అలర్ట్ : షుగర్ లెవల్స్ పెరగడానికి, డయాబెటిస్ కు కారణం మీ ఈ డైలీ హ్యాబిట్సే..!!

కొన్ని డైలీ హ్యాబిట్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. డయాబెటిస్ కు కారణం, బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతలు, రోజువారి కారక్యక్రమాల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచే కొన్ని విషయాలు

Posted By:
Subscribe to Boldsky

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ సమస్య ఎక్కువగా ఉన్నది. డయాబెటిస్ కు వివిధ రకాల కారణాలున్నాయి. వాటిలో స్ట్రెస్ కూడా ఒకటి. అలాగే రెగ్యులర్ గా మన దినచర్యంలో భాగంగా కొన్ని పనులు చేస్తుంటాము. ఎక్కువ సమయం టీవి చూడటం, ఫ్రూట్ జ్యూసులు తాగడం, కొన్ని సందర్భాల్లో బ్రేక్ ఫాస్ట్ ను తినకుండా స్కిప్ చేయడం చేస్తుంటారు.

ఇలాంటి డైలీ హ్యాబిట్స్ వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతలు ఏర్పడుతాయి. డయాబెటిస్ కు కారణం, బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతలు, రోజువారి కారక్యక్రమాల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచే కొన్ని విషయాలు ఈ క్రింది విధంగా ..

బ్రేక్ ఫాస్ట్ స్కిన్ చేయడం:

సాయంత్రంలో ఆఫీ నుండి లేట్ గా రావడం లేదా లేట్ నైట్ డిన్నర్ లేదా హెవీ డిన్నర్ చేయడం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల నిన్న రాత్రి భోజనం తర్వాత , మరుసటి రోజు మద్యహ్నానం వరకు (ఎక్కువ సమయం)పొట్ట ఖాలీగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి . మరియు ఇన్పులిన్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో డయాబెటిస్ కు కారణమవుతుంది.

టీవీ చూడటం:

డయాబెటాలజీ అనే పరిశోధనల ద్వారా, రోజంతా టీవీలకు అత్తుక్కుపోయి చూస్తుంటారు. ఇలాంటి వారిలో 3.4% డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయి . రోజులో ఎక్కువ సమయం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల క్రమంగా శరీరంలో బరువు పెరుగుతుంది. అధిక బరువు వల్ల డయాబెటిస్ కు కారణమవ్వొచ్చు.

పగటి నిద్ర:

మీకు తెలియకుండానే పగటి పూట కునుకు తీస్తున్నారు. అయితే రిస్క్ లో పడ్డట్లే, పగటి పూట ఎక్కువ సమయం నిద్రించే వారిలో డయాబెటిక్ రిస్క్ పెరుగుతున్నట్లు రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక గంట కంటే ఎక్కువ సమయం నిద్రించే వారిలో 46 % శాతం డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లు కనుగొన్నారు .

నైట్ షిట్స్ పనిచేసే వారిలో:

రాత్రుల్లో ఎక్కువ సమయం మేల్కోవడం , లేదా నైట్ షిఫ్ జాబ్స్ ను ఎంపిక చేసుకోవడం వల్ల డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. నైట్ షిప్ట్ లు పనిచేసే వారిలో 1-2సంవత్సరాల లోపు 17% పెరుగుతుంది, 3-9ఏళ్ల లోపు 23% , 10ఏళ్ళ లోపు వారిలో 42% పెరుగుతున్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు.

సోడా తాగడం:

రోజూ ఒక గ్లాస్ స్వీట్ బెవరేజ్ అయిన సోడాను తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ఎందుకంటే వీటిలో ఫ్రక్టోజ్ లెవల్స్ అధికంగా ఉంటాయి . ఇది బ్లడ్ లెవల్స్ ను పెంచుతయాని యూరోపియన్ అసోసిఏషన్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ పరిశోధనల్లో నిర్ధారించారు.

ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లు తాగడం:

డయాబెటిక్ వారికి ఫ్రూట్ జ్యూస్ లు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. కాబట్టి, ఫ్రూట్ జ్యూసుల కంటే ఫ్రూట్స్ ను తినడం ఉత్తమం.

వాతావరణం:

వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతలో మార్పులు మన శరీంలో బ్లడ్ షుగర్ వెల్స్ మీద ప్రభావం చూపుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి, మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నట్లైతే చాలా వేడి లేదా చాలా చల్లగా ఉండే ప్రాంతాల్లో నివశించకపోవడం మంచిది.

స్మోకింగ్ :

స్మోకింగ్ వల్ల ఒక్క రెస్పరేటరీ సమస్యలు మాత్రమే కాదు, హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. దాంతో డయాబెటిస్ వారిలో హెల్త్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి.

బంగాళదుంపలు:

బంగాళదుంపను పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు, పరిమితంగా తీసుకుంటే మంచిది.కాంప్లెక్షన్స్ కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బంగాళదుంపల్లో గ్లిసిమిక్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. ఇది బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను వేగంగా పెంచుతుంది. కాబట్టి, ఉడికించిన బంగాళదుంపలను తినడం కంటే, దుంపలను కర్రీ, సలాడ్స్ రూపంలో తీసుకోవడం మంచిది.

కాఫీ:

హైపర్ టెన్షన్ తో బాధపడే వారు డయాబెటిస్ ఉన్న వారను బ్లడ్ షేగర్ లెవల్స్ ను తగ్గించుకోవడం చాలా అవసరం. అందుకు కాఫీకి దూరంగా ఉండాలి. ఎక్సెస్ కాఫీ తాగడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ ను అసమతుల్యతలు ఏర్పడుతాయి.

" కంపేర్ & బై " బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్

English summary

10 everyday things that increase your blood sugar level

Diabetes - the very word can make us feel tensed with worry and anxiety, as we all know how this disease can affect an individual. Most of us would know someone who has been affected by this disease or we ourselves may be the victims of diabetes.
Please Wait while comments are loading...
Subscribe Newsletter