For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిస్ ను కంట్రోల్ చేసే 7 సూపర్ ఫుడ్స్

|

ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. మరియు ఈ వ్యాధికి నివారణ కూడా లేదు. కాబట్టి, ఈ మధుమేహ వ్యాధి రాకుండా నివారించుకోవడం.. ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే ఇదివరికటికే ఈ వ్యాధితో బాధపడేవారు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ తో మరియు డైట్ తో మరియు జీవన శైలిలోని మార్పులతో కంట్రోల్ చేసుకోవచ్చు.

ఒబేసిటి కూడా డయాబెటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి, తరచూ మీ బాడీ వెయిట్ మీద ఒక కన్నేసి ఉంచడం చాలా అవసరం, అలాగే ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో కూడా గమనిస్తుండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓమేగా 3 మరియు ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

దీర్ఘకాలంలో కొన్ని ప్రత్యేక ఆహారాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. మీకోసం డయాబెటిక్ ను కంట్రోల్ చేసే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను పరిచయం చేస్తున్నాము. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు రెగ్యులర్ గా బ్లడ్ షుగర్ లెవల్స్ ను గమనించుకోవచ్చు . మరియు డయాబెటిస్ రాకుండా నివారించుకోవచ్చు. మరి ఆ ఆహారాలేంటో ఒక సారి ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

అవొకాడో :

అవొకాడో :

మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది . ఇది జీర్ణవ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతుంది . అవొకాడోలో ఉండే మంచి ఫ్యాట్స్ డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది.

 జామకాయ:

జామకాయ:

డయాబెటిక్ పేషంట్స్ కు జామకాయ చాలా మంచిది. జామకాయలో విటమిన్ సి మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఫ్లాక్స్ సీడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసి డయాబెటిక్ ప్రమాదాన్ని

తగ్గిస్తుంది.

 పీనట్ బట్టర్:

పీనట్ బట్టర్:

పరిశోధనల ప్రకారం, పీనట్ బటర్ డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది. పీనట్ బట్టర్ లో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి . ఇవి హార్ట్ హెల్తీ ఫుడ్స్.

యాపిల్స్:

యాపిల్స్:

ఆపిల్లో ఫైబర్ అధికంగా ఉండే మంచి ఆహారం . ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఫ్రీరాడికల్స్ ను నివారించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్డులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కనుగొన్నారు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది.

చేపలు:

చేపలు:

డయాబెటిక్ పేషంట్స్ చేపలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు . డయాబెటిస్ ను నివారించడంలో ఇవి చాలా ఉపయోగకరమైనవి .

English summary

7 Super Foods That Combat Diabetes: Health Tips in Telugu

Diabetes is one of the most common diseases in today's world. Although there is no cure for this disease, it can be controlled by using simple home remedies and making changes in the diet and lifestyle. Obesity can also induce or effect diabetes.
Story first published: Monday, October 5, 2015, 17:57 [IST]
Desktop Bottom Promotion