాలని క్రాస్ డైట్ ను అనుసరించడంవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వేగంగా బరువు తగ్గాలనుకొనే వారు డైటీసియన్స్ ను కలిసి డైట్ ట్రైరింగం తీసుకోవాలి.

ప్రోటీనులు ఎక్కువగా తీసుకోవాలి:

ప్రోటీనులు ఎక్కువగా తీసుకోవాలి:

చర్మం, కణాలు, రక్తం, అవయవాలు, కండరాలు, మరియు లిప్స్ అన్నింటికి ప్రోటీనులు చాలా అవసరం అవుతుంది. మీరు వేగంగా బరువు పెంచుకోవాలనుకుంటే, మీ రెగ్యులర్ డైట్ లో ఎక్కువ ప్రోటీనులను తీసుకోవాలి . ప్రోటీనులు తీసుకోకుండా బరువు పెరగడం కష్టం అవుతుంది.

ఆయిల్ వాడకం పెంచాలి :

ఆయిల్ వాడకం పెంచాలి :

బరువు పెరగడానికి మరో ఉత్తమ మార్గం, రెగ్యులర్ డైట్ లో ఆయిల్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం పెంచాలి. ఫ్యాట్ పుడ్ తీసుకోవడం అనారోగ్యరమైన ఎంపిక ,కాబ్టటి, సరైన ఫ్యాట్స్ ను పొందడానికి ఒమేగా3ఎస్ ను ప్రత్యేక వెజిటేబుల్స్ ను ండి పొందాలి. ఆలివ్ ఆియల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను మెరుగుపరుచుకోవచ్చు. క్రమంగా బరువు పెరగవచ్చు.

రెగ్యులర్ చెకప్:

రెగ్యులర్ చెకప్:

బరువు పెరిగే క్రమంలో రెగ్యులర్ చెకప్ చాలా అవసరం. హార్మోనుల అసమతుల్యత ఏర్పడకుండా రెగ్యులర్ చెకప్ చేయించుకొని, దానికి ప్రకారం, వ్యాయామం మరియు డైట్ ప్లాన్ చేసుకోవాలి .

మీ శరీరం గురించి తెలుసుకోవాలి :

మీ శరీరం గురించి తెలుసుకోవాలి :

మీ శరీర తత్వాన్ని బట్టి, బరువును వివిధ మార్గాల్లో పెంచుకోవచ్చు. షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అవి మీకు సమాయపడకపోవచ్చు . వీటికి ప్రత్యామ్నాయంగా నేచురల్ షుగర్స్, ఫ్యాట్ కలిగిన ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి.

డైటరీ సప్లిమెంట్:

డైటరీ సప్లిమెంట్:

ఇది ఒక చివరి ఆప్షన్ డైటరీ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. డైటరీ ఫుడ్స్ తీసుకోవడానికి ముందు ఫిజీషియన్ మరియు డైటీషియన్ ను తప్పనిసరిగా కలవాలి. అవసరం అయితే డైట్ సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు.

Desktop Bottom Promotion